హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Lockdown in AP: ఏపీలో సాయంత్రం 6గంటల వరకే షాపులు... వీకెండ్ లో అంతా క్లోజ్

Lockdown in AP: ఏపీలో సాయంత్రం 6గంటల వరకే షాపులు... వీకెండ్ లో అంతా క్లోజ్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఏపీలో కరోనా వేగంగా వ్యాపిస్తున్నందున పాజిటివ్ కేసులు భారీగా పెరగుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపారస్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

  కరోనా మహమ్మారి గత సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరినీ అతలా కుతలం చేస్తుంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ సెకండ్ వేవ్ రూపంలో విలయతాండవం చేస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే పలు జిల్లాలలో కేసులు పెరుగుతుండటంతో ప్రజలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. దీంతో వ్యాపారస్తులు కూడా దుకాణాల నిర్వహణపై ఆంక్షలు విధించుకుంటున్నారు. ప్రజల ఆరోగ్య సంక్షేమాని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల వర్తక సంఘాలు స్వీయ లాక్ డౌన్ ప్రకటించుకున్నాయి. ఇప్పటికే గుంటూరు, విజయవాడలోని వర్తక సంఘాలు నిర్ణీత సమయంలోనే షాపులు తెరుస్తామని ప్రకటించారు. అలాగే కరోనా నిబంధనలు పాటిస్తేనే వినియోగదారులను షాపుల్లోకి అనుమతిస్తామని.. షాపుల్లోనూ మాస్కులు, శానిటైజర్లు ఏర్పాటు చేయాలని వర్తక సంఘాలు సూచిస్తున్నాయి. అలాగే కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఎలాంటి బాధ్యత వహించమని స్పష్టం చేశారు. సోమవారం నుంచి నిర్ణీత సమయంలోనే షాపులు పనిచేయనున్నాయి.

  గుంటూరు జిల్లాలో ఇటీవల దాదాపు నాలుగువేల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటం తో సోమవారం నుండి ఉదయం 9 గం నుండి సాయంత్రం 6 గం వరకు మాత్రమే వ్యాపార సంస్థలు తెరిచి ఉంచే విధంగా నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ఏయే వేళల్లో వ్యాపారం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకున్నట్లు ది ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. అలాగే గుంటూరు జిల్లా బాటలో బొబ్బిలి పట్టణ వ్యాపారస్తులు, కృష్ణ జిల్లా వర్తక సంఘాలు మరియు శ్రీశైల వర్తక సంఘాలు కూడా సోమవారం నుండి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే వ్యాపార సంస్థలు తెరిచి వ్యాపారం చేసుకునేవిధం తీర్మానం చేశాయి.

  ఇది చదవండి: రంగంలోకి దిగిన ఎమ్మెల్యే రోజా... వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్న వైసీపీ ఫైర్ బ్రాండ్


  కరోనా మొదటి దశలో ఎంతో మంది వర్తకులు కోవిద్ బారిన పడి ఆర్ధికంగానే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో నష్టపోయారు. అంతేకాక ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కుకును కోల్పోయాయి. ఈ రెండవ దశలో అటువంటి ఇబ్బందులను అధిగమించటానికి వర్తక సంఘాలు లు ఈ నిర్ణయం తీసున్నట్లు చెపుతున్నాయి. మాస్క్ ధరించని వారికి రూ.1000 జరిమానా కూడా విధించనున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మీద మరోసారి కరోనా ఉధృతి తీవ్రం కావడంతో అధికారులు ఎక్కడకు వెళ్లినా తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని.. ప్రతీ ఒక్కరు విధిగా కరోనా నిబంధనలు పాటించాలని వైద్య అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

  ఇది చదవండి: సీఎం జగన్ నివాసం వద్ద కరోనా కలకలం.. ఆందోళనలో అధికారులు, స్థానికులు

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Corona virus, Lockdown

  ఉత్తమ కథలు