• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • GUNTUR GUNTUR MUNICIPAL CORPORATION TO SETUP FOOD BANKS FOR POOR PEOPLE IN THE CITY SOON FULL DETAILS HERE PRN GNT

Food Banks in AP: పేదల కడుపు నింపేందుకు వినూత్న ఆలోచన.., త్వరలోనే అమలు

ప్రతీకాత్మకచిత్రం

అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారి కడుపులో నాలుగు మెతుకులు వెళ్తే చాలు కష్టమంతా మర్చిపోతారు.

  • Share this:
    అన్నా రఘు, గుంటూరు ప్రతినిధి, న్యూస్18

    అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారి కడుపులో నాలుగు మెతుకులు వెళ్తే చాలు కష్టమంతా మర్చిపోతారు. అన్నీ ఉన్నవారికి ఆకలంటే తెలియదు. కానీ దిక్కుమొక్కులేనివారికి పట్టెడన్నం పెట్టేవారు కరువైపోతున్నారు. కరోనా సమయంలో ఇలాంటి వారు ఆకలితో అలమటించిపోతున్నారు. లాక్ డౌన్ ఆంక్షలకు తోడు, కరోనా భయంతో అన్నార్తులకు పట్టెడన్నం పెట్టేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితులు నెలకొన్నాయి. పల్లెల సంగతి అటుంచితే పట్టణాల్లో ఇలాంటివారి పరిస్థితి వర్ణనాతీతం. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు లాంటి నగరాల్లో అనాథలు, యాచకులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వినూత్న ఆలోచన చేసింది.అన్నార్తుల కోసం ఫుడ్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గుంటూరు నగరం నిత్యం ఎంతోమంది వైద్యం, చదువు, ఇతర పనుల నిమిత్తం జిల్లా నలుమూలల నుండి వేలాది మంది జనం వస్తుంటారు. ముఖ్యంగా గుంటూరు జీజీహెచ్ రోగులు, వారి బంధువులతో కిటకిటలాడుతుంటుంది. వీరిలో ఎంతోమంది నిరుపేదలు ఆహారం ఎవరైనా ఇస్తారా అని ఎదురు చూస్తుంటారు.

    అంతేకాక నగరపాలక సంస్థలో సుమారు పదిహేను వందలమంది వరకు తెల్లవారుజామున మూడు నాలుగు గంటలకు నగరాన్ని శుభ్రం చేయటానికి వస్తూ ఉంటారు. వారు ఉదయం 11 గంటల వరకు తమ విధి నిర్వహణలో ఉంటూ అల్పాహారాన్ని కూడా తీసుకోకుండా విధులు నిర్వహిస్తుంటారు. ఐతే వారు ఇలా అల్పాహారం తీసుకోకుండా విధులు నిర్వహిస్తుండటానికి ఆర్ధిక వెసులుబాటు లేక పోవటం అనే విషయాన్నీ గ్రహించిన మేయర్ కావటి మనోహర్ నాయుడు వారికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ లోని జిహెచ్ఎంసీ అమలు చేస్తువన్న ‘ఫుడ్ బ్యాంక్’ పథకాన్ని గుంటూరులో కూడా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించటానికి ప్రణాళికను రూపొందించారు.

    గుంటూరు నగర పరిధిలో ఐదు ఫుడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాటిని త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం గుంటూరు జనాభా లక్షల్లో ఉంది. నగరంలో ప్రతి రోజూ వందల సంఖ్యలో శుభకార్యాలు జరుగుతుంటాయి అక్కడ ఎంతో ఆహార దుర్వినియోగం అవుతుంటుంది. ఫంక్షన్లు, హోటళ్లలో మిగిలిపోయిన ఆహారపదార్దాలను ఎవరైనా ఈ ఫుడ్ బ్యాంకు కు తీసుకువచ్చి ఆందిచినట్లైతే వాటిని అక్కడే ఉన్న నగరపాలక సమస్త ఉద్యోగి వాటిని స్వీకరించి అక్కడ పెద్ద ఫ్రిడ్జ్ లలో నిల్వచేసి అన్నార్థులకు అందిస్తారు. ఐతే నగరంలో ఎక్కడెక్కడ ఫుడ్ బ్యాంకులు ఏర్పాటు చేయలి.. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అనే దానిపై పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్ డౌన్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసిన తర్వాత వీలైనంత త్వరగా ఫుడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ యోచిస్తోంది.
    Published by:Purna Chandra
    First published: