GUNTUR GOLD GOES MISSING IN A BANK LOCATED IN PALANADU DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
Gold Loan: బ్యాంకులో బంగారం తాకట్టుపెడుతున్నారా..? అయితే ఈ స్టోరీ చదవండి..!
ప్రతీకాత్మకచిత్రం
Gold Loan: సాదరణంగా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు డబ్బులు అవసరమైనప్పుడు తమ దగ్గరున్న బంగారు ఆభరణాలను తాకట్టు తాకట్టుపెట్టు పెడుతుంటారు. ఇక బయట మార్వాడీ వద్ద కుదవ బెడితే అధిక వడ్డీలు తీసుకుంటూ ఉంటారు. అందుకే ప్రజలు బంగారు తాకట్టు ప్రభుత్వ రంగ బ్యాంకులలో తాకట్టుపెడుతుంటారు.
సాదరణంగా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు డబ్బులు అవసరమైనప్పుడు తమ దగ్గరున్న బంగారు ఆభరణాలను తాకట్టు తాకట్టుపెట్టు పెడుతుంటారు. ఇక బయట మార్వాడీ వద్ద కుదవ బెడితే అధిక వడ్డీలు తీసుకుంటూ ఉంటారు. అందుకే ప్రజలు బంగారు తాకట్టు ప్రభుత్వ రంగ బ్యాంకులలో తాకట్టుపెడుతుంటారు. ప్రభుత్వ బ్యాంకుల్లో 60 పైసల నుంచి 80 పైసల వరకు వడ్డీ ఉంటుంది. దీంతో ఆ మధ్య తరగతి కుటుంబంపై భారం తగ్గుతుంది. అందుకే నగల తాకట్టు బ్యాంకులలో పెట్టేందుకె మొగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా చేసుకొని బ్యాంకులో కొందరు మాయగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. చేతివాటం చూపించడంలో ఇంటి దొంగలు ముందు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పల్నాడు జిల్లా (Palanadu District) లో ఇలాంటి ఘటనే జరిగింది.
రాజుపాలెం మండలంలోని ఆకుల గణపవరంలోని ఒక ప్రముఖ జాతీయ బ్యాంకులో అదే గ్రామానికి చెందిన యువకుడు గతేడాది జనవరిలో 20 గ్రాముల బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టి లోన్ తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం ఆభరణాలు విడిపించుకునేందుకు బ్యాంకుకు వచ్చి వడ్డీతో సహా అప్పుమొత్తం తీర్చేశాడు. ఐకే మధ్యాహ్నం వచ్చి నగలు తీసుకెళ్లాలని బ్యాంక్ సిబ్బంది సూచించడంతో మధ్యాహ్నం వచ్చాడు. అక్కడున్నవారు సాయంత్రం రమ్మని చెప్పి రాత్రి 8గంటల వరకు కూర్చోబెట్టారు. దీంతో ఆగ్రహించిన యువకుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అదే సమయంలో గ్రామపెద్దలు యువకుడ్ని పిలిచిమాట్లాడగా.. బంగారం మిస్సైనట్లు క్లర్క్ అంగీకరించాడు. ఐతే బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న నగలు ఎలా మాయమయ్యాయనేది మిస్టరీగా మారింది. బంగారం ఎక్కడైనా పోయిందా..? లేక ఇంటి దొంగలే మాయం చేశారా..? అనేది తేల్చే పనిలో పడ్డారు అధికారులు.
గత ఏడాది కర్నూలు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ బ్యాంక్ సిబ్బంది కస్టమర్ తాకట్టు పెట్టిన ఆభరణాలను మాయం చేసి.., నకిలీ ఆభరణాలు కస్టమర్లకు ఇచ్చారు. కర్నూలు జిల్లాలోని ఆదోని కేడీసీసీ బ్యాంకు తనఖా పెట్టిన బంగారు ఆభరణాలకు బదులుగా నకిలీ బంగారు అందించారు బ్యాంకు అధికారులు. అంబేద్కర్ నగర్ కు చెందిన తిరుపతి ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి అత్యవసరాల రీత్యా 2019 డిసెంబరులో 35.81 తులాల బంగారు ఆభరణాలు బ్యాంకులో తనఖా పెట్టారు. తాకట్టు పెట్టిన నగల ద్వారా రూ.4,98,600 రుణం తీసుకున్నారు. కరోనా కారణంగా వడ్డీని సరిగా చెల్లించలేకపోయారు. దీంతో అతను రుణం సరిగా చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసి నగలను వేలం వేస్తానని హెచ్చరించారు. ఐతే సదరు వ్యక్తి డబ్బులు తెచ్చి బ్యాంకుకు చెల్లించగా.. వారు నకిలీ బంగారం చేతిలో పెట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.