Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati.
కేవలం గాడిద పాలు (Donkey Milk) కే కాదు.. మాంసానికి ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఈ మాంసాన్ని ఊహించని గిరాకీ లభిస్తోంది. పూర్వం రోజుల్లో స్టూవర్టుపురం దొంగలు వేగంగా పరుగెత్తడానికి, ఒక వేళ దొంగతనాలు చేస్తూ చిక్కితే పోలీసులు కొట్టే దెబ్బలకు నొప్పి రాకుండా ఉండేందుకు గాడిద రక్తం తాగడంతోపాటు, గాడిద మాసం (Doneky Meet) తినేవారని పెద్దలు చెబుతూ ఉంటారు. తాజాగా గాడిద మాంసం వినియోగం పెరిగిపోయింది. కొద్ది రోజుల కిందట పెటా సహకారంతో పోలీసులు ఒంగోలు (Ongle), గుంటూరు (Guntur)లో 750 కేజీల గాడిద మాంసం స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు కోతకు సిద్దం చేసి 36 గాడిదలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
గాడిదలను అక్రమంగా తరలించడం, వధించడం నేరమని పోలీసులు చెబుతున్నారు. అయినా అక్రమార్కులు మాత్రం ఆగడం లేదు. గాడిద మాంసానికి మంచి డిమాండ్ ఉండటంతో కిలో రూ.700 నుంచి రూ.800లకు అమ్ముతున్నారు. ఇతర రాష్ట్రాలకు గాడిదలను అక్రమంగా కొందరు తరలిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.
ఎందుకంత డిమాండ్: రక్తం తాగడం, గాడిద మాంసం తినడం వల్ల శరీరం ఉక్కులా తయారవుతుందనేది అపోహ మాత్రమేనని డాక్టర్లు చెబుతున్నారు. మరికొందరు మోకాళ్ల నొప్పులు తగ్గుతాయనే ఉద్దేశంతో గాడిద మాంసం తింటున్నారు. ఇందులో శాస్త్రీయత లేదని డాక్టర్లు నిర్థరించారు. అయినా వినియోగదారులు మూడనమ్మకాలతో గాడిద మాంసం కోసం అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇదీ చదవండి : విద్యార్ధులతో కలిసి క్రికెట్.. కబడ్డీ ఆడిన మంత్రి? ఆటలో అదరగొట్టిన రోజా
దేశంలో గాడిదల జనాభా వేగంగా తగ్గిపోతోందని పెటా సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. గడచిన దశాబ్దకాలంలో గాడిదల సంఖ్య 67 శాతం తగ్గిందని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇదే విధంగా గాడిదలను కోసుకుని తింటే రాబోయే కొద్ది సంవత్సరాల్లో గాడిదలు అంతరించిపోయే ప్రమాద ముందని పెటా సంస్థ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాడిదలను రక్షించేందుకు వారు పోలీసులతో కలసి పనిచేస్తున్నారు.
ఇదీ చదవండి: భక్తులతో కిటకిట లాడుతున్న ఏడుకొండలు.. సర్వదర్శనంకు ఎంత సమయం పడుతోంది అంటే?
గాడిదలను అక్రమంగా రవాణా చేయడం, వధించడం, వాటి మాంసం విక్రయించడంపై వారు నిఘా పెట్టారు. గుంటూరు, ఒంగోలు, బాపట్ల ప్రాంతాల్లో గాడిద మాంసం అమ్మే వారిని పోలీసులకు పట్టించారు. ఇప్పటికే గాడిద మాంసం విక్రయిస్తోన్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. రవాణాకు సిద్దం చేసిన 36 గాడిదలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి : వైసీపీ ఎన్నికల నినాదం అదే.. కలిసి వస్తున్న మూడు రాజధానుల నిర్ణయం.. ఎంతశాత ప్రభావం
గాడిద పాలు, గాడిద రక్తం, గాడిద మాంసం ఇలా ఏదీ వదలడం లేదు. ఇటీవల గాడిద పాలు లీటరు రూ.10వేలు అంటూ తెగ ప్రచారం చేశారు. గాడిద పాలు తాగితే అస్థమా తగ్గుతుందని అసత్య ప్రచారం చేసి కోట్లు సంపాదిస్తున్నారు కొందరు. మూడనమ్మకాలే ఆలంబనగా సాగుతున్న ఈ దందాకు పుల్ స్టాప్ పెట్టాలని పెటా కోరుతోంది. గాడిద మాంసంలో ఏ విధమైన ఔషధ గుణాలు లేవని శాస్త్రీయంగా తేలిందని వారు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Donkey, Guntur