Home /News /andhra-pradesh /

GUNTUR FATHER ARRESTED FOR RAPE ON FIVERS OLD DAUGHTER IN PALANADU DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

AP Crime News: వీడు మనిషికాదు మృగం.. ఆ ఆలోచన వచ్చినందుకే ఉరితీయాలి..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Father and Daughter: తల్లి పిల్లలకు జన్మనిస్తే.. తండ్రి అన్నీ తానే పెంచి పెద్దచేస్తాడు. ముఖ్యంగా కూతురి విషయంలో తండ్రి ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తాడు. చిన్నప్పటి నుంచి పెళ్లయ్యేవరుకు అన్నింట్లోనూ తోడుంటాడు. కానీ ఓ తండ్రి కన్నకూతురిపట్ల కామపిశాచిలా మారాడు.

ఇంకా చదవండి ...
    Anna Raghu, News18, Amaravati

    తల్లి పిల్లలకు జన్మనిస్తే.. తండ్రి అన్నీ తానే పెంచి పెద్దచేస్తాడు. ముఖ్యంగా కూతురి విషయంలో తండ్రి ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తాడు. చిన్నప్పటి నుంచి పెళ్లయ్యేవరుకు అన్నింట్లోనూ తోడుంటాడు. కానీ ఓ తండ్రి కన్నకూతురిపట్ల కామపిశాచిలా మారాడు. అభం సుభం తెలియని చిన్నారిపై కన్నేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు పిల్లలు. పాప, బాబు. పాపకు ఐదు సంవత్సరాలు. భర్త బొప్పూడిలో ఉంటూ చిలకలూరిపేట పట్టణం కళామందిర్ సెంటర్ వద్ద ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఐదేళ్ల పాప చిలకలూరిపేటలోని ఓ స్కూల్లో చదువుకుంటోంది. ఐతే కొంతకాలంగా స్కూల్ కు వెళ్లేటప్పుడు, స్నానం చేసే సమయంలో నొప్పిగా ఉంటోందని ఏడుస్తుండేది. నాన్న పక్కన పడుకోబెట్టొద్దని తల్లికి చెప్తుండేది.

    తొలుత పాప చెప్పిన మాటలు పెద్దగా పట్టించుకోని తల్లి.. ఆ తర్వాత సీరియస్ గా తీసుకుంది. భర్త ఏమైనా చేస్తున్నాడా అనే అనుమానంతో అతడిపై నిఘా ఉంచింది. ఈ క్రమంలో గత ఆదివారం రాత్రి భోజనం చేసి నలుగురు పడుకున్నారు. అంతలోనే భర్త తను బయటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్య నిద్రపోతున్నట్లు నటిస్తూ భర్త చేసే పనులు గమనించింది. తాను నిద్ర పోతున్నానా..? లేదా..? అని సెల్ ఫోన్ లైట్ వేసి చూశాడు. నిద్ర పోతున్నానని గుర్తించి వెంటనే కుమార్తె పక్కన పడుకుని సెల్ ఫోన్ ఆన్ చేశాడు. అందులో అశ్లీల వీడియోలు చూస్తూ కూతురిపై అఘాయిత్యనికి పాల్పడ్డాడు.

    ఇది చదవండి: మునిగిపోయిందనుకొని నీళ్లలో గాలిస్తుంటే.. కూల్ గా బస్సుదిగింది..


    గమనించిన భార్య వెంటనే భర్తని పట్టుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. అనంతపం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కన్నకూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన ఇలాంటి వాడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు పోలీసులను డిమాండ్ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.

    ఇది చదవండి: సినిమా డెరెక్టర్లు కూడా వీళ్ల తెలివి ముందు దిగదుడుపే.! ఏం స్కెచ్ వేశార్రా నాయనా..?


    ఇదిలా ఉంటే గతంలో తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని ఓ గ్రామంలో తండ్రి ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నకూతురితో పాటు బంధువుల పిల్లపైనా అకృత్యాలకు పాల్పడటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోనూ ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. ఇలాంటి ఘటనల్లో శిక్షించేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తెచ్చినా మృగాళ్లు మాత్రం మారడం లేదు. రక్తం పంచుకొని పుట్టిన ఆడబిడ్డల పట్ల ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని ఉరితీసినా తప్పులేదని మహిళా సంఘాలంటున్నాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Guntur

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు