Home /News /andhra-pradesh /

GUNTUR FATHER IN LAW AND HUSBAND ATTACK ON WOMEN AFTER HE HAVING EXTRAMARITAL AFFAIR IN PALANADU DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Affair: సీక్రెట్ గా చిన్నింట్లో సెటిలయిన భర్త.., భార్యకు విషయం తెలియడంతో సీన్ రివర్స్..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

వివాహేతర సంబంధాల (Extra marital Affairs) మోజులో కట్టుకున్న వారినే నిర్లక్ష్యం చేస్తున్నారు కొందరు మగాళ్లు. అంతటితో ఆగకుండా ఇదేమని ప్రశ్నించినందుకు దాడులకు సైతం తెగబడుతున్నారు.

    సమాజంలో వివాహేతర సంబంధాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పక్కవారిపై మోజుతో అగ్నిసాక్షిగా మనువాడిన వారినే నిర్లక్ష్యం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఇదేమని ప్రశ్నిస్తే అయినవారిపైనే దాడులకు దిగుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పల్నాడు జిల్లా (Palanadu District) లో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను తండ్రితో కలిసి దాడిచేయడమే కాకుండా.., విషయం తెలుసుకుని వచ్చిన భార్య బంధువులపైనా భర్త దాడి చేసిన ఘటన అచ్చంపేట మండల పరిధిలోని క్రోసూరు నాలుగు రోడ్ల సెంటర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. క్రోసూరు నాలుగు రోడ్ల సెంటర్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ హసన్‌ తన కుమారుడు జానీబాషాకు నాలుగేళ్ల క్రితం మేనకోడలు షేక్‌ హసీనాను ఇచ్చి వివాహం చేశారు. రెండేళ్ల పాటు వీరి కాపురం సాఫీగా సాగింది. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు.

    ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో మనస్తాపం చెందిన హసీనా పుట్టింకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఆర్‌ఎంపీగా పనిచేస్తున్న భర్త జానీబాషా హైదరాబాద్‌లో మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. కొంతకాలంగా ఆమెతో సహజీవనం సాగిస్తున్నాడు. ఈ విషయం హసీనా తల్లిదండ్రులకు తెలియడంతో వారు తమ కుమార్తెను వెంటబెట్టుకుని అల్లుడి ఇంటికి చేరుకున్నారు. కోడలు, వారి తల్లిదండ్రులను చూసిన మామ హసన్.. ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. దీంతో ఏమీ పాలుపోని స్థితిలో హసీనా అచ్చంపేట పోలీసులను ఆశ్రయించింది. భర్తపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వారు దిశ చట్టం కింద కేసు నమోదు చేసి అత్తమామలను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

    ఇది చదవండి: పెద్దల మాటకు తల వంచడమే ఆమె చేసిన పాపం.. నెల్లూరులో రెచ్చిపోయిన ప్రేమోన్మాది


    ఈ క్రమంలోనే హైదరాబాద్‌ నుంచి వచ్చిన జానీబాషా.. ఇంట్లో ఉన్న భార్యపై తండ్రి సహాయంతో దాడికి పాల్పడ్డాడు. కొడుకు చేసిన తప్పును సరిదిద్దాల్సిన ఆ తండ్రి.., తప్పును తప్పు అని చెప్పకుండా కోడలిపై దాడికి పాల్పడటం విస్తుగొలిపే అంశం. ఈ విషయం తెలుసుకున్న హసీనా కుటుంబ సభ్యులు కోపంతో రగిలిపోయారు. అల్లుడు జానీబాషా, అతడి తండ్రి హసన్‌పై కర్రలతో దాడి చేశారు. ఈ సంఘటనలపై ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సీహెచ్‌ మణికృష్ణ తెలిపారు.

    ఇది చదవండి: ప్రేమించానంటే హద్దులు దాటింది.. కానీ తండ్రికే అలాంటి ఫోటోలు పంపాడు..!


    ఇటీలవ కోనసీమ జిల్లాలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ ప్రభుద్ధుడు భార్య ఊరెళ్లడంతో ఏకంగా ప్రియురాలికి ఏకంగా ఇంటికే తెచ్చిపెట్టుకున్నాడు. విషయాన్ని గమనించిన అతని తల్లి కొడుకుపై ప్రేమ చూపించకుండా న్యాయం వైపు నిలబడింది. కోడలికి విషయం చెప్పి ఆమెతో కలిసి అతడికి బడితపూజ చేసి అందరి మన్ననలు పొందింది. అయితే ఈ ఘటనలో కొడుక్కి బుద్ధి చెప్పాల్సిన తండ్రి., అతడి సాయంతో మేనకోడలిపైనే దాడి చేయడం సిగ్గుచేటు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Extramarital affairs, Guntur

    తదుపరి వార్తలు