Home /News /andhra-pradesh /

GUNTUR GIRL SLIPS FALLS INTO CANAL WHILE TAKING SELFIE DIES SB

సెల్ఫీ తీసుకుంటూ కెనాల్ పడి యువతి మృతి... పిల్లలకు సెల్‌ఫోన్ ఇవ్వకండి అంటూ తల్లి రోదన

ధనలక్ష్మీ (ఫైల్ ఫోటో)

ధనలక్ష్మీ (ఫైల్ ఫోటో)

సెల్ఫీ నా బిడ్డ ప్రాణం తీసింది... పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వకండి అంటూ ఆ తల్లి రోదిస్తున్న తీరు స్థానికుల చేత కూడా కంటతడి పెట్టించింది.

    సెల్ఫీ పిచ్చి మరో యువతి ప్రాణం తీసింది. నిండు నూరేళ్లు నిండకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయింది. కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో  ఈ  విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. నర్సరావుపేటకు చెందిన ధనలక్ష్మి తన స్నేహితురాలుతో కలసి శుభకార్యానికి నకరికల్లు మండలం కండ్లగుంట వెళ్లింది. మార్గంమధ్యలో కడ్లకుంట బ్రాంచి కెనాల్ వద్ద సెల్ఫీ దిగాలనుకున్నారు. సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలో ఇద్దరూ ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోయారు. స్ధానికులు గమనించి వెంటనే ఒకరిని రక్షించారు. మరో విద్యార్ధి ధనలక్ష్మి మాత్రం కెనాల్ పడి మృతిచెందింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ధనలక్ష్మీ తల్లి ఏడుస్తున్న తీరు అక్కడున్న వారి గుండెల్ని కలిచివేసింది. సెల్ఫీ నా బిడ్డ ప్రాణం తీసింది... పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వకండి అంటూ ఆ తల్లి రోదిస్తున్న తీరు స్థానికుల చేత కూడా కంటతడి పెట్టించింది.

    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Gunturu, Narasaraopet, Selfie, Selfie Deaths

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు