Home /News /andhra-pradesh /

GUNTUR HERE ARE THE EXPERTS SUGGESTIONS FOR CANDIDATES WHO ARE PREPARING FOR ICET FULL DETAILS HERE PRN GSU NJ

ఐసెట్‌ లో టైమ్‌ మేనేజ్‌మెంట్‌తో బెస్ట్‌ స్కోరు చేయడం ఎలా..? ఆ ఒక్కటి పాటిస్తే ర్యాంక్ పక్కా..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ICET Tips: సాధారణంగా ఎగ్జామ్స్ అంటే విద్యార్థులు కాస్త కంగారుపడుతుంటారు. ఆ కంగారును పక్కన పెట్టి.. స్మార్ట్ గా ఆలోచిస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం చాలా ఈజీ. పరీక్ష ఏవైనా సరే విద్యార్ధులు ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవడం చాలా కీలకం.

ఇంకా చదవండి ...
  Sumanth, News18, Guntur

  సాధారణంగా ఎగ్జామ్స్ (Exams) అంటే విద్యార్థులు కాస్త కంగారుపడుతుంటారు. ఆ కంగారును పక్కన పెట్టి.. స్మార్ట్ గా ఆలోచిస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం చాలా ఈజీ. పరీక్ష ఏవైనా సరే విద్యార్ధులు ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవడం చాలా కీలకం. ఈ కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌ కి సంబంధించి చదవడం ఎంత ముఖ్యమో.. దాన్ని సరైన సమయంలో సరిగ్గా రాయడం అంతకన్నా ముఖ్యం. అంటే ఎగ్జామ్‌హాల్‌లో విద్యార్థుల సమయపాలన చాలా ముఖ్యమంటున్నారు సీనియర్‌ అధ్యాపకులు సంతోష్‌ కుమార్‌. కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌ ప్రిపేర్‌ అవ్వడానికి తక్కువ సమయం ఉంటుంది. ఆ సమయంలో డైలీ టైమ్ టేబుల్‌ వేసుకుని..ఏఏ సబ్జెక్ట్‌కు ఎంత సమయం కేటాయించాలి అని తెలుసుకుంటే ప్రిపరేషన్‌ సగం తేలిక అవుతుంది. ఆ తర్వాత చదవింది గుర్తుండాలని అనుకుంటే మీకో చిన్న టిప్‌. తెల్లవారుజామున లేచి చదువుకుంటే జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుందంట. ఆ సమయంలో చదివిన విషయాలు అందులోనూ నేల పై కూర్చుని చదవడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయని విశ్లేషకులు సూచిస్తున్నారు.

  ఐసెట్‌లో కట్‌ఆఫ్‌ మార్కులు..?
  ఏ.పి.ఐసెట్ (AP ICET-2022) ఎగ్జాం మూడు కేటగిరిలను కవర్‌ చేసేలా ఉంటుంది. మూడు సెక్షన్స్ కలిపి 200 మార్కులకు ఈ పరీక్ష జరుగుతుంది. మొదటి పేపర్ కమ్యూనికేషన్ ఎబిలిటీ 70 మార్కులకు 70 ప్రశ్నలు... రెండవ పేపర్ ఎనలిటికల్ ఎబిలిటీ 75 మార్కులు 75 ప్రశ్నలు... మూడవ పేపర్ మ్యాథమేటికల్ ఎబిలిటీ 55 మార్కులకు 55 ప్రశ్నలు ఉంటాయి. ఈ మొత్తం 200 మార్కులు ప్రశ్నాపత్రాన్ని రెండున్నర గంటలు వ్యవధికాలంలో పూర్తి చేయాలి. అయితే వీటిలో మీరు 55 మార్కులు తెచ్చుకుంటే చాలు ఉత్తిర్ణత సాధించినట్లే. మంచి కాలేజీలో సీటు కావాలంటే మాత్రం ఇంకాస్త కష్టపడాలి..మంచి స్కోరు చేయాల్సి ఉంటుందని సంతోష్‌కుమార్‌ తెలిపారు.

  ఇది చదవండి: పదో తరగతి తర్వాత దారెటో తెలియట్లేదా..? ఒక్కసారి ఈ కెరీర్ చార్ట్‌ చూడండి..


  మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి అంశాలపై ఫోకస్ చేయాలి?
  కంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో టైం మేనేజ్‌మెంట్‌ అనేది చాలా కీలకం. ప్రతి ఒక్కరు టైమ్‌ను బట్టి స్కోరింగ్‌ టాపిక్స్‌ను మొదట కవర్‌ చేసుకోవాలి. ఆ తర్వాతే వేరే సబ్జెక్ట్‌ క్వశ్చన్స్‌పై దృష్టిపెడితే బాగుంటుంది. ఏ కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌లో అయినా మంచి స్కోరు కొట్టాలంటే మ్యాథ్స్‌ సబ్జెక్ట్‌ను మించింది లేదు. ఐసెట్‌ కొచ్చేసరికి బేసిక్ మ్యాథమెటిక్స్‌ రివిజన్ చేసుకుంటూ...దృష్టి సారిస్తే.. మీరు అత్యధిక మార్కులు సాధించవచ్చు. మ్యాథ్స్‌ అంటే అందరూ భయపడతారు కానీ... చిన్న చిన్న షార్ట్ కట్స్ వాడి ఈజీగా గుర్తుండేలా నేర్చుకుంటే అటు సమయాన్ని ఆదాచేసుకుంటూనే.. ఇటు మంచి స్కోరును సాధించొచ్చు.

  ఇది చదవండి: మహాత్ముడికి సరైన నివాళి ఆ కొండ.. అక్కడ ప్రత్యేకతలెన్నో..!


  ఎగ్జామ్‌ హాల్‌లో టైం మేనేజ్‌మెంట్‌ చాలా ముఖ్యం..!
  రెండున్నర గంటల్లో 200 ప్రశ్నలకు సమాధాలు రాయాలంటే...మొదట మనకు ఏ సబ్జెక్ట్‌పై గ్రిప్‌ ఉంటుందో దానికి సంబంధించిన ప్రశ్నలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మనకు కాస్త తెలిసిన సబ్జెక్ట్‌ కు సమయం కేటాయిస్తే పరీక్ష సులువుగా రాయోచ్చంటున్నారు సంతోష్‌ కుమార్‌.

  ఇది చదవండి: మహిళల స్వయం ఉపాధికి ఇదే పర్ఫెక్ట్ ఛాయిస్.. కాలేజీలోనే ఫ్రీ ట్రైనింగ్.. వివరాలివే..!  ఐసెట్ పరీక్షల్లో చాలా మంది చేసే తప్పులు కష్టంగా ఉండే ఆంశం పై ఎక్కువ సమయం కేటాయిస్తారు . అల చేయడం వల్ల సమయం తోపాటు మార్కులు కూడా సాధించలేరు. పరీక్షలో ముందుగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి . అయితే మొదటి 70 నిమిషాలు రీజనింగ్‌కు కేటాయిస్తే... తరవాతి సమయం మ్యాథమేటిక్స్‌ పై దృష్టిపెడితే విద్యార్థులకు సమయం ఆదా అవుతుంది. చివరిగా ఇంగ్లీష్‌కు సమయం కేటాయిస్తే సరిపోతుంది.

  ఇది చదవండి: సిలంబం నేర్చుకుంటే శివంగిలా దూసుకుపోతారు.. ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారంటే..!


  ఎందుకంటే ఇంగ్లీష్ పారాగ్రాఫ్‌ క్వశ్చన్స్‌, మ్యాథమేటిక్స్‌లో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్‌ ...కాస్త సమయం ఎక్కువగా తీసుకుంటాయి. కాబట్టి ముందుగా అర్థమేటిక్స్ & రిజనింగ్‌తో మొదలుపెడితే మంచిది. మ్యాథమేటిక్స్‌లో బేసిక్ ఫార్ములాతో ఉన్న క్వశ్చన్స్‌ షాట్ కట్లను వాడితే సమయం వృధా కాకుండా ఉంటుంది. ఏపీ ఐసెట్ లో ఎలాంటి నెగిటివ్ మార్కులు ఉండవు కాబట్టి సాధ్యమైనంత వరకు అన్ని ప్రశ్నలకు సమాధానం చేస్తే మంచిదని సీనియర్‌ అధ్యాపకులు సంతోష్‌కుమార్‌ న్యూస్‌ 18కు తెలిపారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, EDUCATION, Guntur, Local News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు