Home /News /andhra-pradesh /

Palnadu History: పల్నాటి ఉత్సవాల ప్రత్యేకతలివే.. వీరుల చరిత్ర ఏం చెబుతోందంటే..!

Palnadu History: పల్నాటి ఉత్సవాల ప్రత్యేకతలివే.. వీరుల చరిత్ర ఏం చెబుతోందంటే..!

పల్నాటి బ్రహ్మనాయుడు

పల్నాటి బ్రహ్మనాయుడు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చారిత్రక ప్రాంతాల్లో పల్నాడు (Palnadu) ఒకటి. పల్నాడు అంటే పౌరుషం గుర్తుకువస్తుంది పౌరుషలకు ప్రతీక పల్నాటి సీమ. అధికారం కోసం, ఆధిపత్యం కోసం జరిగిన పల్నాటి యుద్ధం చరిత్రలో నిలిచిపోయింది.

  Anna Raghu, Guntur, News18

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చారిత్రక ప్రాంతాల్లో పల్నాడు (Palnadu) ఒకటి. పల్నాడు అంటే పౌరుషం గుర్తుకువస్తుంది. పౌరుషలకు ప్రతీక పల్నాటి సీమ. అధికారం కోసం, ఆధిపత్యం కోసం జరిగిన పల్నాటి యుద్ధం చరిత్రలో నిలిచిపోయింది. వందల ఏళ్లనాడు జరిగిన ఘటనలను ఇప్పటికీ పల్నాటి వాసులు తలుచుకుంటూ ఉంటారు. పల్నాటి వీరులను స్మరించుకుంటూ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే (Guntur District) కాదు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉత్సవాలకు పేరుంది. ఈ సందర్భంగా పలనాటి చరిత్రను పరిశీలిస్తే.. మాచర్ల, గురజాల రాజ్యల ఆధిపత్య పోరే పల్నాటి యుద్దానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. మాచర్ల రాజ్యానికి బ్రహ్మనాయుడు మంత్రిగా వ్యవహారిస్తుంటే గురజాల రాజ్యానికి నాయకురాలు నాగమ్మ నాయకత్వం వహిస్తుంది. కుట్రలు కుతంత్రాలతో నాయకురాలు నాగమ్మ మాచర్ల రాజ్యాన్ని అరణ్యపాలు చేస్తుంది దయదుల పోరు నడుమ మహాభారతన్ని తలపించేదే ఈ పల్నాటి చరిత్ర. 11వ శతబ్దంలో అప్పటి కార్యమపూడి ఇప్పటి కారంపూడిలో పల్నాటి యుద్ధం జరిగింది. ఈ యుద్ధం దక్షిణ కాశీగా పిలవబడే నాగులేరు ప్రాంతం వేదికగా నిలిచింది.

  పల్నాడు చరిత్రలో బ్రహ్మనాయుడు చిరస్థాయిగా నిలిచిపోయారు. మాచర్ల రాజ్యానికి మంత్రిగా, నాయకుడిగా ఆయన నిచారు. రాజ్యంలో కులాలు మతాలకు అతీతంగా సమాసమాజ స్థాపనే లక్ష్యంగా మాచర్ల రాజ్యంలో మంచి మంత్రిగా పేరు తెచకున్నారు. అప్పట్లోనే వైష్ణవులు, శైవుల మధ్య భీకరపోరు జరుగుతున్నప్పటికీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మనమంతా ఒక్కటే అని చాటి చెప్పిన మహానుభావుడు పల్నాటి బ్రహ్మనాయుడు. అందరూ సమానమే అన్నా భావనతో అప్పట్లోనే చాపకుడు (సహపంక్తి భోజనాలు) కార్యక్రమన్ని ఏర్పాటు చేసి తమ ఘనతను చాటిచెప్పారు.

  ఇది చదవండి: విశాఖలో కలకలం.., ముందుకొచ్చిన సముద్రం.. కుంగిన భూమి.. కారణం ఇదేనా..?


  ఒక వైపు పౌరుషం మరో వైపు అందరూ సమానమే అనే భావన మాచర్ల రాజ్యంలో ఉండేదని చరిత్ర చెపుతుంది. ఒక మాల కన్నమాదాసును దత్తపుత్రునిగా స్వీకరించిన మహాఘనుడు బ్రాహ్మనాయుడే అని చరిత్ర చెబుతోంది. అలనాటి బ్రహ్మనాయుడు చెప్పట్టిన చాపకుడు కార్యక్రమం పల్నాటి ఉత్సవాలలో మూడవ రోజు అయిన మందపోరు రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది.

  ఇది చదవండి: పిల్లలకు మొబైల్ ఇస్తే ఎంత ప్రమాదమో చూడండి.. ఏకంగా తల్లిదండ్రులనే..


  పల్నాడు ఉత్సవాలకు వేదికైన వీరులదేవాలయానికి ఒక విశిష్టత ఉందని చెప్పవచ్చు ఔరాంగజేబ్ పాలనలో సైన్యధిపతులుగా ఉన్న జఫార్, ఫారిద్ అనే ఇద్దరు ముస్లిం సోదరులు ఈ వీర్లదేవాలయాన్ని నిర్మించి ఇక్కడే జీవసమాధి అయ్యారని చరిత్ర చెపుతుంది. అందుకు సాక్ష్యం దేవాలయ ప్రాంగణంలో ముస్లిం సోదరుల సమాధులే నిదర్శనం. పల్నాటి వీరారాధన ఉత్సవాలు కులమతాలకు అతీతంగా ఎంతో వైభవంగా ఐదు రోజుల పాటు జరుగుతాయి.

  ఇది చదవండి: స్కూల్లోనే మందుకొట్టిన స్టూడెంట్స్.. లంచ్ బ్రేక్ లో సిట్టింగ్.. విద్యార్థి చెప్పిన సమాధానానికి అంతా షాక్..


  పల్నాడు పీఠాన్ని స్వయంగా బ్రహ్మనాయుడే స్థాపించి ఆ బాధ్యతను పిడుగు వంశం వారికే అప్పచెప్పినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ పిడుగు వంశం వారే పీఠాడిపతులుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత పిఠాడిపతిగా పిడుగు.తరుణ్ చిన్నకేశవ్ వ్యవహారిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల నుంచి ఆచారవంతులు కారంపూడి చేరుకొని నాగులేరులో స్నానమాడి వీర్ల గుడిలో చెన్నకేశవ స్వామి గుడి, అంకాళమ్మ గుడిలో మొక్కులు తీర్చుకుంటారు.

  మీ నగరం నుండి (​గుంటూరు)

  ఆంధ్రప్రదేశ్
  ​గుంటూరు
  ఆంధ్రప్రదేశ్
  ​గుంటూరు
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Guntur

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు