Home /News /andhra-pradesh /

GUNTUR FATHER RAPED DAUGHTER IN FRONT OF HIS LOVER AND CAPTURED ON MOBILE IN PRAKASHAM DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

భార్య ఉండగానే ఇద్దరితో ఎఫైర్... ప్రియురాలు వీడియో తీస్తుండగా కూతురిపై ఘోరం... వీడికి ఏ శిక్ష వేయాలి..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆ ప్రబుద్ధుడు. భార్య ఉండగానే ఇద్దరు మహిళలతో సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. వయసుకొచ్చిన కూతుర్ని తన ప్రియురాళ్ల ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అంతేకాదు ఆ ఘోరాన్ని వారితో వీడియోలు తీయించి పైశాచికానందాన్ని పొందాడు.

  తండ్రి అంటే కన్నకూతుర్ని కంటికి రెప్పలా కాపాడాలి. కూతురు ఎదుగుతున్నకొద్దీ ఆమెకు రక్షణగా ఉండాలి. ఎదిగిన కూతురికి మంచి అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లిచేసి పంపాలి. కానీ ఓ తండ్రి మాత్రం.. ఆ పదానికే మాయని మచ్చ తెచ్చాడు. చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఆ ప్రబుద్ధుడు. భార్య ఉండగానే ఇద్దరు మహిళలతో సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. వయసుకొచ్చిన కూతుర్ని తన ప్రియురాళ్ల ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అంతేకాదు ఆ ఘోరాన్ని వారితో వీడియోలు తీయించి పైశాచికానందాన్ని పొందాడు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లా (Prakasham District) మార్కాపురంకు చెందిన వ్యక్తి కడప జిల్లా (Kadapa District) లోని ఓ ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. తాను నివశించే ప్రాంతానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం (Extramarital Affair) పెట్టుకున్నాడు. ఈ ఏడాది జూలైలో తన 15 ఏళ్ల కుమార్తెను మార్కాపురం నుంచి కడప జిల్లా తీసుకెళ్లాడు.

  బాలికను ప్రియురాలి ఇంటికి తీసుకెళ్లి ఆమెతో కలిసి బలవంతంగా కూతురుకి మద్యం తాగించాడు. ఆ తర్వాత కూతురిపైనే అత్యాచారం చేస్తూ.. ఆ ఘోరాన్ని ప్రియురాలితో వీడియో తీయించాడు. కొన్నిరోజుల తర్వాత బాలికను ప్రకాశం జిల్లాలో తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మరోమహిళ ఇంటికి తీసుకెళ్లి నెలన్నర అక్కడే ఉంచాడు. అక్కడ కూడా ఇదే ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదరించారు.

  ఇది చదవండి: నెలల తరబడి ఇంటికి రాని భర్త.. అనుమానం వచ్చి ఆరాతీయగా షాకింగ్ నిజం..


  బాలిక తల్లి ఫోన్ చేసి అడగ్గా తన దగ్గరే ఉందని చెప్తూ వచ్చాడు. ఐతే గత నెలలో బంధువు చనిపోతే ఆ కార్యక్రమానికి కూతుర్ని తీసుకెళ్లాడు ఆ కీచక తండ్రి. అక్కడ బాలిక ప్రవర్తనలో మార్పులు రావడం, భయంగా కనిపించడంతో తల్లి ఆరా తీసింది. దీంతో బోరుమన్న బాలిక జరిగిన ఘోరాన్ని వివరించింది. భర్త వివాహేతర సంబంధాల గురించి అప్పటికే తెలుసుకున్న ఆమె కూతురిపైనా అత్యాచారం చేశాడని తెలియడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అధుపులోకి తీసుకున్నారు.

  ఇది చదవండి: ఈ నీచుడ్ని ఏం చేసినా తప్పులేదు..! వద్దు బాబాయ్ తప్పు అన్నా వినలేదు.. కూతురులాంటి బాలికపై..,


  ఇటీవల కృష్ణాజిల్లా విజయవాడలోనూ ఇలాంటి ఘోరమే జరిగింది. విజయవాడ (Vijayawada) నగరంలో ఈ దారుణం జరిగింది. కన్నకుతురుపైనే అత్యాచారం చేసిన కసాయి తండ్రి పేరు చినబాబు.. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ కామాంధుడు పలుమార్లు చిన్నారిపై లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. అయితే చిన్నారికి ఈ మధ్య నొప్పి పెరగడం.. తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

  ఇది చదవండి: జల్సాలకు బానిసైతే జీవితం ఇలాగే తయారవుతుంది.. ఎలా ఉండాల్సిన వాడు.. ఎలా అయ్యాడు..!


  చినబాబుది ప్రేమ వివాహం కూడా.. తమ ప్రేమకు కానుకగా పుట్టిను కూతురిని ఎంత ఆప్యాయంగా చూసుకోవాలి.. కానీ ఇలాంటి పాడు పని ఎలా చేయడగలిగాడు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీ, వికాస్ ఇంజనీరింగ్ కాలేజీల్లో పిడి గా పనిచేస్తున్న చినబాబు దారుణం వెలుగులోకి రావడంతో.. భర్యపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దిశ పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Crime news, Father, Minor girl raped, Prakasham dist

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు