Home /News /andhra-pradesh /

GUNTUR GOOD NEWS TO ANDHRA PRADESH FROM AUGUST 15TH ONWARD FAMILY DOCTOR PROGRAMME COMMENCE NGS

Family Doctor: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్.. మెరుగైన వైద్యమే లక్షం

ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్

ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్

Family Doctor: సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఆరోగ్యశ్రీని సైతం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా సరికొత్తగా ఫ్యామిలీ డాక్టర్ అంటే సరికొత్త కార్యాక్రమాన్ని ప్రారంభించారు. ఆ సేవలు ఆగస్గు 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.. ఆ స్కీమ్ లెక్క ఏంటంటే..?

ఇంకా చదవండి ...
    Family Doctor: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పేద ప్రజలకు.. గ్రామీణ ప్రజలకు శుభవార్త.. అసలే సీజనల్ వ్యాధులు తీవ్రంగా విస్తరించి నరకయాతన అనుభవిస్తున్న వారికి ఇది నిజమైన గుడ్ న్యూస్.. ఎందుకంటే ఏపీ వ్యాప్తంగా ఆగస్గు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ (Family Doctor) విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినీ (Vidadala Rajani) వెల్లడించారు. విద్యా, ఆరోగ్య రంగాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ప్రత్యేక ఫోకస్ చేశారు. అందులో భాగంగానే ఈ ఫ్యామిలీ డాక్టర్ ను తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా ప్రతి ఐదు లేదా ఏడు గ్రామాలకు ఒక డాక్టర్ ను కేటాయించనున్నారు. ఆయా డాక్టర్లు తమకు కేటాయించిన గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందించనున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యాన్ని దగ్గర చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం.. అలాగే ప్రతి గ్రామానికి నెలలో రెండు సార్లు 104 అంబులెన్స్ లను పంపించనున్నారు. కేటాయించిన గ్రామాల్లో ఒక ప్రత్యేక వైద్యులు పీహెచ్ సీలో ఉంటే.. మరో వైద్యుడు గ్రామంలోకి వెళ్లి నేరుగా ప్రజలను పరీక్షిస్తారు. ఆగస్టు 1నుంచి రాష్ట్రవ్యాప్తంగా ట్రయల్‌ రన్‌ ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ విధానంపై ఆశా వర్కర్, ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీ నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వరకూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 26 జిల్లాల వారీగా మాస్టర్‌ ట్రైనర్‌లను గుర్తించి, వారికి బుధవారం విజయవాడలో శిక్షణ ఇచ్చారు. వీరు జిల్లాల్లోని వైద్యులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తారు.

    ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(PHC)లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్‌ నర్సులు, ఇతర సిబ్బంది ఇప్పటికే ఉన్నారు. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో భాగంగా పీహెచ్‌సీల్లో పనిచేసే ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలో ఉన్న సచివాలయాలను కేటాయిస్తారు. ఈ క్రమంలో ఒక వైద్యుడు పీహెచ్‌సీలో ఉంటే, మరో వైద్యుడు 104 వాహనంతో గ్రామాలకు వెళ్లి తనకు కేటాయించిన సచివాలయ పరిధిలోని కుటుంబాలకు వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది.



    రోజు మార్చి రోజు ఒక వైద్యుడు పీహెచ్‌సీలో మరో వైద్యుడు 104 వాహనం ద్వారా గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తారు. వైద్యుడితో పాటు, సంబంధిత వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లోని మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ), సచివాలయ ఏఎన్‌ఎం, ఆశ వర్కర్‌లు ప్రజలకు గ్రామాల్లోనే 104 ఎంఎంయూ ద్వారా వైద్య సేవలు అందిస్తారు. గ్రామ సచివాలయాలు కేంద్రంగా 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ (MMU)ల ద్వారా ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రజలకు చేరువ చేయనున్నారు. ప్రతి గ్రామ సచివాలయానికి నెలలో ఒక రోజు 104 వాహనాలు వెళుతున్నాయి.

    ఇదీ చదవండి : బామ్మతో సెల్ఫీ.. బురదలో వాకింగ్.. పేదలకు తోడుగా లోకేష్ తోపుడు బండ్లు..

    అదే రోజు మధ్యాహ్నం వరకు 104 వైద్యుడు, సిబ్బంది ఓపీలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత గృహాలను సందర్శించి, మంచానికి పరిమితమైన వృద్ధులు, వికలాంగులు, బాలింతలు, పిల్లలకు వైద్యం చేస్తున్నారు. అలాగే ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో అదనంగా అవసరమయ్యే 432 కొత్త 104 వాహనాలు కొనుగోలుకు వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది.

    ఇదీ చదవండి : చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ వెనుక ఉన్నది బాలయ్యేనా.. అసలు మ్యాటర్ అదేనా?

    ఫ్యామిలీ డాక్టర్ విధానం అంటే..?
    సాధారణంగా ఆర్థిక స్థితి మెరుగ్గా ఉన్న కుటుంబాల ప్రత్యేకంగా వైద్యుడిని తమ ఫ్యామిలీ డాక్టర్‌గా ఎంచుకుంటారు. కుటుంబంలో ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా, వెంటనే ఆ వైద్యుడిని మాత్రమే నిత్యం సంప్రదిస్తూ ఉంటారు. అలాగే చేస్తే వారి మెడికల్ హిస్టరీ తెలిసిన డాక్టర్ గా.. ఆ జబ్బును త్వరగా గుర్తించడం, చిన్న చిన్న జబ్బులు అయితే ప్రాథమిక వైద్యం చేయడం, స్పెషలిస్ట్‌ వైద్యం అవసరం ఉంటే రెఫర్‌ చేయడం.. ఇలా వారి ఆరోగ్యం పట్ల వైద్యుడు నిరంతరం ఫాలోఅప్‌లో ఉంటాడు. అలా చేయడం ద్వారా ఆ కుటుంబంలోని వ్యక్తుల ఆరోగ్యంపై వైద్యుడికి సమగ్ర అవగాహన ఉంటుంది. ఆ కుటుంబానికి మెరుగైన వైద్య సంరక్షణ సమకూరుతుంది. ఇదే తరహాలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం.

    ఇదీ చదవండి : ఏపీ-తెలంగాణ లకు కేంద్రం మరో షాక్.. 2026 వరకు వెయిట్ చేయాల్సిందే..?

    తాజా విధానం ద్వారా గ్రామాల్లో నెలలో రెండు సందర్శనలు చేపట్టడానికి వీలుగా 432 ఎంఎంయూలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. కొత్త వాహనాలు అందుబాటులోకి వచ్చే వరకు ఒక సందర్శన ద్వారానే ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. అయితే వీలున్న చోట వీటి ద్వారానే రెండు సందర్శనలు చేపట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. కొత్త వాహనాలు అందుబాటులోకి వచ్చాక నెలలో రెండు సందర్శనల ద్వారా పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలు చేస్తారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Ap welfare schemes, Cm jagan, Vidadala Rajani

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు