Home /News /andhra-pradesh /

GUNTUR GUNTUR WOMAN BLACKMAILED BY YOUTH FOR EXTRAMARITAL AFFAIR IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Extramarital Affair: యువకుడితో వివాహిత ఎఫైర్.. సీక్రెట్ గా వీడియో తీయించిన ప్రియుడు.. ఆ తర్వాత మొదలైంది అసలు సినిమా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Blackmailing: ఓ పెళ్లైన మహిళ వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో ఏకాతంగా ఉన్న సమయంలో నలుగురు యువకులు చూశారు. ఆతర్వాత..

    పెళ్లి చేసుకోవడం కట్టుకున్నవాళ్లు ఉండగానే వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం. జీవితాలు నాశనం చేసుకోవడం. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఇలాంటి వ్యవహారాల్లో ప్రాణాలు కూడా పోతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఓ పెళ్లైన మహిళ వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమెతో ఏకాంతంగా ఉన్న సమయంలో ప్రియుడే తన స్నేహితులతో వీడియోలు, ఫోటోలు తీయించాడు. ఆ తర్వాత సెల్ ఫోన్లో వీడియోలు, ఫోటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. వేధింపులు భరించలేని మహిళ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నగరం శివారులోని గోరంట్ల ప్రాంతానికి చెందిన మహిళ స్థానికంగా ఓ కాలనీలో నివాసముంటోంది. అదే కాలనీకి చెందిన ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ప్రియుడితో సన్నిహితంగా మెలుగుతున్న సమయంలో వీడియోలు తీసిన ఓ వ్యక్తి.. వాటిని తన స్నేహితులకు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు.

    లైంగికంగా కోరిక తీర్చాలని.. లేకుంటే పోటోలు వీడియోలు బయటపెడతానని బెదిరింపులకు పాల్పడ్డారు. గత పది రోజులుగా వేధింపులు ఎక్కువవడంతో సదరు మహిళ నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు యత్నించింది. ఐతే ఈ వ్యవహారంలో ఓ పార్టీకి చెందిన నేతలు జోక్యం చేసుకొని విషయం బయటకు రాకుండా ఆమెకు భారీగా నగదు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు పోలీస్ స్టేషన్లో కూడా ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని సమాచారం.

    ఇది చదవండి: ఆ మందు వికటిస్తే నాకు సంబంధం లేదు... ఆనందయ్య సంచలన ప్రకటన...


    గుంటూరు జిల్లాలో ఇటీవల ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. యడ్లపాడు మండలం చంఘీస్ ఖాన్ పేటకు చెందిన ఏ యువతి.. పెళ్లై ఏడాది కాకుండానే తన ప్రియుడితో వెళ్లిపోయింది. తిరిగి వచ్చేయాలని కుటుంబ సభ్యులు బ్రతిమిలాడినా వినలేదు. ఇది తెలిసిన భర్త ఆత్మహత్యకు యత్నించాడు. మరోవైపు ప్రియుడి తండ్రి ఆత్మహత్య చేసుకోగా.. ఈ వ్యవహారానికి మూలకారణమైన యువతి కూడా సూసైడ్ చేసుకుంది. ప్రస్తుతం యువతి భర్త చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

    ఇది చదవండి: పెళ్లై ఏడాది కూడా కాలేదు... ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. అంతలోనే ఊహించని ట్విస్ట్...



    అటు నెల్లూరు జిల్లాలో ఓ పాస్టర్ భార్య.. వేరొకరితో సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో గదిలో ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త చూశాడు. వెంటనే అతడ్ని గదిలోకి తీసుకొచ్చి దిండుతో ముఖాన్ని అదిమిపెట్టి హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ప్రియుడు సాయంతో శవాన్ని హైవేపై పడేసింది. దర్యాప్తులో అసలు విషయం బయటకు రావడంతో పోలీసులే షాకయ్యారు. బంధాలకు విలువఇవ్వకపోవడం, తాత్కాలిక సుఖాలకు అలావటు పడటంతో ఘోరాలు జరుగుతున్నాయి.

    ఇది చదవండి: భార్యను ప్రియుడితో అలా చూసిన భర్త.. భార్య వేసిన మర్డర్ స్కెచ్ కు పోలీసులు షాక్

    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Extramarital affairs, Gunturu, Nude videos blackmails

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు