Home /News /andhra-pradesh /

GUNTUR GUNTUR MUNICIPAL CORPORATION ENCOURAGING CORN MADE BAGS INSTEAD OF PLASTIC COVERS FULL DETAILS HERE PRN GNT

What an Idea: ఈ సంచులను వాడేసి పిండిచేయొచ్చు.. ప్లాస్టిక్ నిషేధానికి వినూత్న ఐడియా.. మీరూ ఓ లుక్కేయండి..!

గుంటూరులో మొక్కజొన్న సంచులు

గుంటూరులో మొక్కజొన్న సంచులు

ప్లాస్టిక్ (Plastic) భూతాన్ని తరిమికొట్టడానికి చాలా రోజులుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. కానీ మనిషి అవసరం మాటున అవన్నీ బూడిదలో పోసిన పన్నీరుగానే మారుతున్నాయి. ఐతే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్లాస్టిక్ నిషేధం (Plastic Ban) దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఇంకా చదవండి ...
    Anna Raghu, News18, Amaravati

    మానవాళి ఉనికికి అవసరమైన వాతావరణ సమతౌల్యతను ప్రశ్నార్థకం చేస్తున్న ప్లాస్టిక్ (Plastic) భూతాన్ని తరిమికొట్టడానికి చాలా రోజులుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. కానీ మనిషి అవసరం మాటున అవన్నీ బూడిదలో పోసిన పన్నీరుగానే మారుతున్నాయి. ఐతే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్లాస్టిక్ నిషేధం (Plastic Ban) దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను బ్యాన్ చేశారు. తాగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (Guntur Municipal Corporation) పరిధిలో వినూత్న ప్రణాళికను రూపొందించారు. ఇప్పటికే గుంటూరు నగరంలో గత కొన్ని నెలలుగా దశల వారీగా ప్లాస్టిక్ సంచుల వినియోగంపై నిషేధం విదిస్తోంది. తొలి దశగా 20 మైక్రాన్ సంచులను నిషేధించింది. రెండవ దశగా 40 మైక్రాన్ సంచులను నిషేధించింది. ఇప్పుడు 70 మైక్రాన్ ప్లాస్టిక్ కవర్లపై బ్యాన్ విధించారు.

    ప్లాస్టిక్ సంచుల విక్రేతలు, తయారీదారులను గుర్తించి జులై 1వ తేదీ లోపు వారివద్ద నిల్వలను ఖాళీ చేయాలని ఆదేశించింది. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో అసలు ప్లాస్టిక్ రహిత గుంటూరుగా మార్చాలని అధికారులు ప్రణాళిక ను రూపొందించారు.

    ఇది చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. మరో సంక్షేమ పథకానికి శ్రీకారం.. వివరాలివే..!


    ఐతే ప్లాస్టిక్ సంచులు ప్రత్యామ్న్యాయం గా గుడ్డ సంచుల తయారీదారులు మరియు విక్రేతలను, దుకాణదారులు ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఇన్ స్టంట్ గా వాడుకునేందుకు మొక్కజొన్న పిండితో తయారు చేసే సంచులు పర్యావరణహితం కాబట్టి వాటిని ప్రమోట్ చేస్తున్నారు. అంతేకాదు వాటి తయారీదారులతో మాట్లాడి సంచులను గుంటూరులో అందుబాటులో ఉంచే విధంగా ప్రధాన కూడళ్లలో ఔట్ లెట్స్ ను ప్రారంభించబోతున్నారు.

    ఇది చదవండి: ఉత్తరాంధ్రలో టెన్షన్ టెన్షన్.. జనం మీద పడుతున్న ఎలుగుబంట్లు.. కారణం ఇదే..!


    అసలు గుంటూరులో రోజుకు సుమారుగా 450 టన్నుల చెత్త వస్తే దానిలో 100 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలే ఉంటున్నాయి. ప్రజలు ప్లాస్టిక్ వ్యర్ధాలను వినియోగించి ఎక్కడబడితే అక్కడ పాలవేయడం వల్ల నాటిని మూగజీవాలు తిని మృత్యువాత పడుతున్నాయి. అంతేకాకుండా ప్లాస్టిక్ వ్యర్థాలను డంప్ చేసేందుకు స్థలం కూడా కష్టతరమవుతోంది. దీంతో ప్లాస్టిక్ బ్యాన్ నిబంధనలను అధికారులు కఠినంగా అమలు చేస్తున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే తయారీదారులకు రూ.50వేలు, రిటైల్ వ్యాపారులకు రూ.2,500 నుంచి రూ.15వేల వరకు, వినియోగదారులకు రూ.250 నుంచి రూ.500 వరకు జరిమానా విధిస్తున్నారు.



    మొక్క జొన్న సంచులు ఎలా తయారు చేస్తారు..?
    ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సంచులను ప్రోత్సహించాలని గుంటూరు నగరపాల సంస్థ నిర్ణయించింది. మొక్కజొన్న పిండితో ఈ సంచులను తయారుచేస్తారు. ఈ సంచి మందంగా బరువును మోయటానికి అనువుగా ఉంటుంది. ఐతే ఈ సంచులను తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రయోగాత్మకంగా ప్రసాదాలకు వినియోగిస్తున్నారు. ఈ సంచులను వాడి పడేస్తే సులభంగా మట్టిలో కలిసిపోతాయి. లేక రుబ్బురోలులో వేసి రుబ్బితే ఇట్టే పిండి అవుతాయి. ఈ సంచుల్లో ఐదు కిలోల వరకు బరవు మోయవచ్చు. వీటితో పాటు జనపనార, వస్త్రాలతో తయారు చేసిన సంచులను ప్రొత్సహించాలని అధికారులు నిర్ణయించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Guntur, Plastic Ban

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు