GUNTUR GROOM COMMITS SUICIDE AS HE FEARED ABOUT FIRST NIGHT IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
First Night Effect: ప్రాణం తీసిన శోభనం.. ఫస్ట్ నైట్ భయంతో యువకుడు ఏం చేశాడంటే..!
కిరణ్ కుమార్ (ఫైల్)
పెళ్లైన కొత్త జంట (Newly Wed Couple) ఎదురుచూసేది తొలిరేయి కోసమే. తొలి రేయి అనుభవం కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తుంటారు. కానీ ఓ యువకుడికి మాత్రం ఫస్ట్ నైట్ అంటే భయం పట్టుకుంది. ఉత్సాహంతా తాళికట్టిన వాడు ఊహించని నిర్ణయించాడు.
పెళ్లైన కొత్త జంట ( Newly Wed Couple) ఎదురుచూసేది తొలిరేయి కోసమే. తొలి రేయి అనుభవం కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తుంటారు. ఎన్నెన్నో ప్లాన్లు కూడా వేసుటుంటారు. ఫస్ట్ నైట్ కోసం కొందరు విదేశాలు కూడా వెళ్తారు. రిసార్టుల్లో ప్లాన్ చేసుకొని లైఫ్ పార్ట్ నర్ తో ఎంజాయ్ చేస్తారు. కానీ ఓ యువకుడికి మాత్రం ఫస్ట్ నైట్ అంటే భయం పట్టుకుంది. ఉత్సాహంతా తాళికట్టిన వాడు అసలు ఘట్టానికి వచ్చేసరికి నీరుగారిపోయాడు. ఆ భయం కాస్తా పచ్చని పందిరిలో విషాదాన్ని నింపింది. కాళ్ల పారాణి ఆరకముందే వధువు జీవితాన్ని బుగ్గిపాలు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పల్నాడు జిల్లా (Palnadu District) మాచర్ల సాగర్ రింగ్‌రోడ్‌కు చెందిన సత్యనారాయణరాజు, విజయలక్ష్మి దంపతుల కుమారుడు పత్తిగుడుపు కిరణ్‌కుమార్ (32)కు ఈ నెల 11వ తేదీ గుంటూరు జిల్లా (Guntur District) తెనాలి వించిపేటకు చెందిన యువతితో వివాహం జరిగింది.
వివాహతంతు పూర్తైన తర్వాత కొత్త జంట శోభనానికి ఈనెల 16వ తేదీన పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. వరుడు కిరణ్‌కుమార్ తన తల్లితండ్రులతో కలసి మాచర్ల నుండి బయలు దేరి గుంటూరులో బస్సు దిగాడు. ఇప్పుడే వస్తానని తల్లితండ్రులకు చెప్పి వెళ్ళిపోయాడు. కిరణ్ ఎంతకూ తిరిగిరాకపోవడంతో ఫోన్ చేయగా స్విఛ్ ఆఫ్ వచ్చింది. దీంతో అతడి గురించి బంధువులకు చెప్పి ఇద్దరూ తెనాలి వెళ్లిపోయారు.
ఇదిలా ఉంటే ఇదిలా ఉండగా కృష్ణానది ఎగువ ప్రాంతంలో మృతదేహం ఉందని తాడేపల్లి పోలీసులకు సమాచారం అందడంతో బయటకు తీసి పరిశీలించారు. పూర్తిగా కుళ్లిపోయి కనిపించింది. జేబులోని సెల్ ఫోన్ పరిశీలించి సిం కార్డు తీసి మొబైల్లో వేసి కిరణ్ కుమార్ వివరాలు సేకరించారు. తల్లిదండ్రులకు సమాచారమివ్వగా మృతదేహం కిరణ్ ది గుర్తించారు.
ఐతే అతడి మృతికిగల కారణాలను ఆరా తీయగా తల్లిదండ్రులు విస్తుపోయే సమాధానం చెప్పారు. శోభనం అంటే భయంతోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఈ విషయంలో ధైర్యం చెప్పాలని అతడి స్నేహితులకు చెప్పామని.. కానీ మనసులో భయం పెట్టుకొని ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టాడని బోరున విలపించారు. తొలిరేయి అంటే ఉన్న భయం, అపోహలు.. తల్లిదండ్రులను ఒంటరివారిని చేయడమే కాకుండా నవ వధువు నిండునూరేళ్ల జీవితాన్ని బుగ్గిపాలు చేశాడని వాపోతున్నారు. పెళ్లైన వారం రోజులకే భర్త ఆత్మహత్య చేసుకోవడంతో వధువు శోకసంద్రంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.