హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Cabinet News: వైసీపీలో కేబినెట్ బెర్త్ కోసం పోటాపోటీ.. ఆ జిల్లాలో చాంతాడంత లిస్ట్..

AP Cabinet News: వైసీపీలో కేబినెట్ బెర్త్ కోసం పోటాపోటీ.. ఆ జిల్లాలో చాంతాడంత లిస్ట్..

ఏపీ కేబినెట్ (ఫైల్)

ఏపీ కేబినెట్ (ఫైల్)

AP Cabinet: త్వరలో మంత్రివర్గంలో మార్పులుంటాయని క్యాబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM YS Jagan) ప్రకటించడంతో ఆశావాహుల ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. మంత్రివర్గంలో ఏ జిల్లా నుంచి ఎవరు ఉంటారనే దానిపై ప్రతి ఒక్కరూ లెక్కలు వేస్తున్నారు.

ఇంకా చదవండి ...

  Anna Raghu, Guntur, News18­

  త్వరలో మంత్రివర్గంలో మార్పులుంటాయని క్యాబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM YS Jagan) ప్రకటించడంతో ఆశావాహుల ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. మంత్రివర్గంలో ఏ జిల్లా నుంచి ఎవరు ఉంటారనే దానిపై ప్రతి ఒక్కరూ లెక్కలు వేస్తున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతం ఉంన్న గుంటూరు జిల్లా నుండి మంత్రివర్గంలో కొనసాగేది ఎవరు, కొత్తగా అవకాశం చేజిక్కించుకునేది ఎవరు అనేచర్చ జోరందుకుంది. ఇప్పటికే గుంటూరు జిల్లా నుండి హోమ్ మంత్రి గా ప్రత్తిపాడు శాసనసభ్యురాలు మేకతోటి సుచరిత, డిప్యూటి స్పీకర్ గా బాపట్ల శాసనసభ్యుడు కోన రఘుపతి కొనసాగుతున్నారు. గతంలో జిల్లా నుంచి మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లడంతో ప్రస్తుతం ఒక్కరికే ప్రాతినిథ్యం ఉంది.

  ఇక పనితీరుని బట్టి చూస్తే హోంమంత్రి సుచరిత పదవి ఊడిపోవచ్చనేది రాజకీయవర్గాలలో జోరుగా సాగుతున్న చర్చ. మొదటి నుండి ఆమెకు తన శాఖపై పట్టు సాధించలేదనేది సొంత పార్టీ నుండే వినిపిస్తున్నది. ఇక డిప్యూటి స్పీకర్ కోన రఘుపతి కొంతమేర తన పదవికి న్యాయం చేస్తున్నారనే చెప్పాలి. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ విషయం వచ్చినా రాజకీయ చైతన్యం మెండుగా ఉన్న గుంటూరు జిల్లా నుండి డజనుకుపైగా నాయకులు రేసులోకి వస్తుంటారు. వీరిలో కాసు మహేష్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, జంగా కృష్ణమూర్తి, మర్రి రాజశేఖర్, ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి, అంబటి రాంబాబు, ముస్తఫా వంటి వారు పరిచయం అక్కరలేని పేర్లు. వీళ్ళు ఎప్పడూ రేసులో ముందు వరుసలో ఉంటారు.

  ఇది చదవండి: త్వరలో జగనన్న ఓటీటీ..? విద్యార్థులకు ల్యాప్ టాప్ లు.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..

  ఐతే ఈసారి మాచర్ల శాసన సభ్యుడు ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి ఇప్పటికే వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా గెలుపొందాడు. వై.ఎస్ కుటుంబానికి విధేయుడు, వై.ఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనిమా చేసి జగన్ వెంటనడిచారు. పిన్నెల్లికి ప్రస్తుత మంత్రివర్గంలో చోటుదక్కవలసి ఉన్నా సామాజిక సమీకరణలవలన ఆయనకి ఆవకాశః రాలేదు. ఈసారి మాత్రం ఎలాగైనా తాను మంత్రి పదవి చేపట్టి తీరాలని గట్టిప్రయత్నాలు చేస్తున్నారు.

  ఇది చదవండి: తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలకు సర్వం సిద్ధం.. ఐదు రోజుల ఉత్సవాల విశేషాలివే..!

