హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

కోడలిపై కన్నేసిన మామ.. ఇద్దరు అత్తలు అదే టైప్.. చివరికి..!

కోడలిపై కన్నేసిన మామ.. ఇద్దరు అత్తలు అదే టైప్.. చివరికి..!

గుంటూరు జిల్లాలో కోడలిపై మామ లైంగిక వేధింపులు

గుంటూరు జిల్లాలో కోడలిపై మామ లైంగిక వేధింపులు

కోడలిని మామ కన్నకూతురిలా చూసుకోవాలి. ఆమె పట్ల బాధ్యతగా ఉండాలి. కానీ ఓ మామ.. మాత్రం కూతుర్ని కామంతో చూశాడు. ఆమెకు కళ్లు లేవని తెలిసి జాలి చూపాల్సింది పోయి మృగంలా ప్రవర్తించాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Gangadhar, News18, Guntur

కోడలిని మామ కన్నకూతురిలా చూసుకోవాలి. ఆమె పట్ల బాధ్యతగా ఉండాలి. కానీ ఓ మామ.. మాత్రం కూతుర్ని కామంతో చూశాడు. ఆమెకు కళ్లు లేవని తెలిసి జాలి చూపాల్సింది పోయి మృగంలా ప్రవర్తించాడు. ఈ ఘోరం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో చోటు చేసుకుంది. వివరాలోకి వెళితే.., ప్రత్తిపాడు మండలంలోని ఓ చిన్న పల్లెటూరుకు చెందిన మహిళ అంధురాలు. ఆమెకు 13 ఏళ్ళ క్రితం ఆ గ్రామానికి చెందిన ఎలక్ర్టికల్ మెకానిక్ తో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు. భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె మామ వచ్చి బాధిత మహిళని లైంగికంగా వేధించేవాడు. అదే విషయం తన భర్త కు చెప్పగా మామని మందలించాడు.

అప్పటి నుండి అదే వీధిలో వేరొక ఇంటికి దుకాణం మార్చిన మామ అతని ఇద్దరు భార్యలు నిత్యం బాధితురాలిని అనేక ఇబ్బందులకు గురిచేసేవారు. సూటి పోటి మాటలతో ఆ అభాగ్యురాలి పై నిందలు మోపేవారు. వారి వేధింపులు తాళ లేక పురుగుల మందు త్రాగి ఆత్మహత్యకు యత్నించింది.

ఇది చదవండి: డ్యూటీ విషయంలో గొడవ.. పై అధికారిని దారుణంగా..!

అత్త మామల వేధింపులు తాళలేక ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని ఆమె తెలియజేశారు. తన భర్త పై వేరే వ్యక్తులతో దాడి చేపించి తన కోరిక తీర్చకుంటే చంపేస్తామని కేసు వాపసు తీసుకో మంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇక లాభం లేదనుకున్న ఆమె తన భర్తతో కలిసి సోమవారం స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పి ఆరీఫ్ హఫీజ్ కు ఫిర్యాదు చేశారు.పూర్తి వివరాలు తెలుసుకున్న ఎస్పీ త్వరిత గతిన విచారణ జరిపి బాధితురాలికి సత్వరం న్యాయం చేయమని ఆదేశించారు.

First published:

Tags: Andhra Pradesh, Guntur, Local News

ఉత్తమ కథలు