హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Guntur: పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి అనుకుంటున్నారా..? మీకో గుడ్ న్యూస్

Guntur: పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి అనుకుంటున్నారా..? మీకో గుడ్ న్యూస్

మార్షల్

మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి అనుకునే వారికి గుడ్ న్యూస్

Guntur: నిరాయుధంగా శత్రువు ఎదిరించడంలో మార్షల్ ఆర్ట్స్ ది ప్రత్యేక స్థానం. ముఖ్యంగా కరాటేలో అనేక స్టయిల్స్ ఉన్నాయి. ఒక్కో స్టయిల్‌కు ఒక్కో విధమైన సాధన అవసరం. అలా కరాటే విద్యలో ఒక స్టయిలే కుంగ్‌ ఫూ. ఈ మార్షల్‌ ఆర్ట్‌ ఇప్పుడు మన దగ్గరే నేర్చుకోవచ్చు!

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Sumanth Jangam, News 18, Guntur.

  ఈ రోజుల్లో చదువులు అంటే పూర్తిగా క్లాస్ రూమ్‌ (Class Room) స్టడీ.. కానీ పూర్వం చదువుల్లో యుద్దకళలు ఒక భాగం. కేవలం పుస్తకాల పురుగుల్లా చదవటమే కాదు.. శారీరక దృఢత్వంపై దృష్టి పెట్టడం కూడా అప్పటి విద్యలో తప్పనిసరి. శత్రువుల నుంచి తమను, తమ వాళ్లను కాపాడుకోవడానికి యుద్ద విద్యలు ఉపయోగపడేవి. మన పూర్వీకులు కర్రసాము, కత్తిసాము, మల్లయుద్దము, విలువిద్య... లాంటి సాంప్రదాయ యుద్దవిద్యలు నేర్చుకునేవారు.. కానీ కాలక్రమేణా మార్షల్‌ ఆర్ట్స్‌ (Marshal Arts) ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. ఈ మార్షల్‌ఆర్ట్స్‌లో నిరాయుధంగా శత్రువు ఎదిరించడంలో కరాటే మించింది లేదు. 'కరాటే' (Karate) అంటేనే ఖాళీ చేతులు అని అర్థం. ఈ కరాటేలో అనేక స్టయిల్స్ ఉన్నాయి. ఒక్కో స్టయిల్‌కు ఒక్కో విధమైన సాధన అవసరం. అలా కరాటే విద్యలో ఒక స్టయిలే కుంగ్‌ ఫూ.

  కుంగ్‌ ఫూ అంటే ఎవ్వరికైనా ఠక్కున గుర్తొచ్చేంది బ్రూస్‌లీ. చైనాలో పుట్టిన ఈ వీరుడు ఖాళీ చేతులతో ముప్పై, నలభై మందిని సైతం మట్టి కరిపించగలడు. మన చేతుల్లో ఎలాంటి ఆయుధాలు లేనప్పుడు మన ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఉత్తమం. అదే చిన్నప్పటి నుండి ఈ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంటే సులభంగా వచ్చేస్తుంది.

  ఆత్మరక్షణ విద్యల్లో శరీరాన్ని ఆయుధంగా మార్చే యుద్ధ కళ కుంగ్‌ ఫూకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ కుంగ్ ఫు కేవలం ఆత్మరక్షణ విద్య ఒక్కటే కాదు… శారీరిక మరియు మానసిక దృఢత్వం కూడా లభిస్తుంది. కొన్ని శతాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఈ కుంగ్‌ఫూ విద్యను ఎంతో మంది నేర్చుకుంటున్నారు. అంతే కాదు ఎన్నో దేశాలలో ఈ మార్షల్‌ ఆర్ట్‌ కుంగ్‌ఫూను అఫిషియల్ గేమ్‌గా ప్రకటించారు. మన ఇండియా ప్రభుత్వం కూడా ఈ యుద్ధకళను ప్రోత్సహిస్తుంది. అందుకే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (Sports Authority of India) ఈ కుంగ్‌ఫూను గుర్తించి నేషనల్‌ లెవల్‌లో గేమ్స్‌ కండక్ట్‌ చేస్తుంది.

  ఇదీ చదవండి : 2 రూపాయలకే చికెన్ రైస్.. అన్న క్యాంటీన్‌లో స్పెషల్ ఫుడ్.. ఎక్కడో తెలుసా? ప్రత్యేకత ఏంటి..?

  మన రాష్ట్రంలో అనేక ముఖ్య పట్టణాల్లో కరాటే అకాడెమీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటే గుంటూరులోని బీఆర్‌ స్టేడియం. ఈ స్టేడియంలో గత 35 ఏళ్లుగా విద్యార్థులకు కుంగ్‌ఫూ విద్యను నేర్పిస్తున్నారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారిలో ఎంతోమంది నేషనల్‌ మెడల్స్‌ను సాధించారు. వూషు అసోసియేషన్ ద్వారా బండి హనుమంతు కుంగ్‌ఫూ గేమ్‌ని గుంటూరు జిల్లా వాసులకు పరిచయం చేసి గత 35 ఏళ్లుగా ట్రైనింగ్‌ ఇస్తున్నారు.

  ఇదీ చదవండి: దోషులు ఎవరినీ వదిలిపెట్టను.. అది మా తప్పే అన్న చంద్రబాబు నాయుడు

  కుంగ్ ఫూ నేర్చుకోవడం ద్వారా ఆత్మరక్షణ, శారీరక మానసిక దృఢత్వం సాధించవచ్చని హనుమంతు చెబుతున్నారు. కుంగ్ ఫూ గవర్నమెంట్‌ గుర్తింపు పొందిన గేమ్‌ కావడంతో విద్యార్థులకు భవిష్యత్‌లో స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం సాధించే అవకాశం కూడా ఉంటుందన్నారు.


  బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి కుంగ్‌ ఫూ క్లాసులు జరుగుతాయి. అక్కడ ఫీ రూ. 1000 నుంచి రూ.1500 వరకు ఉంటుంది.

  అడ్రస్‌ : బ్రహ్మానందరెడ్డి స్టేడియం, మౌలానా అబ్దుల్‌ కలాం రోడ్డు, గుంటూరు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌-522001.

  సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్‌ : 91107 78843

  ఎలా వెళ్లాలి?

  గుంటూరు బస్టాండ్‌ నుంచి మౌలానా అబ్దుల్ కలాం రోడ్‌కు ఆటోలు, బస్సులు అందుబాటులో ఉంటాయి. అక్కడ నుంచి బ్రహ్మానందరెడ్డి స్టేడియంకు వెళ్లొచ్చు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Guntur, Local News

  ఉత్తమ కథలు