  ఇక బి.సి సామాజక వర్గానికి చెందిన సీనియర్ నేత వై.ఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు యం.ఎల్.సి జంగా క్రిష్ణమూర్తి ఎప్పటి నుండో మంత్రి పదవిని ఆసిస్తున్నారు. గతంలో వై.ఎస్.ఆర్ సూచన మేరకు ఒక సారి మంత్రిపదవిని వదులుకున్నారని, ఇప్పుడు జగన్ మాటకోసం ఏకంగా గురజాల అశెంబ్లీ సీటునే త్యాగం చేశారని స్థానికులు చెప్పుకుంటారు.అందుకే ముఖ్యమంత్రి జగన్ బి.సి నేత జంగా క్రిష్ణ మూర్తికి సముచితమైన గౌరవం ఇచ్చి శాసనమండలికి పంపించారని. వయసు మీదపడుతున్న ప్రస్తుత తరుణంలో నైనా ఆయనని మంత్రి పదవిలో చూడాలని బి.సి వర్గాలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయని వినికిడి.

  ఇది చదవండి: ఆ ప్రాంతంలో మాయమవుతున్న గేదెలు.. తలపట్టుకుంటున్న రైతలు, పోలీసులు..

  ఇక సత్తెనపల్లి శాసన సభ్యుడు అంబటి రాంబాబు కు మొదటి నుండి జగన్ కు సన్నిహితుడిగా పేరుంది. ఆయన వాద్గాటితో ప్రతిపక్షాలను ఎండగట్టడంలో ప్రభుత్వానికి ఎప్పుడూ అండగా ఉంటారు. పైగా కాపు సామాజిక వర్గానికి చెంది నేత కావడంతో ఆయనకు పదవిదక్కే ఛాన్స్ ఉందంటున్నారు ఆయన అభిమానులు.

  ఇది చదవండి: కేబినెట్ లో కొనసాగేది వీరేనా..? సీఎం జగన్ మనసులో ఏముంది..? ఆ ఇద్దరి పరిస్థితి ఏంటి..?

  కాసు కుటుంబ రాజకీయవారసుడు గురజాల శాసన సభ్యుడు కాసు మహేష్ రెడ్డి తన తొలి ప్రయత్నంలోనే యరపతినేని శ్రీనివాసరావు లాంటి బలమైన నేతను ఓడించి జగన్ వద్ద మంచి మార్కులు సంపాదించారు. పైగా నియోజకవర్గంలో చురుకుగా ఉండటం, పైగా కాసు కుటుంబ వారసత్వం కూడా ఆయనకు కలిసివచ్చే అంశాలు. వీరంతా ఎవరికి వారు మంత్రి పదవికోసం తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.

  ఇది చదవండి: జాతీయ స్థాయిలో సీఎం జగన్ రికార్డు.. వరుసగా మూడోసారి టాప్ ప్లేస్..

  జిల్లాలో మంత్రి పదవి కోసం ఒకే నియోజకవర్గం నుండి ఇద్దరు నేతలు గట్టిగా పోటీ పడుతున్న పరిస్తితులూ ఉన్నాయి. చిలకలూరిపేట నుండి గెలిచిన విడదల రజని మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఐతే రజని గెలుపు కోసం సహకరించిన సీనియర్ నాయకుడు మర్రి రాజశేఖర్ తో ఇప్పుడు ఆమెకు పూర్తిగా పొసగడం లేదు. ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ మర్రి రాజశేఖర్ ను మండలికి పంపించి మంత్రిని కూడా చేస్తానంటూ సభాముఖంగా హామీఇచ్చారు. ఐతే ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ళు గడుస్తున్నా మర్రికి ఇచ్చిన మాట గురించి జగన్ పట్టించుకోవడం లేదంటూ ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా తాను దగ్గరుండి గెలిపించిన రజని తమ నాయకునికి పదవిరాకుండా అడ్డుపడుతుందని బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. వీరిలో ఎవరో ఒకరికి ఖచ్ఛితంగా మంత్రి పదవి ఖాయంగా దక్కవచ్చుననేది విశ్లేషకుల మాట.

  ఇది చదవండి: అదో పెద్ద కామెడీ.. సీఎం జగన్ కు టాలీవుడ్ సన్మానంపై జనసేన కామెంట్..!

  మరికొందరు శాసనసభ్యులు మంత్రి పదవి కోసం ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామక్రిష్ణా రెడ్డిని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారని, జగన్ కు అత్యంత సన్నిహితుడైన సజ్జల రామక్రిష్ణారెడ్డి అభయం ఇస్తే తమకు మంత్రి పదవి ఖాయం అంటూ కొందరు శాసన సభ్యులు ఆయన కటాక్షం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఏది ఏమైనప్పటికి జగన్ ఈరోజు చెప్పన మాటలను రాజకీయ, సమాజిక సమీకరణల అనంతరం రేసులో గెలిచేదెవరో మంత్రి పదవిలో నిలిచేదెవరో మరికొద్ది రోజులలో తేలనుందనేది సుస్పష్టం.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP cabinet, Guntur, Ysrcp

  ఉత్తమ కథలు