Home /News /andhra-pradesh /

GUNTUR FRIENDS KILLED THEIR FRIEND BECAUSE OF PENDING 250 RUPEES ONLY NGS TPT

AP Crime: స్నేహితుడిని హత్యా చేసిన మరో ఇద్దరు స్నేహితులు... కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP Crime News: వాళ్లు మంచి స్నేహితులు.. కానీ చిన్న వివాదం వారి మధ్య దూరం పెంచింది. చివరికి హత్యకు దారి తీసింది. అయితే ఇద్దరు స్నేహితులు కలిపి.. తమ స్నేహితుడిని చంపిన కారణం తెలిసి.. పోలీసులు సైతం షాక్ అయ్యారు.

    AP Crime News:  డబ్బు ఇది లేనిదే ప్రస్తుత ప్రపంచం లేదు.. ఏ పని జరగాలన్నా డబ్బు ఉండాల్సిందే.. అయితే ఈ డబ్బు ఎంత మంచిదో.. అంతే ప్రమాదం కూడా.. ఎంతలా అంటే.. ఆ డబ్బుకి చేతులు మారి మన రాతలు మార్చేంత శక్తి ఉంది.  చిన్న గుండు సూది నుంచి పెద్ద పెద్ద వస్తువులు.. వాహనాలు కొనుగోలు చెయ్యాలంటే నగదు ఎంతో అవసరం. స్నేహితుల మధ్య డబ్బులు హోదా అనే పదాలు సామాన్యంగా కనిపించవు. రూపాయి రూపాయి ఎం చేస్తావు అంటే మంచి మిత్రుల మధ్య చిచ్చురేపి భద్ర శత్రువులుగా మార్చేస్తానని చెబుతుంది. ఆ మాటే నిజమనిపిస్తోంది.... కేవలం 250 రూపాయల కోసం తన ప్రాణ మిత్రుణ్ణి హత్య చేసిన ఘటన కడప జిల్లా (Kadapa District) లో తీవ్ర కలకలం రేపుతోంది.

    పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..  కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని కలమల్ల గ్రామంలో నివాసం ఉంటున్నాడు శ్రీనివాసులు (Srinivasulu). ఊరిలో ఇతనితో గంగారాం, ఖాదిర్ లు స్నేహంగా మెలిగే వాళ్ళు. ఎక్కడికి వెళ్లిన ముగ్గురూ వెళ్తూ వచ్చే వారు. దింతో పల్లెలో వీరందరిని ప్రాణ స్నేహితులు (Best Friends) గా చెప్పుకొనే వారు. ఎంత ప్రాణ స్నేహ మైన డబ్బు విషయానికి వస్తే స్నేహితుల మధ్య చిచ్చు రేపుతుందని శ్రీనివాస్ ఘటన రుజువు చేసింది.



    గంగారాం (Gangaram) దగ్గర కొంత కాలం క్రితం నగదును అప్పు గా తీసుకున్నాడు శ్రీనివాసులు. ఆ అప్పును పలు ధపాలుగా గంగారాంకు ఇస్తూ వచ్చాడు శ్రీనివాస్. చివరగా  250 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. స్నేహితుడే కదా కొంతకాలం తరువాత ఆ నగదును ఇద్దాంలే అనుకున్నాడు శ్రీనివాస్. కానీ గంగారాం మాత్రం  250 రూపాయలను తరచూ అడిగే వాడు. దింతోఇద్దరి మధ్య గొడవలు రావడం మొదలైయ్యాయి. బాకీ డబ్బులు ఇవ్వలేదని శ్రీనివాసులు  స్నేహితులు గంగారాం, ఖ‌దీర్‌, మరొ వ్య‌క్తి మొదట దాడి చేసి, మృతి చెందాక పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టారు.

    ఇదీ చదవండి : జనసేనతో పొత్తు విషయంలో చంద్రబాబు ఏం చేయబోతున్నారు..? ఆ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందా..?

    స్నేహితుల‌తో క‌లిసి క‌ల‌మ‌ల్ల‌-ఆర్టీపీపీ మ‌ధ్య‌లోని ఉప్పు వంక స‌మీపంలో మ‌ద్యం సేవించిన సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. శ్రీ‌నివాసులు సోద‌రుడు ఫిర్యాదు మేర‌కు ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇందులో అనుమాతులైన స్నేహితుల‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.  క‌ల‌మ‌ల్ల పంచాయ‌తీలోని కృష్ణ న‌గ‌ర్‌కు చెందిన ఈ ముగ్గురు స్నేహితులు ఇలా దారుణానికి ఒడిగ‌ట్ట‌డంపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. స్నేహితుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ‌నివాసులు మృత‌దేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా అసుప‌త్రికి పోస్టుమార్టంకు త‌ర‌లించారు. ఈకేసు వెనుక బాకీ వ్య‌వ‌హార‌మా లేక ఇంకా ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో క‌ల‌మ‌ల్ల పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Guntur

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు