GUNTUR GANG RAPE ON WOMAN AT GURAJALA RAILWAY STATION AS POLICE INVESTIGATION GOING ON FULL DETAILS HERE PRN GNT
AP News: రైల్వే స్టేషన్లో గ్యాంగ్ రేప్.. తల్లిఒడిలో చిన్నారి ఉన్నా కనికరించని మృగాళ్లు..
ప్రతీకాత్మక చిత్రం
AP Crime News: జిల్లాలో పోలీస్ వైఫల్యానికి అద్దంపడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దిశ యాప్, దిశా చట్టాలను తెచ్చామని ప్రభుత్వం చెబుతున్నా మృగాళ్లలో ఎలాంటి భయం లేకుండా పోతోంది.
మహిళలకు ఎక్కడున్నా రక్షణ కరవువుతోంది. కుటుంబంతో ఉంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. అలాంటి ఒంటరిగా ఉంటే.. ఆమెపై మృగాళ్ల కన్నుపడితే ఆమె జీవితం తోడేళ్లకు చిక్కిన జింకపిల్ల పరిస్థితే అవుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పల్నాడు జిల్లాలో ఇలాంటి దారుమే జరిగింది. రెండేళ్ల చంటిబిడ్డతో ఒంటరిగా ఉన్న మహిళపై కన్నేసిన మృగాళ్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. రైల్వే స్టేషన్లో ఒంటరిగా ఉన్న మహిళను లాక్కెళ్లిన దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి కావడంతో ఆమెను ఎవరూ గుర్తించలేదు. రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫామ్ చివర్లోనే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. ఉదయం మహిళను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మహిళపక్కనే రెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఐతే ఆమె ఇతర రాష్ట్రానికి చెందినది కావడంతో నిందితుల వివరాలు సరిగా చెప్పలేకపోతోంది.
ఇద్దరు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె మాటల ద్వారా తెలుస్తోంది. బాష రాకపోవడంతో సరిగ్గా ఏం జరిగిందో తెలియడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ఆమె ఒడిశాకు చెందిన మహిళగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆమె ఎక్కడి నుంచి వస్తోంది.. ఎక్కడికి వెళ్తోందనే వివరాలు మాత్రం తెలియడం లేదు.
గతంలో గుంటూరు జిల్లా (Guntur District) లో ఇలాంటి ఘటనే జరిగింది. పాలడుగు సమీపంలో భార్య, భర్తలు కలిసి వెళ్తుండగా అడ్డగించిన దుండగులు భార్యపై అత్యాచారం చేశారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా మూడు నెలల తర్వాత కర్నూలుకు చెందిన దోపిడీ ముఠా ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇక గత ఏడాది గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని సీతానగరం ఘాట్ వద్ద ఓ యువతి.. తనకు కాబోయే భర్తతో కలిసి ఉండగా.. అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు వారిపై దాడి చేశారు. యువకుడ్ని కత్తితో బెదిరించి.. యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఘటన సంచలనం సృష్టించింది. రెండు నెలల తర్వాత నిందితుల్లో ఒకరు పోలీసులకు చిక్కారు. మరో నిందితుడి ఆచూకీ ఇంతవరకు కనిపెట్టలేకపోయారు.
ఇప్పుడు ఈ గురజాల రైల్వే స్టేషన్లో జరిగిన ఘటన కూడా జిల్లాలో పోలీస్ వైఫల్యానికి అద్దంపడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దిశ యాప్, దిశా చట్టాలను తెచ్చామని ప్రభుత్వం చెబుతున్నా మృగాళ్లలో ఎలాంటి భయం లేకుండా పోతోంది. పక్కనే చిన్నపిల్లాడున్నాడన్న మానవత్వాన్ని మరిచి మహిళపై అకృత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.