Government Vs Employees: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మళ్లీ గవర్నమెంట్ Vs ఎంప్లాయిస్ (Government vs Employees) వార్ పీక్ కు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఛలో విజయవాడ (Chalo Vijayawada) వరకు ఉన్న పరిస్థితులే మళ్లీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సారి పరిస్థితి మరింత సీరియస్ అయ్యే ప్రమాదం ఉంది అంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సర్కార్‌కు సెగలు తప్పేలా లేవు. తాజాగా ఏపీ జేఏసీ (AP Jac) కీలక ప్రకటన చేసింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి తమ వాయిస్ వినిపించారు. ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు.
తమ సమస్యలు పరిష్కరించకుంటే.. సమ్మె తప్పదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. జీతాల చెల్లింపు, ఆర్ధికపరమైన విషయాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ వేసింది ప్రభుత్వం. ఎప్పటికప్పుడు వారితో సంప్రదింపులు జరుపుతూనే వస్తోంది. పీఆర్సీ నుంచి అనేక సమస్యల పరిష్కారంలో మంత్రుల కమిటీ వన్ బై వన్ పరిశీలిస్తూ వస్తోంది. ఈ విషయంలో ఉద్యోగ సంఘాలు ఏమాత్రం సంతృప్తి చెందడం లేదు. దీంతో ప్రధాన సంఘాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి.
ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు అన్నీ.. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి , ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేతలు ప్రభుత్వంపై తమ ఆరోపణలు తీవ్ర చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి చాలాసార్లు తమ సమస్యల పరిష్కారానికి విన్నపాలు చేశామని.. అందుకు సరైన స్పందన రావడం లేదంటున్నారు. అందుకే సంక్రాంతిలోగా తమ సమస్యలను పరిష్కరించకుంటే.. ఆందోళనలకు సిద్ధమంటున్నారు.
ఇప్పటికే ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బోపరాజు కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం నుంచి రావల్సిన బకాయిలు రావడం లేదని ఆరోపించారు బోపరాజు. జీతాలు పెన్షన్లు ఆలస్యమవడాన్ని తీవ్రంగా ఖండించారాయాన. ప్రధాన సంఘం ఏపీ జేఏసీ కూడా ఇదే బాటలో వెళ్తోంది. జనవరి లోపు తమ సమస్యలను పట్టించుకోకుంటే ఉద్యోగ జేఏసీ సమ్మెకు వెళ్తుందని ప్రకటించారు ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు. జీతాల విషయంలో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామనీ, చీఫ్ సెక్రటరీ ఇచ్చిన హామీలు, నీటి మీద రాతలయ్యాయని అన్నారాయన.
ఇదీ చదవండి : నోరుజారారా.. కావాలనే అన్నారా.. మహానటిపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. ఫైరవుతున్న నెటిజన్లు
ఉద్యోగ సంఘాల తీరును తప్పు పడుతున్నారు ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి .. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఉద్యోగులు తిరిగి సమ్మెకు వెళ్లే పరిస్థితి రాకుండా చక్కదిద్దుతామంటున్నారు సజ్జల. ఇటు ఉద్యోగులు అటు ప్రభుత్వం ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. ఉద్యోగ సంఘాల సంక్రాంతి డెడ్ లైన్ పని చేస్తుందా? లేక మరో మారు ఆందోళన తప్పదా? అన్నది తేలాల్సి ఉంది.
ఇదీ చదవండి : 2024 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారా..? అసలు తారక్ మనసులో ఏముంది..?
మరోవైపు ప్రభుత్వం తీరును తప్పు పడుతున్నారు ఉద్యోగ సంఘం నేతలు. పీఆర్సీ సిఫార్సుల అమలులో శాస్త్రీయమైన ప్రక్రియను ప్రభుత్వం అభాసుపాలు చేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 జులైలో 12వ పీఆర్సీని నేరుగా జమ చేసేలా ఏప్రిల్ నుంచి దీర్ఘకాలిక పోరాటానికి శ్రీకారం చుడతామని వెల్లడించారు. ఉద్యోగుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని రాబోయే రోజుల్లో రావాల్సిన ప్రయోజనాల కోసం పోరాటానికి దిగాలని తీర్మానించుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. నెలలో ఒకసారైనా ఆర్థిక శాఖ మంత్రి సచివాలయానికి వచ్చి ఉద్యోగ సంఘాలకు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 20వ తేదీ వచ్చినా ఇంకా జీతాలు, పింఛన్లు జమ చేస్తున్నారని, ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చెల్లించకుండా తమ సహనాన్ని పరీక్షిస్తోందని అనుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Employees