K. Gangadhar, News18, Guntur
రాజకీయాలు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాయ్ చేప్పడం కష్టం. ఒకరి గెలుపు కోసం మరొకరు కష్టపడి పని చేసిన నాయకులు పదవుల విషయం వచ్చేటప్పటికి కత్తులు దూసుకుంటుంటారు. సహజంగా ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎన్నికలలో తమ విజయం కోసం కృషిచేసిన వారి పట్ల గౌరవ భావంతో ఉంటారు. ఐతేప్రస్తుత రాజకీయాలు అందుకు పూర్తి భిన్నంగా సాగుతున్నాయి.
ఒక సారి తమ గెలుపుకు కారణమైన వారిని మళ్ళీ వచ్చే ఎన్నికలనాటికి పూర్తిగా తెరమరుగుచేసి తరువాతి కాలంలో వారి అవసరం లేకుండానే సొంత బలంతో నెగ్గాలని,తమ ప్రాంతంలో తాము మాత్రమే అధికార కేంద్రంగా ఉండాలని నేతలు భావిస్తున్నారు. అలాంటి వాటి లో చిలకలూరిపేట నియోజకవర్గం ఒకటి. అక్కడ వై.సి.పి రాజకీయాలు రోజుకోమలుపు తీసుకుంటున్నాయి.
చిలకలూరిపేట నియోజకవర్గం నుండి స్థానిక శాసనసభ్యురాలు విడదల రజని మంత్రి గా వ్యవహరిస్తున్నారు. అదే నియోజకవర్గంలో వై.సి.పి సీనియర్ నేత మర్రిరాజశేఖర్ ను కాదని అప్పట్లో జగన్ విడదలరజనీకి టికెట్ కేటాయించారు.రజనీని గెలిపించుకు రావాలనీ ,మర్రి రాజశేఖర్ ను మండలికి పంపి అతనిని మంత్రిని కూడా చేస్తానని పాదయాత్ర సందర్భంగా జగన్ బహిరంగంగానే ప్రకటించారు.
ఎన్నికల వరకూ బాగానే ఉన్నా.. ఆ తర్వాత మాత్రం ఇద్దరి మధ్య కొంత దూరం పెరిగిందని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరిగింది.మర్రి కి మొదటి విడత లోనే శాసన మండలి స్థానం దక్కాల్సి ఉండగా రజని అడ్డుకుంటూ వచ్చారని మర్రి రాజశేఖర్ వర్గీయులు ఆరోపించేవారు.
ఎట్టకేలకు ఈ దఫా మండలిలో మర్రి.రాజశేఖర్ కు చోటు దక్కింది.ఇప్పుడు ఇంక మంత్రి పదవి హామీ నెరవేరవలసి ఉందంటున్నారు మర్రి వర్గీయులు.ఇప్పటికే చిలకలూరిపేట నుండి విడదల.రజని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా భాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.గత ఏడాది జరిగిన రెండవ విడత మంత్రి వర్గ విస్థరణలో ఆమె చోటు దక్కించుకున్నారు.
ఐతే రజనీకి శాఖా పరమైన పట్టు పెద్దగా లేదని ప్రచారం జరుగుతుంది.అందు వలన ఆమెని తప్పించి మర్రి రాజశేఖర్ కి అవకాశం కల్పిస్తారు అని ప్రచారం నియోజకవర్గంలో జోరందుకుంది.పైగా బలమైన కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత కావడం,మంత్రి వర్గంలో కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేక పోవడంతో సీనియర్ నేత మర్రి రాజశేఖర్ కు ఈ సారి మంత్రి వర్గంలో ఖచ్చితంగా చోటు దక్కుతుందంటున్నారు ఆయన అభిమానులు.
అదే గనుక జరిగితే ఇప్పటికే ఉప్పూ నిప్పులా ఉన్న రజని-రాజశేఖర్ వర్గాల మధ్య వైరం మరింత పెరిగే అవకాశం ఉంది.అప్పుడు ఒకే వరలో ఇమడని రెండు కత్తుల చందంగా ఉంటుంది పరిస్థితి.ఒక జిల్లా నుండే ఇద్దరికి మత్రివర్గంలో స్థానం కల్పించే పరిస్థితి లేని ప్రస్తుత పరిస్థితులలో ఒక నియోజకవర్గం నుండి ఇద్దరికి మంత్రివర్గంలో చోటుకల్పించే పరిస్థితి ఉండదు అంటున్నారు మేధావులు.
ఈనెల3న జరగనున్న పార్టీ విస్థృత స్థాయి సమావేశంలో మంత్రి వర్గ విస్థరణ పైన,ముందస్తు ఎన్నికలపైన చర్చ జరిగే అవకాశం ఉంది అని సమాచారం.ఇప్పటికే మంత్రి సీదిరి అప్పలరాజు ను పిలిపించడం,స్పీకర్ తమ్మినేని ముఖ్యమంత్రిని కలవడం వంటి పరిణామాలతో మంత్రివర్గ విస్థరణపై జోరుగా చర్చ జరుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Guntur, Local News, Ysrcp