Home /News /andhra-pradesh /

GUNTUR GUNTUR RAPE ISSUE TAKE POLITICAL TURN TDP LEADERS DEMAND FOR RESIGNATION OF HOME MINSTER NGS

AP Crime News: పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న గ్యాంగ్ రేప్.. హోం మంత్రి రాజీనామాకు డిమాండ్.. ముగ్గురి అరెస్ట్

పొలిటికల్ టర్న్ తీసుకున్న గ్యాంగ్ రేప్

పొలిటికల్ టర్న్ తీసుకున్న గ్యాంగ్ రేప్

AP Crime News: ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు నేరాల సంఖ్య భయపెడుతున్నాయి. ముఖ్యంగా మహిళలకు రక్షణ కరువువుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రైల్వే స్టేషన్ లో భర్త కళ్లముందు భార్యపై గ్యాంగ్ రేప్ అంశం కలకలం రేపుతోంది. ఈ ఇష్యూ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది.

ఇంకా చదవండి ...
  AP Crime News: బాపట్ల జిల్లా (Bapatla District) రేపల్లె దారుణంపై ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి (Gang Rape) పాల్పడిన ఘటన కలకలం రేపుతుంది. అది కూడా బాధితురాలి భర్త ముందే కిరాతకానికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన భర్తను దారుణంగా కొట్టారు. రేపల్లె రైల్వేస్టేషన్‌ (Railwat Sation)లో అర్ధరాత్రి ఈ అమానుష సంఘటన చోటు చేసుకుంది. ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ రేపల్లెకు చేరుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా (Guntur District)లో వారం రోజుల్లో ఇలాంటి ఘటన సంభవించడం ఇది నాలుగో ఘటన. దీనిపై సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) తక్షణమే స్పందించారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. నిందితులను త్వరితగతిన గుర్తించాలని, అరెస్ట్ చేయాలని ఆదేశించారు. బాధితురాలి కుటుంబానికి అవసరమైన సహాయ, సహకారాలను అందించాలని సూచించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈ దారుణంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. వరుస దారుణాలు జరుగుతున్నా.. ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడుతున్నారు.

  అసలు ఏం జరిగింటే..? ప్రకాశం జిల్లాకు యర్రగొండపాలెం వెంకటాద్రిపురానికి చెందిన బాధితురాలు తన భర్త, పిల్లలతో కలిసి రాత్రి నాగాయలంకకు బయలుదేరారు. బస్సు అందుబాటులో లేకపోవడంతో రాత్రి రేపల్లె రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌పై నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో ముగ్గురు దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన ఆమె భర్తను కొట్టి.. ఆమెను ప్లాట్‌ఫామ్ పక్కకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలుస్తోంది. నిందితులు కూడా యర్రగొండపాలేనికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

  ఇదీ చదవండి : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. 13 మెడికల్ కాలేజీలు మంజూరు.. ఢిల్లీ టూర్ లో సీఎం జగన్

  గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్‌లో మహిళపై అత్యాచారం జరగటం అత్యంత బాధాకరం అన్నారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజిని. అత్యాచార ఘటనను సీఎం జగన్ మోహన్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారని, నిందితులకు కఠిన శిక్ష పడే వరకు ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. ముగ్గురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీతో, ఆస్ప‌త్రి అధికారుల‌తో మాట్లాడామన్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చూడాల‌ని రేప‌ల్లె ఆస్ప‌త్రి అధికారుల‌ను ఆదేశించినట్లు తెలిపారు. అంతకుముందు మాట్లాడిన హోం మంత్రి తానేటి వనిత ఆడవాళ్లపై అఘాయిత్యాలు, అత్యాచారాలు వంటివి జరగకుండా తల్లులే జాగ్రత్త తీసుకోవాలన్నారు. తల్లి పాత్ర సక్రమంగా పోషించకుండా పోలీసుల మీద, ప్రభుత్వం మీద వేయడం సరైన పద్ధతి కాదన్నారు. మొదట బిడ్డల బాధ్యత తల్లులు దే, తరువాతే పోలీస్ లది అంటూ వ్యాఖ్యలు చేశారు. తల్లి పిల్లలు పెరిగే వాతావరణం కూడా చూసుకోవాలన్నారు.
  ఇదీ చదవండి : పట్టపగలే షాకింగ్ ఘటన.. అందరూ చూస్తుండగానే తుపాకీతో బెదిరించి బ్యాంకు దోపిడీ

  మరోవైపు ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్.. పూటకో రేప్ జరుగుతోందని మండిపడ్డారు. బిహార్‌ను మించిపోయిందని ధ్వజమెత్తారు. శాంతిభద్రతలు అదుపులో లేవని విమర్శించారు. పోలీసులు ఏమీ చేయలేరనే ధైర్యంతోనే ఉన్మాదులు ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హోం మంత్రి తానేటి వనిత- మహిళల తప్పిదాల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయనే విధంగా మాట్లాడటం దురదృష్టకరమని విమర్శించారు.

  ఇదీ చదవండి : ఆమె చేసిందే పాడు పని.. అందులోనూ అతి తెలివి.. చివరకు ఊహించిన షాక్

  హోం మంత్రి తానేటి వనిత పైన తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. విశాఖలో హోం శాఖ మంత్రి తానేటి వనిత వ్యాఖ్యలు దుమారం రేపాయి. తల్లులను బయటికి తీసుకొచ్చి హోంమంత్రి కించపరుస్తున్నారంటూ మండి పడ్డారు. ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా తానేటి వనిత రాజీనామా చేయాలన్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Crime news, Nara Lokesh, Vidadala Rajani

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు