హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

పల్నాడులో కాశీ విశ్వేశ్వరుడు.. సాంబడిని దర్శిస్తే సంతానం లేనివాళ్లకు సంతానప్రాప్తి..!

పల్నాడులో కాశీ విశ్వేశ్వరుడు.. సాంబడిని దర్శిస్తే సంతానం లేనివాళ్లకు సంతానప్రాప్తి..!

పల్నాడులోని

పల్నాడులోని కాశీ విశ్వేశ్వర ఆలయం

హిందువులు (Hindus) శివయ్యను వివిధ రూపాల్లో కొలుస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వివిధ పేర్లతో శివాలయాలు వెలిశాయి. వీటిలో పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీశైలం (Srisailam) నుంచి సామర్లకోట వరకు శివాలయాలకు ప్రత్యేక స్థానం ఉంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Sumanth, News18, Guntur

  శివుడంటే కోరిన కోరికలు నెరవేర్చే దేవుడిగా నమ్మకం. అందుకే హిందువులు (Hindus) శివయ్యను వివిధ రూపాల్లో కొలుస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వివిధ పేర్లతో శివాలయాలు వెలిశాయి. వీటిలో పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీశైలం (Srisailam) నుంచి సామర్లకోట వరకు శివాలయాలకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి పురాతన ఆలయమే ఉమ్మడి గుంటూరు జిల్లా (Guntur District) పరిధిలోని పల్నాడు జిల్లాలో ఉంది. సంతాన సాంబశివుడిగా పేరు సిద్దులు పూజించిన స్వయంభువు కావడంతోనే కోరిన కోర్కెలు సిద్దిస్తాయని భక్తులు నమ్మకం.. దక్షిణాభిముఖంగా కొలువైన అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో ధనధాన్యాలకు కొదవలేదన్న విశ్వాసం... జీవితంలో ఒక్కసారైన పల్నాడు కాశిని దర్శించుకొవాలని పల్నాడు వాసులు కోరుకుంటారు.

  పల్నాడు జిల్లా నకరికల్లు మండలం నరసింగపాడులో అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. నల్లమల ప్రాంతానికి అతి సమీపంలో శివుడు స్వయంభువుగా వెలిశాడు. 1794 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. గుత్తికొండ బిలంలో తమస్సు ఆచరించే సిద్దులు, మునులు నిశి రాత్రి సమయంలో నరసింగపాడు వచ్చి కాశీ విశ్వేశ్వర స్వామికి అభిషేకాలు చేసేవారని ప్రతీతి.

  ఇది చదవండి: ఏపీలో మహీష్పతి సామ్రాజ్యం.. అప్పటి ఆలయం ఇంకా ఉంది.. మీరూ చూస్తారా..?

  నరసరావు పేట జమీందారులు ఇచ్చిన అగ్రహారం భూముల్లోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. కాలక్రమంలో భక్తుల రాక లేకపోవడంతో పాడుపడిపోయింది. దీంతో పమిడిమర్రు వంశస్తులు కాశీ నుంచి లింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేసినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆలయ అర్చకులు కొమ్మవలపు వంశం వాళ్లే దేవాలయంలో నిత్యపూజలు నిర్వహిస్తున్నారు.

  ఇది చదవండి: ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శిస్తే.. వెయ్యిమంది మునుల తపస్సు ఫలితం పొందుతారు..!

  ఈ గ్రామానికి చుట్టు పక్కల ఉన్న భక్తులు తెల్లవారిన తర్వాత దేవాలయానికి వచ్చి చూస్తే స్వామి చుట్టూ దేవతా పుష్పాలు మారుతూ ఉండేవట.. అందుకే గుత్తికొండ బిలం నుండి సిద్దులు వచ్చి అభిషేకం చేసినట్లుగా భావించేవారట. అదేవిధంగా కొంతమంది భక్తులకు సిద్దులు కన్పించారని చెప్పుకుంటారు.

  ఇది చదవండి: చీరాల.. మళ్లీ మళ్లీ రావాల..! అక్కడ స్పెషల్ ఏంటో తెలిస్తే థ్రిల్ అవుతారు..! ఇంతకీ ఏముందంటే..!

  ఈ నరసింగపాడు గ్రామంలో నీరు పాతాళగంగలా ఉద్భవిస్తుంది. ఏ కాలంలోనైనా ఈ ప్రాంతంలో నీరు పుష్కలంగా దొరుకుతుంది. అంతేకాదు ఇక్కడ పాడిపంటలకు ఆ కాశీవిశ్వేశ్వరుడి దయ వల్ల ఎలాంటి లోటు లేదని గ్రామస్తులు చెబుతుంటారు. వర్షాలు పడినా పడకపోయినా, కాలువలు వచ్చినా రాకపోయినా నీటి కొరత ఉండదని …ఏడాది పొడవునా ఇక్కడ రైతులు పంటలు వేస్తుంటారు.

  ఇది చదవండి: విశాఖ బీచ్‌ రోడ్‌లో ఫేమస్‌ స్ట్రీట్‌ స్నాక్ ఏంటో తెలుసా..? ఎవ్వరికైనా నోరూరాల్సిందే..!

  సిద్దులు పూజించిన శివలింగం కావటంతో కోరిన కోర్కెలు సిద్దిస్తాయని భక్తుల విశ్వాసం. అత్యంత్య పురాతన దేవాలయం కావటంతో పల్నాడులోని ఇతర ప్రాంతాల నుండి భక్తులు నరసింగపాడుకు తరలి వస్తుంటారు. ఒక్కసారైనా స్వామి వారిని దర్శించి సేవించాలని భావిస్తుంటారు. ఈ కాశీ విశ్వేశురునికి సంతాన సాంబశివుడిగా మరొక పేరుంది.

  ఇది చదవండి: సిక్స్ ప్యాక్ బాడీపై పెరుగుతున్న క్రేజ్.. కానీ అంత ఈజీ కాదంటున్న ట్రైనర్లు..!

  ఇక్కడ సాంబశివుడిని కొలిచి ప్రదక్షిణలు చేస్తే పుత్ర సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. మరొక విశేషం ఏటంటే బాలారిష్ట దోషాలు ఉన్న వారు ఇక్కడ అభిషేకం చేయించుకుంటే తొలగిపోతాయని నమ్మకం. పల్నాడు బ్రహ్మనాయుడు కొడుకు బాల చంద్రుడుకి పుట్టుకతోనే దోషాలు ఉన్నాయని అవి తొలగి పోవటానికి ఇక్కడే పూజలు చేయించారని పల్నాడు వాసులు విశ్వసిస్తారు. ఆ తర్వాతే బాల చంద్రుడు పల్నాటి యుద్దంలో పాల్గొని వీరవంతుడిగా కొలవబడ్డాడని ప్రతీతి.

  ఇది చదవండి: స్వయానా గాంధీజీ ప్రారంభించిన ఆశ్రమం.. మన నెల్లూరులో ఉందని మీకు తెలుసా..?

  ఈ ఆలయంలో కాల సర్పదోష పూజలు కూడా జరగుతాయి. ఇక్కడ కొలువైన అన్నపూర్ణ దేవి దక్షిణ ముఖంగా ఉంటుంది. సాధారణ దేవాలయాల్లో అమ్మవారు తూర్పు లేదా ఉత్తర ముఖంగా కొలువై ఉంటారు. కాని ఇక్కడ మాత్రం అమ్మవారు దక్షిణ ముఖంగా కొలువై ఉన్నారు. అందుకే ఈ ప్రాంతంలో పాడి పంటలకు కొరత ఉండదని పల్నాటి వాసులు విశ్వసిస్తున్నారు. అందుకు తగినట్లుగానే నరసింగపాడు పరిసర ప్రాంతాల్లో మూడు పంటలు పండుతాయి.

  ఇది చదవండి: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి బిజినెస్‌లోకి ఎంట్రీ..! దేశీ లస్సీతో గుంటూరు కుర్రాడి సక్సెస్‌..!

  దక్షిణకాశీగా ప్రసిద్ధిచెందిన ఈ ఆలయం, సువిశాలమయిన లోగిలిలో ప్రశాంతమయిన వాతావరణంలో కొలువైఉంది. కార్తీక మాసంలో వివిధ కుటుంబాలకు చెందిన భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేస్తుంటారు. ఈ ఆలయంలో మార్గశిరమాసంలో శివునికి ఆరుద్రోత్సవములు ఘనంగా జరుపుతారు. ఈ ఉత్సవాలను తిలకించేటందుకు భక్తులు వేలసంఖ్యలో తరలివస్తుంటారు. అయితే దేవాలయంలో ఇంకా మౌలిక సదుపాయాలపై ఇంకాస్త దృష్టిపెడితే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

  కవిసామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ ఈ స్వామిని దర్శించి పులకించి, కీర్తిస్తూ, మధ్యక్కర ఛందస్సులో శతకాన్ని రచించినట్లు ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇప్పటికీ రుషులు ఇక్కడ సంచరిస్తుంటారని భక్తులు భావిస్తారు.

  అడ్రస్‌: నరసింగపాడు, నకరికల్లు మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌- 522615

  Palnadu Sive Temple Map

  ఎలా వెళ్లాలి?

  నకరికల్లు నుండి 4 కి. మీ. దూరంలోను, నరసరావుపేట నుండి 17 కి. మీ. దూరంలోనూ ఈ ఆలయం ఉంటుంది. నర్సరావుపేట నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Guntur, Hindu Temples, Local News

  ఉత్తమ కథలు