హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ప్రభుత్వానికి రైతులకు మధ్య రోడ్డు పంచాయతీ..!

ప్రభుత్వానికి రైతులకు మధ్య రోడ్డు పంచాయతీ..!

X
భూ

భూ సేకరణ వివాదంలో చీరాల-నకరికల్లు రోడ్డు

ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టినప్పుడు భూసేకరణ అనివార్యం అవుతుంది. అలాంటప్పుడు భూ యజమానులతో చర్చించి అనంతరం మార్కెట్ ధర చెల్లించి భూసేకరణ జరుపుతారు. అనంతరం రోడ్ల వంటి పనులు చేపడతారు. కాని ఓ రోడ్డు విషయంలో మాత్రం రైతులకు ప్రభుత్వానికి చెడింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Gangadhar, News18, Guntur

ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టినప్పుడు భూసేకరణ అనివార్యం అవుతుంది. అలాంటప్పుడు భూ యజమానులతో చర్చించి అనంతరం మార్కెట్ ధర చెల్లించి భూసేకరణ జరుపుతారు. అనంతరం రోడ్ల వంటి పనులు చేపడతారు. కాని ఓ రోడ్డు విషయంలో మాత్రం రైతులకు ప్రభుత్వానికి చెడింది. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చీరాల-నకరికల్లు హైవే కోసం విలువైన తమ భూములను ఇచ్చేదే లేదంటూ రైతులు తెగేసి చెప్పారు. చీరాల ఓడరేవు నుండి హైదరాబాద్ వరకు సాగే NH167A రహదారి నకరికల్లు వరకు కొత్తగా రహదారి వేసే క్రమంలో తమ భూములు కోల్పోతున్నామంటూ బాధిత రైతులు నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.., చీరాల ఓడరేవు నుండి నకరికల్లు, రూపెనగుంట్ల వరకు హైవే నిర్మాణం నిమిత్తం చిలకలూరిపేట, నరసరావుపేట మండలాలలోని దాదాపు 12 గ్రామాల్లో భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయణ తీసుకుందనీ, ప్రభుత్వం ప్రతిపాదించిన అలైన్మెంట్ వల్ల అనేకమంది రైతులు నష్టపోతున్న పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు.

ఇది చదవండి: ఏపీలో ఇదే అతిపెద్ద పార్క్.. ఎన్ని ఎకరాల్లో ఉందంటే..!

రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ భూసేకరణ చేయాలన్నా,ఎలాంటి ప్రతిపాదనలు చేయాలన్నా, ముందుగా సంబంధింత రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ల అభిప్రాయ సేకరణలో 80% ఒప్పందం ఉంటే మాత్రమే ఎలైన్మెంట్ చేసుకోవాలన్నారు. లేదంటే ఆ గ్రామాల్లో గ్రామ సభల్లో ఉన్నటువంటి రైతులు తమ అభిప్రాయాలను ప్రతిపాదనల రూపంలో పంపించినప్పుడు ప్రభుత్వం అలైన్మెంట్ మార్పులు చేర్పులు చేయాలని లేదంటే రద్దు చేయాలని తెలిపారు. ఇలా కాకుండా ఏకపక్షంగా వెళతాం అంటే మాత్రం సరైన పద్ధతి కాదని, రైతుల నుండి తీవ్రంగా నిరసనలు వ్యక్తం అవుతాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది చదవండి: తన వల్లే భార్యకు అలా జరిగిందని అంత పని చేశాడు

ఇలాంటి పరిస్థితులు తీసుకురావద్దంటు రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం రైతుల అనుమతి కావాలి అంటే గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రైతుల అనుమతి పొంది 80% మద్దతుతో పొందాలన్నారు. అలాంటివేవీ లేకుండా ప్రభుత్వం మొండివైఖరితో ఏకపక్షంగా వెళుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిర్ణయించిన ప్రతిపాదనను రైతులు ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో వెనక్కి తీసుకోవాలని, వెనక్కి తీసుకోని క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయేటువంటి కాలంలో రైతులు ఏ రకమైన బుద్ధి చెప్పాలో ఆ రకంగా చెబుతామని హెచ్చరించారు.

రాజకీయలకు అతీతంగా రైతులు అందరం కలిసి ఏకగ్రీవంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని కాదంటూ ఏకపక్ష ధోరణిలో ముందుకు వెళితే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం రాకపోకల అవసరాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది కానీ రైతుల ఇబ్బందులను పె డచెవిన పెట్టిందని వారు మండిపడ్డారు. ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి అంటూనే వ్యవసాయమే తమ ముందు ప్రధమ ప్రాధాన్యమంటూ చెబుతున్న ప్రభుత్వం రైతులకు అన్యాయం ఎలా చేస్తుందని వారు ప్రశ్నించారు. పట్టణాలకు మాస్టర్ ప్లాన్ లో భాగంగా 200 అడుగుల రోడ్డు వదిలారనీ ఆ భూమి నేష్నల్ హైవే అధా రిటీకి అప్పగించి అటువైపు నుండి బైపాస్ వేసుకోవాలని దీనితో తమకు న్యాయం జరగడమే గాక రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆర్ధిక భారం తప్పుతుందంటున్నారు రైతు సంఘం నేతలు.

First published:

Tags: Andhra Pradesh, Guntur, Local News

ఉత్తమ కథలు