హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం.. గేదె అడ్డొచ్చి నలుగురు మృతి

Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం.. గేదె అడ్డొచ్చి నలుగురు మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Road Accident: రోడ్డుపై పడి ఉన్న గేదె కళేబరం ప్రమాదానికి కారణమైంది. చీకట్లో కళేబరం కనిపించకపోవడంతో ఈ ఘోరం జరిగింది.

పెళ్లిళ్ల సీజన్.. (Marriage Season) అర్ధరాత్రి ముహుర్తాలు కావడంతో ఇటీవల పెళ్లివారి వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో గత కొన్నిరోజులుగా రోడ్డు ప్రమాదాలు (Road Accidents) తరచూ చోటు చేసుకుంటున్నాయి. ప్రకాశం జిల్లా(Prakasham District)లో గత వారంలో పెళ్లికి వెళ్తున్న వాహనం నుంచి జారిపడి నలుగురు మృతి చెందగా.. తాజాగా అదే జిల్లాలో ఓ ఫంక్షన్ కు వెళ్లి వస్తుండగా ఆటో బోల్తాపడి నలురుగు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే... ప్రకాశ జిల్లా తుర్లపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ వద్ద ఒంగోలు-కర్నూలు రోడ్డులో ఘోరప్రమాదం జరిగింది. రోడ్డుపై పడి ఉన్న గేదె కళేబరంపై ఆటో ఎక్కడంతో బోల్తాపడింది. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు ఆటోలో మొత్తం 14 మంది ఉన్నారు. వీరంతా బెస్తవారిపేట మండలం కొత్తపల్లిలో ఓ ఫంక్షన్ కు వెళ్లి వస్తున్నట్లు తెలుస్తోంది. మృతులు ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్ రెడ్డి, పొట్లపాటి సారమ్మ, ఇత్తడి లింగమ్మ, గొంగటి మార్తమ్మగా గుర్తించారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహయాక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని మార్కాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి సమయంలో గేదెను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో అది మృతి చెందగా.. మృతకళేబరం మరో నలుగురు ప్రాణాలు తీసింది. ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది.

ఇది చదవండి:పెళ్లైన మూడు రోజులకే గర్భవతి.. తమ్ముడితో రెండో పెళ్లిచేసిన ప్రియుడు.. వాళ్ల స్కెచ్ కు అతడి మైండ్ బ్లాంక్ అయింది..



ఇటీవల ప్రకాశ జిల్లా తుర్లపాడు-కొనకమిట్ల మండలాల సరిహద్దు గ్రామమైన కలుజువ్వలపాడు వద్ద హైవే పై ఘోరప్రమాదం జరిగింది. బొలెరో వాహనం నుంచి జారిపడి నలుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. త్రిపురాంతకం మండలం సోమేపల్లి నుంచి వధువును తీసుకొని పొదిలిలోని అక్కచెరువుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వాహనం వెనుకున్న డోర్ తెరుచుకోవడంతో వెనుక కూర్చున్నవారు రోడ్డుపై పడిపోయారు. వీరిలో ఇద్దరు అక్కడిక్కకడే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయారు. మృతులు శ్రీను, అనిల్, సుబ్బారావు, కార్తీక్ గా గుర్తించారు.

ఇది చదవండి: నిన్న పెళ్లి వద్దంది... 24గంటలు గడిచేసరికి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది..


ఈ ప్రమాదం పెళ్లింటితో పాటు మృతుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. వధువు వాహనం ముందుభాగంలో కూర్చోవడం ఆమె ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈనెల 25న ఉదయం 11గంటలకు వరుడి స్వగ్రామంలో వివాహం జరగాల్సి ఉంది. ఉదయం వధువు ఇంటి నుంచి బయలుదేరగా... ఇంతలోనే ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కుటుమంతా విషాదంలో మునిగిపోయింది. ఘటనాస్థలిలో వధువు విలపిస్తున్న తీరు అందర్నీ కలచివేసింది. ఐతే యువతిని ఓదార్చిన బంధువులు.. సమీపంలోని ఓ గుడిలో నిరాడంబరంగా వివాహం జరిపించారు. అంతుకుముందు శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం నలుగురి కానిస్టేబుళ్ల ప్రాణాలను బలిగొంది. ఓ ఆర్మీజవాన్ కు నివాళులర్పించి తిరిగిస్తున్న పోలీస్ వాహనం ప్రమాదానికి గురికావడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందడం పోలీస్ శాఖలో విషాదాన్ని నింపింది.

First published:

Tags: Andhra Pradesh, Prakasham dist, Road accident

ఉత్తమ కథలు