Home /News /andhra-pradesh /

GUNTUR GUNTUR YOUNG MAN TURNED PROFESSIONAL BOXER WITH HIS SELF INTEREST TAKE LOOK AT HIS SUCCESS STORY FULL DETAILS HERE PRN GSU NJ

Guntur News: తెలుగోడి పంచ్‌ పవరే వేరప్పా..! బాక్సింగ్‌లో మిర్చిలాంటి కుర్రాడు..!

బాక్సింగ్

బాక్సింగ్ రింగ్ లో మధుబాబు (ఫైల్)

సరదాగా బాడీ ఫిట్‌ నెస్‌ కోసమని బాక్సింగ్‌ను ప్రారంభించిన యువకుడు.. ఇప్పుడు దాన్నే ప్రొఫెషన్‌ గా మార్చుకుని ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా ఎదుగుతున్నాడు. ఇండియా (India) లో టాప్ 30 ప్రొఫెషనల్ బాక్సర్స్‌ లిస్ట్‌లో తన పేరు నమోదు చూసుకున్నాడు.

ఇంకా చదవండి ...
    Sumanth, News18, Guntur

    కృషి, పట్టుదల ఏకాగ్రత ఉంటే ఎలాంటి లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని నిరూపించాడు గుంటూరు (Guntur) యువకుడు. 17 ఏళ్లకే బాక్సింగ్‌ రంగంలో అడుగుపెట్టి.. అతి తక్కువ సమయంలోనే ఇంటర్నేషనల్‌ బాక్సర్‌ గా ఎదిగాడు. సరదాగా బాడీ ఫిట్‌ నెస్‌ కోసమని బాక్సింగ్‌ను ప్రారంభించిన యువకుడు.. ఇప్పుడు దాన్నే ప్రొఫెషన్‌ గా మార్చుకుని ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా ఎదుగుతున్నాడు. ఇండియా (India) లో టాప్ 30 ప్రొఫెషనల్ బాక్సర్స్‌ లిస్ట్‌లో తన పేరు నమోదు చూసుకున్నాడు మన గుంటూరుకు చెందిన చల్లపల్లి మధుబాబు. ఒక మిత్రుడు ప్రేరణతో బాక్సింగ్ రంగంలోకి అడుగుపెట్టిన మధు.. అతి తక్కువ సమయంలోనే.. ఇంటర్నేషనల్ బాక్సర్‌ గా ఎదిగాడు.

    2015లో అంటే తన 17వ ఏట బాక్సింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు. శిక్షణ ప్రారంభించిన ఏడాదిలోనే రింగ్‌లోకి దిగాడు. 2016 లో డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నీలో బ్రాంజ్‌, 2018లో ఓపెన్ నేషనల్స్ ,2019 లో వీఎస్‌పీఎన్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ ఇంటర్నేషనల్‌ (vspn sports school international) బాక్సింగ్ ఛాంపియన్ షిప్ హెవీ వెయిట్ కేటగిరీలో గోల్డ్‌ మెడల్‌ సాధించాడు.

    ఇది చదవండి: పిల్లాడు కాదు పిడుగు.. ఆర్చరీలో ప్రపంచ వీరుడు.. గురిపెడితే రికార్డులు బ్రేక్


    ఫిట్‌నెస్‌ కోచ్‌గా పనిచేస్తూ.. యువకులకు బాక్సింగ్‌లో ట్రైనింగ్‌ :
    ఎదుగుదల అంటే తాను మాత్రమే కాదు తన చుట్టు ఉన్నవాళ్లు ఎదగాలని భావించిన మధు.., మరికొందరు యువకులకు శిక్షణ ఇస్తున్నాడు. గుంటూరు నల్లపాడు ఫిట్ నైన్ టీన్ జిమ్‌ లో ఫిట్ నెస్ కోచ్‌గా పనిచేస్తూ.. అదే జిమ్‌లో కొందరు కుర్రాళ్లను బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాడు. వాళ్లను మెరికల్లుగా రెడీ చేస్తున్నాడు. అందులో కొందరు స్టేట్, అండ్ నేషన్స్ టోర్నమెంట్ ఆడి పథకాలు కూడా సాధించారు.

    ఇది చదవండి: సిలంబం నేర్చుకుంటే శివంగిలా దూసుకుపోతారు.. ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారంటే..!


    కుటుంబ నేపథ్యం: మధుబాబు తండ్రి BSF లో సర్వీస్ చేసే వాళ్ళు. తల్లి ప్రభుత్వ ఉద్యోగి. అయితే దురదృష్టశాత్తూ చిన్నతనంలోనే తల్లి తండ్రులని కోల్పోయాడు. తండ్రి నుంచి ధైర్యాన్ని, తల్లి నుంచి పట్టుదలను పునికిపుచ్చకున్న మధు బాక్సింగ్‌లో కింగ్‌లా ఎదిగాడు.అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎక్సర్‌సైజ్‌(ACE)లో ఫిట్నెస్ అండ్ న్యూట్రీషన్‌లో (Fitness and nutrition) లెవల్‌-1 ట్రైనర్‌ సర్టిఫికేట్ కూడా పొందాడు. గతంలో బెంగళూరు లాంటి పలు ప్రధాన నగరాల్లో ట్రైనింగ్‌ సెంటర్‌లలో కోచ్‌గా పనిచేశాడు. ప్రస్తుతం నల్లపాడులోని ఫిట్‌-9 టీన్ జిమ్‌.. విట్‌ నెస్‌ ది ఫిట్‌నెస్‌ ( Fit-9Teen Gym.. Witness the fitness) సెంటర్‌లో కోచ్‌గా పనిచేస్తున్నారు.

    ఇది చదవండి: వ్యర్థాల నుంచి విద్యుత్‌... ఏపీలో తొలి ప్లాంట్‌ అక్కడే..! ప్రత్యేకతలవే..!



    తాను నేర్చుకున్న విద్యని నలుగురికి నేర్పించాలి అని..యువతకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాడు. బాక్సింగ్ వల్ల ఉపయోగాలను అందరికీ తెలియచేసి కొందరినైనా బాక్సింగ్‌ నేర్చుకునేలా చేయాలన్నదే తన లక్ష్యం అంటున్నారు మధు.

    ట్రైనింగ్ టైమింగ్స్‌:నల్లపాడులోని ఫిట్ నెస్‌ జిమ్‌లో ట్రైనింగ్‌ ఇస్తుంటారు. ఉదయం 6 గంటల నుండి 8 వరకు సాయంత్రం 5:30 నుండి 7 30 వరకు శిక్షణ ఇస్తారు.
    అడ్రస్‌: D.no:-117-139 నల్లపాడు మెయిన్‌ రోడ్‌, రవి మెడికల్‌ షాపు పక్కన, నల్లపాడు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌- 522005
    ఫోన్‌ నెంబర్‌: 99852 41919, 9666636554



    ఎలా చేరుకోవాలి..?
    ఈ జిమ్‌ సెంటర్‌కు వెళ్లేందుకు రోడ్డు, రైలు మార్గం అందుబాటులో ఉన్నాయి. నరసరావు పేట, నుంచి గుంటూరు వెళ్లే బస్సు ఎక్కితే నల్లపాడులో దిగొచ్చు. రైలు మార్గం ద్వారా అయితే నల్లపాడు రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడకు వెళ్లొచ్చు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Boxing, Guntur, Local News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు