హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Road Accident: చివరి క్షణం వరకు వీడని స్నేహబంధం.. ఆగివున్న లారీని ఢీ కొట్టిన కారు.. నలుగురు స్నేహితుల మృతి

Road Accident: చివరి క్షణం వరకు వీడని స్నేహబంధం.. ఆగివున్న లారీని ఢీ కొట్టిన కారు.. నలుగురు స్నేహితుల మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Road Accident: ఆంధ్రప్రదేశ్ ను రోడ్డు ప్రమాదాలు భయపెడుతున్నాయి. ఇటీవల జరిగిన ప్రమాదానికి అతి వేగం.. నిర్లక్ష్యమే కారణమవుతున్నాయి. తాజా ఘటన ఓ నలుగురు ప్రాణ స్నేహితులను బలితీసుకుంది. మృత్యువు సైతం ఆ స్నేహబంధాన్ని వీడదీయలేకపోయింది.. అంతా కలిసే ఒకేసారి తుది శ్వాస విడిచారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Road Accident: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రోడ్డు ప్రమాదాల సంఖ్య  నిత్యం పెరుగుతోంది. రోజు ఎక్కడో ఒకచోట ఈ ప్రమాదల (Road Accidents) గురించి వినాల్సి వస్తోంది. నిత్యం ప్రమాదాలతో రహదారులు రక్తమోడుతున్నాయి. కొన్ని ప్రమాదాలకు.. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణమవుతోంది. రోడ్లన్నీ గుంతలమయం అవ్వడంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణల సంగతి ఎలా ఉన్నా.. అతి వేగమే (Speed kills) ఎక్కవ ప్రమాదాలకు కారణమన్నది బహిరంగ రహస్యం.. దానికి తోడు ట్రాఫిక్ రూల్స్ (Traffic Rules) పాటించకపోవడం కూడా ఈ ప్రమాదాలకు కారణమవుతోంది. వరుస ప్రమాదాలు జరుగుతున్న మనుషులు మారడం లేదు. దీంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా (Guntur District) లో రహదారి రక్తమోడింది. రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని.. వేగంగా వెళుతున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది ఈ ఘటనలో నలుగురు స్నేహితులు మృత్యువాత పడ్డారు..

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా (Krishna District) విజయవాడ (Vijayawada) వన్‌టౌన్‌ ఫిష్‌ మార్కెట్‌ బురదవారి వీధికి చెందిన 26 ఏళ్ల చుక్కా గౌతమ్‌రెడ్డి, కాకినాడ నగరంలోని జగన్నాథపురం కాలనీకి చెందిన 25 ఏళ్ల వాడపల్లి అనంత పద్మనాభ చైతన్య పవన్‌, విశాఖ జిల్లా పెందుర్తి మండలం దేశపాత్రునిపాలెంకు చెందిన 25 ఏళ్ల పిరిధి సౌమిక.. వీరంతా విశాఖలోని వరాహ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌ కళాశాలలో 2014–19 బ్యాచ్‌ లోఆర్కిటెక్చర్‌ చదివారు.

అప్పటి నుంచి వారంతా ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. నిత్యం ఒకరి ఒకరు తోడు అన్నట్టు ఎక్కడకు వెళ్లినా కలిసే వెళ్తారు.. తాజాగా వీరు ముగ్గురూ విశాఖకు చెందిన తమ స్నేహితురాలు పావనితో కలిసి సోమవారం మధ్యాహ్నం విజయవాడ నుంచి అరుణాచలంకు కారులో బయలుదేరారు. అయితే వారు ప్రయాణిస్తున్న కారు సాయంత్రం 5 గంటల సమయంలో.. అతి వేగంగా వెళ్తోంది. అదే సమయంలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం సమీపంలో టైరు పంక్చర్‌ కావడంతో జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది.

ఇదీ చదవండి : ఉప్పుతో గ్లోబుపై భారత మాత చిత్రం.. ఉప్పొంగిన దేశ భక్తి

కారులో ప్రయాణిస్తున్న గౌతమ్‌రెడ్డి, అనంత పద్మనాభ చైతన్య పవన్, సౌమిక అక్కడికక్కడే మృతి చెందారు. అయితే వీరి ప్రాణ స్నేహితు రాలైన ఆమె వీరి మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది.. కాపాడండి కాపాడండి.. తన స్నేహితులను బతికించండని రోధించింది. తీవ్ర గాయాలపాలై కొనఊపిరితో ఉన్న పావనిని 108లో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు.

ఇదీ చదవండి: నేటి నుంచి వెంకటేశ్వర స్వామి వైభవోత్సావాలు.. బ్రహ్మోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు

ఆమె కళ్ల ముందు స్నేహితులు మరణాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. తీవ్ర మనస్థాపం చెంది ఆ భాదతోనే ఆమె మార్గంమధ్యలో మృతి చెందింది. వీరిలో చైతన్య పవన్, సౌమిక వైజాగ్‌లో ఉద్యోగం చేస్తున్నారని, గౌతమ్‌రెడ్డి ఇంటినుంచే ప్రాజెక్టులు చేస్తూ ఉంటారని స్నేహితులు చెబుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Crime news, Guntur

ఉత్తమ కథలు