Home /News /andhra-pradesh /

GUNTUR HEAD CONSTABLE ARRESTED FOR SELLING ILLICIT LIQUOR IN PALANADU DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

Guntur: అక్రమ మద్యాన్ని సైడ్ చేసిన పోలీస్.. సీక్రెట్ గా మార్కెట్లో అమ్మకం.. ఎలా చిక్కాడంటే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

AP Police: పోలీస్ ఉద్యోగమంటే దొంగలను, నేరస్తులను పట్టుకొని లోపల వేయడం. అలాగే శాంతిభద్రతల కాపాడుతూ ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండటం. అంతేకాదు అక్రమంగా జరుగుతున్న వ్యాపారలను, స్మగ్లింగ్ ను అరికట్టడం. కానీ ఓ పోలీస్ ఇందుకు భిన్నంగా తయారయ్యాడు.

ఇంకా చదవండి ...
    Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

    పోలీస్ ఉద్యోగమంటే దొంగలను, నేరస్తులను పట్టుకొని లోపల వేయడం. అలాగే శాంతిభద్రతల కాపాడుతూ ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండటం. అంతేకాదు అక్రమంగా జరుగుతున్న వ్యాపారలను, స్మగ్లింగ్ ను అరికట్టడం. కానీ ఓ పోలీస్ ఇందుకు భిన్నంగా తయారయ్యాడు. అక్రమాలను అరికట్టాల్సిన వాడు అక్రమ మార్గంలో వెళ్లాడు. చివరకు కటకటాల్లోకి వెళ్లాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పల్నాడు జిల్లా (Palanadu District) కేంద్రం నరసరావుపేటలో ఇటీవల రూ.1.30 కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. ఇది జరిగిన కొన్నిరోజుల తర్వాత నకరికల్లు వద్ద గోవా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు చెప్పిన విషయం చెప్పి పోలీసులు షాక్ తిన్నారు. ఓ పోలీసే ఆ మద్యం అమ్మమని తనకిచ్చినట్లు చెప్పాడు.

    వివరాల్లోకి వెళ్తే.. పోలీసులు మద్యాన్ని ధ్వంసం చేస్తున్న సమయంలో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (Special Enforcement bureau) హెడ్ కానిస్టేబుల్ సురేందర్ రెడ్డి.. గుట్టుపచప్పుడు కాకుండా లక్షల రూపాయలు విలువ చేసే మద్యాన్ని పక్కదారి పట్టించాడు. అనంతరం ఆ మద్యాన్ని ఫిరంగిపురం మండలం రేపూడికి చెందిన వైసీపీ సానుభూతిపరుడు చిట్టా విజయ్ భాస్కర్ రెడ్డికి అప్పగించాడు. నకరికల్లు వద్ద పట్టుబడిన వ్యక్తి ఇధే విషయం చెప్పాడు. ఐతే పోలీసులు కేసును పక్కదారి పట్టించేందుకు యత్నించారు. విజయ్ భాస్కర్ రెడ్డే.. మద్యం తెచ్చి సురేందర్ రెడ్డికి ఇచ్చినట్లు ఫిరంగిపురం పోలీసులు కేసును తారుమారు చేశారు.

    ఇది చదవండి: ప్రియుడితో తిరిగొచ్చిన సాయి ప్రియాంక.. కోటి రూపాయలపై సమాధానం ఇదే..!


    ఐతే తనపై కేసు లేకుండా చూడాలంటూ మేడికొండూరు సీఐపై స్థానిక రాజకీయ నేతల ద్వారా హెడ్ కానిస్టేబుల్ సురేందర్ రెడ్డి ఒత్తిడి తెచ్చాడు. ఐతే ఒత్తిళ్లకు తలొగ్గని పోలీసులు.. సురేందర్ రెడ్డితో పాటు, విజయభాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు.

    ఇది చదవండి: అమ్మాయి కోసం కొట్టుకున్న సీఐ, కానిస్టేబుల్.. ఉన్నతాధికారుల ఎంట్రీ.. చివరికి ఏం జరిగిందంటే..!


    ఇదే మద్యం ధ్వంసం ఘటనలో ఓ కీలక అధికారి మద్యాన్ని పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నరసరావుపేట మండలం పమిడిపాడులో ముగ్గురు వ్యక్తుల ద్వారా లక్షలు విలువ చేసే మద్యాన్ని విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ మద్యాన్ని అరికట్టాల్సిన పోలీసులే ఇలా పక్కదారిలో లిక్కర్ వ్యాపారం చేయడంపై జనం మండిపడుతున్నారు. ఒక్క నరసరావుపేట సెబ్ పరిధిలోనే ఇద్దరు పోలీసులు అక్రమ వ్యాపారం చేస్తుంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఇంకెంతమంది ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. ఇటీవల అక్రమ మద్యాన్ని ధ్వంసం చేయిస్తూ ఫోటోలు, వీడియోలు విడుదల చేస్తున్న పోలీసులు.. డిపార్ట్ మెంట్ లో జరిగే అక్రమాలను కూడా అరికట్టాల్సిన అవసరముంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Police, Guntur, Liquor

    తదుపరి వార్తలు