Home /News /andhra-pradesh /

GUNTUR GUNTUR MAN BOOKED FOR CARRYING ILLEGAL LIQUOR BOTTLES AS HE DONT KNOW ABOUT WHAT IS INSIDE THE BAG FULL DETAILS HERE PRN GNT

Shocking Twist: రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫామ్ పై భారీ బ్యాగ్ తో యువకుడు.. తెరిచి చూసి షాకైన పోలీసులు.. అసలు ట్విస్ట్ వేరే ఉంది..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Friend Cheating: ఎంత ఫ్రెండ్ అయినా మనతో ఏంపనిచేయిస్తున్నాడో కాస్త వెనకా ముందు చూసుకోవాలి. అలా చూసుకోకుండా ఫ్రెండ్ చెప్పిన మాటలు విన్న ఓ యువకుడు అకారణంగా కటకటాలపాలయ్యాడు…

    Anna Raghu, Guntur, News18

    ఈ రోజుల్లో ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదతో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఎదుటివారి గురించి అన్నీ తెలిసినా.. మనకు తెలియని విషయాలు వేరే ఉంటాయి. ఎంత ఫ్రెండ్ అయినా మనతో ఏంపనిచేయిస్తున్నాడో కాస్త వెనకా ముందు చూసుకోవాలి. అలా చూసుకోకుండా ఫ్రెండ్ చెప్పిన మాటలు విన్న ఓ యువకుడు అకారణంగా కటకటాలపాలయ్యాడు. తెలియక చేసిన తప్పే అయినా చట్టం ముందు నేరస్తుడిగా నిలవాల్సి వచ్చింది. స్నేహితుడ్ని గుడ్డిగా నమ్మిన పాపానికి చేతికి సంకెళ్లు వేయించుకోవాల్సి వచ్చింది. నాలుగురోజులు సెలవు పెట్టి సరదాగా ఇంటికి వెళ్లాలనుకున్నవాడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కావ్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా (Guntur District) కు చెందిన ఓ యువకుడు బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ (Hyderabad) లోని ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.

    ఈ క్రమంలో ఆఫీసుకు సెలవుపెట్టిన సదరు యువకుడు.. అమ్మ, అక్కని చూసేందుకు ఇంటికి వెళ్దామని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈలోగా పాతమిత్రుడు ఒకడు యువకుడ్ని కలిశాడు. తనతోపాటే ఓ భారీ బ్యాగ్ తీసుకొచ్చాడు. ఈ బ్యాగ్ ను గుంటూరు రైల్వే స్టేషన్లో ఓ ఫ్రెండ్ వచ్చి కలెక్ట్ చేసుకుంటాడని.. అతడికి ఇవ్వాలని కోరాడు. ఫ్రెండే కదా అని నమ్మిన సదరు యువకుడు బ్యాగ్ తీసుకొని ట్రైన్ ఎక్కాడు. గుంటూరు రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి బ్యాగ్ కోసం వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నాడు. ఈలోగా పోలీసులు అతడివద్దకు పరుగులు పెట్టుకుంటూ వచ్చి అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గరున్న బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా అందులో ఉన్న వస్తువులను చూసి పోలీసులతో పాటు యువకుడు కూడా షాకఅయ్యాడు.

    ఇది చదవండి: ట్రైన్లో కలిసిన టీటీఐతో ఎఫైర్... నాలుగేళ్లలో రూ.14కోట్ల బిజినెస్.. కట్ చేస్తే కటకటాల్లోకి.. అసలేం జరిగిందంటే..!


    అందులో ఏముందంటే..!
    తెలంగాణ నుంచి రైళ్లలో వచ్చే ప్రయాణికుల ద్వారా మద్యం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందించింది. పక్కా వివరాలు సేకరించిన పోలీసులు ఫ్లాట్ ఫామ్ పై ఉన్న యువకుడ్ని అదుపులోకి తీసుకోని అతడి బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అది ఓపెన్ చేసి చూడగా అందులో 81 మద్యం బాటిళ్లు ఉన్నాయి. అసలు అందులో మద్యం బాటిళ్లున్న సంగతి తనకు తెలియదని.. ప్రెండ్ సాయం చేయమంటే చేశానని ఆ యువకుడు మొత్తుకున్నాడు. పోలీసులు మాత్రం తెలియకుండా బ్యాగ్ ఎలా తెచ్చావని ప్రశ్నించారు. తెలిసి చేసినా తెలియక చేసినా అక్రమ మద్యం బాటిళ్లు కలిగి ఉండటం చట్టప్రకారం నేరమని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

    ఇది చదవండి: కుక్కల కోసం రూ.2కోట్లతో పార్క్.. జనం ఏమంటున్నారంటే..!



    ఫ్రెండ్ కదా అని గుడ్డిగా నమ్మి సాయం చేద్దామనుకుంటే కటకటాల పాలవ్వాల్సి వచ్చిందని యువకుడు వాపోతున్నాడు. ఐతే యువకుడ్ని అదుపులోకి తీసుకున్న సమయంలోనే మరో ఫ్లాట్ ఫారమ్ పై ఇద్దరు యువకులు మద్యం బాటిళ్లున్న బ్యాగుతో కనిపించారు. పోలీసులు వెళ్లి పట్టుకునేలోపు బాటిళ్లు వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Guntur, Liquor

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు