హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Road Accident: పెళ్లింట విషాదం.. వ్యాన్ నుంచి జారిపడి నలుగురు మృతి...

Road Accident: పెళ్లింట విషాదం.. వ్యాన్ నుంచి జారిపడి నలుగురు మృతి...

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం

Tragedy: కొద్దిసేపట్లో వారంతా కల్యాణవేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంది. ఇంతలోనే ఊహించని విషాదం ఆ కుటుంబాన్ని కమ్మేసింది.

ఆ ఇంట్లో కాసేపట్లో పెళ్లిభాజాలు మోగబోతున్నాయి. అమ్మాయిని పెళ్లికూతుర్ని చేసి వరుడు ఇంటికి బయలుదేరారు. కొద్దిసేపట్లో కల్యాణవేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంది. ఇంతలోనే ఊహించని విషాదం ఆ కుటుంబాన్ని కమ్మేసింది. పెళ్లిసందడిని చూసి మృత్యువుకు కన్నుకుట్టిందో ఏమో నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. పెళ్లి వారితో వెళ్తున్న వాహనం నుంచి జారిపడి నలురుగు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశ జిల్లా తుర్లపాడు-కొనకమిట్ల మండలాల సరిహద్దు గ్రామమైన కలుజువ్వలపాడు వద్ద హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం నుంచి జారిపడి నలుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. త్రిపురాంతకం మండలం సోమేపల్లి నుంచి వధువును తీసుకొని పొదిలిలోని అక్కచెరువుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వాహనం వెనుకున్న డోర్ తెరుచుకోవడంతో వెనుక కూర్చున్నవారు రోడ్డుపై పడిపోయారు. వీరిలో ఇద్దరు అక్కడిక్కకడే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డవారిని మార్కాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు శ్రీను, అనిల్, సుబ్బారావు, కార్తీక్ గా గుర్తించారు. ఈ ప్రమాదం పెళ్లింటితో పాటు మృతుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

వధువు వాహనం ముందుభాగంలో కూర్చోవడం ఆమె ప్రమాదం నుంచి తప్పించుకుంది. బుధవారం ఉదయం 11గంటలకు వరుడి స్వగ్రామంలో వివాహం జరగాల్సి ఉంది. ఉదయం వధువు ఇంటి నుంచి బయలుదేరగా... ఇంతలోనే ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కుటుమంతా విషాదంలో మునిగిపోయింది. ఘటనాస్థలిలో వధువు విలపిస్తున్న తీరు అందర్నీ కలచివేసింది. ప్రమాదం జరగడంతో పెళ్లిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

ఇది చదవండి: ప్రియుడి మోజులో భార్య.. భర్త అడ్డుగా ఉన్నాడని మేనల్లుడితో కలిసి మర్డర్ స్కెచ్..


ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం శ్రీకాకుళం ఇలాంటి ప్రమాదమే జరిగింది. పలాస మండలం సమ్మాదేవి వద్ద జాతీయ రహదారిపై ఏఆర్ కానిస్టేబుళ్లు ప్రయాణిస్తున్న బొలేరో వాహనం ప్రమాదానికి గురైంది. ఘటనలో నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మందస వద్ద ఓ ఆర్మీ జవాన్ మృతదేహానికి ఎస్కార్ట్ గా వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొని.. తిరిగి శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఇది చదవండి: ఆస్తిలో వాటా అడిగిన కొడుకు.. ఆ తండ్రి అంత పనిచేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు..!


తెలంగాణలోని నల్గొండ జిల్లా... మిర్యాల గూడ హైవేలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే ఇద్దరు చనిపోగా... మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. గాయపడిన మరికొందరికి మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. గాయపడిన వారి సంఖ్య 10 మంది దాకా ఉంది. ప్రమాదం జరిగినప్పుడు సీట్ల మధ్యలో ప్రయాణికులు ఇరుక్కుపోయారు. వారిని పోలీసులు అతి కష్టమ్మీద బయటకు తీసుకొచ్చారు. మృతులను మల్లికార్జున్, నాగేశ్వరరావు, జయరావుగా గుర్తించారు. ఈ బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్ వస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, Crime news, Prakasham dist, Road accident

ఉత్తమ కథలు