Home /News /andhra-pradesh /

GUNTUR FATHER KIDNAPPED OWN SON AND DEMANDED MONEY FROM HIS WIFE IN PRAKASHAM DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Andhra Pradesh: అసలు వీడు తండ్రేనా...? వ్యసనాలకు బానిసై..కన్నకొడుకును కిడ్నాప్ చేసి..,

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తండ్రి అంటే.. కన్నబిడ్డలకు అన్నీ తానే చూసుకునేవాడు. వారిని కంటికి రెప్పలా కాపాడుతూ.. నిత్యం వారికి రక్షణగా నిలబడతాడు. కానీ...

    తండ్రి అంటే.. కన్నబిడ్డలకు అన్నీ తానే చూసుకునేవాడు. వారిని కంటికి రెప్పలా కాపాడుతూ.. నిత్యం వారికి రక్షణగా నిలబడతాడు. పిల్లలను ఉన్నత స్థాయికి చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాడు. కానీ ఓ తండ్రి మాత్రం ఆ పదానికే మచ్చతెచ్చేలా ప్రవర్తించాడు. వ్యసనాలు, జల్సాలకు బానిసై కన్నబిడ్డను కిడ్నాప్ చేసి భార్యను డబ్బులు డిమాండ్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెరువుకొమ్ముపాలెంకు చెందిన పల్నాటి రామకృష్ణారెడ్డికి అదే గ్రామానికి చెందిన ఉమ అనే అమ్మాయితో ఐదేళ్ల క్రితం పెళ్లైంది. మూడేళ్ల క్రితం వీరికి కుమారుడు జన్మించాడు. ఉన్నత చదువులు చదవిన రామకృష్ణారెడ్డి హైదరాబాద్ లోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఐతే కరోనా లాక్ డౌన్ కారణంగా ఏడాదిగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జూదం, మద్యంతో పాటు ఇతర చెడు వ్యసనాలకు బానిసయ్యాడు.

    వచ్చిడబ్బంతా జూదంలో పెట్టడమే కాకుండా భారీగా అప్పులు చేశాడు. ఇలా ఏకంగా రూ.20 లక్షలు అప్పులు చేశాడు. అప్పులిచ్చిన వారు తిరిగి చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేయడంతో డబ్బులివ్వాలని కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చాడు. వాళ్లు డబ్బులిచ్చేందుకు ససేమిరా అనడంతో చేసేదేం లేక కన్న కొడుకునే కిడ్నాప్ చేశాడు. గత నెల 28న బాలుడ్ని తీసుకొని వెళ్లిపోయిన రామకృష్ణారెడ్డి కందుకూరులోని ఓ లాడ్జిలో దిగాడు. అక్కడ మద్యం తాగి రాత్రి భార్యకు ఫోన్ చేశాడు. కొడుకును కిడ్నాప్ చేశానని.. రూ.20 లక్షలు ఇవ్వకుంటే బాలుడ్ని చంపి తానూ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.

    ఇది చదవండి: ప్రియుడితో భార్య రాసలీలలు... చాటుగా గమనించిన భర్త… ఆ మహానటి మామూలు ట్విస్ట్ ఇవ్వలేదుగా..!


    దీంతో అప్రమత్తమైన ఆమె వెంటనే పొన్నలూరు పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ విషయం జిల్లా ఏస్పీ మల్లికా గార్గ్ కు తెలియడంతో ఆమె జిల్లా వ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేశారు. రామకృష్ణారెడ్డి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడు ఉన్న లాడ్జిని గుర్తించారు. వెంటనే లాడ్జికి వెళ్లి అతడ్ని చాకచక్యంగా పట్టుకున్నారు. పిల్లాడ్ని తిరిగి తల్లికి అప్పగించి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. చెడు వ్యసనాలు మనిషిని ఎంతవరకైనా దిగజారుస్తాయనడానికి ఈ ఘటన ఒక సరైన ఉదాహరణ. రామకృష్ణారెడ్డి తాను అప్పుల పాలవడమే కాకుండా కన్నకొడుకుని కూడా చంపడానికి సిద్ధమవడంపై స్థానికులు మండిపడుతున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Father, Kidnap

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు