Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
Crime News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో నకిలీ (Fake) వ్యవహారం సంచలనంగా మారింది.. నల్లకోట్లు కూడా నకిలీ మరక అంటింది. నకిలీ సర్టిఫికేట్ల (Fake Certificate) తో న్యాయవాదులుగా (Fake Lawyers ) చలామణి అవుతున్నవారి వ్యవహారం ఎట్టకేలకు గుట్టు రట్టు అయ్యింది. అయితే న్యాయం కోసం వాదించాల్సిన లాయర్లు దొంగ సర్టిఫికెట్ లతో లాయర్లుగా చలామణి అవుతున్నారు. హైకోర్ట్ (High Court) బార్ కౌన్సిల్ లో మొత్తం పదిహేను మందిని నకిలీలుగా గుర్తించడంతో ఒక్క సారిగా కలకలం రేపుతోంది. ఈ నకిలీ వ్యవహారాన్ని ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది.
ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ లో మొత్తం 15 మంది నకిలీలను బార్ కౌన్సిల్ గుర్తించగా.. వారిలో ఎనిమిది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి న్యాయవాదిగా పేరును ఉపసంహరించుకున్నారు. మిగిలిన ఏడుగురిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈనెల 11న బార్ కౌన్సిల్ కార్యదర్శి బి.పద్మలత గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చింతకాయల సీఎస్‌ఎన్ మూర్తి (తుని), డి.చాముండేశ్వరి (తెనాలి), సీడీ పురుషోత్తం (అనంతపురం), డి.రత్నకుమారి (ఏపీ హైకోర్టు ప్రాక్టీస్) బిక్కి నాగేశ్వరరావు (సత్తెనపల్లి), మాచర్ల వెంకటేశ్వరరావు (సత్తెనపల్లి), కొత్తూరి శ్రీనివాస్ వరప్రసాద్ (కాకినాడ) లపై కేసు నమోదు చేసారు. ధ్రువపత్రాల పరిశీలనలో భాగంగా వీరి విద్యార్హత పత్రాలు సరైనవో కావో తేల్చేందుకు సంబంధిత కళాశాలలు, యూనివర్సిటీలకు పంపగా అవి దొంగసర్టిఫికెట్ లని దొంగ సంతకాలు అని తేలిందని బార్ కౌన్సిల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ఇదీ చదవండి : మాట్లాడే దేవుడ్ని చూశారా..? ఈ సాయి బాబా ప్రవచనాలు కూడా చెబుతారు.. కావాలంటే మీరూ చూడండి
అసలు ఎలా గుర్తించారంటే.. హై కోర్ట్ బార్ కౌన్సిల్ న్యాయవాదిగా పేరు నమోదు సందర్భంగా.. ఆంధ్రా విశ్వవిద్యాలయం, బిహార్‌లోని బోధ్ గయ విశ్వవిద్యాలయం, అస్సాంలోని డిబ్రూగఢ్ వర్సిటీ, యూపీలోని ఒక విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌ఎం తదితర కోర్సులు చదివినట్లు వీరు బార్ కౌన్సిల్‌కు ధ్రువపత్రాలను అందజేశారు. వాటిని బార్ కౌన్సిల్ ఆయా విశ్వవిద్యాలయాలకు పంపగా వారెవరూ తమ దగ్గర చదవలేదని సమాధానం వచ్చింది. దింతో ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్న బార్ కౌన్సిల్ కార్యదర్శి బి.పద్మలత పోలీస్ లకు పిర్యాదు చేసారు.
ఇదీ చదవండి : వైసీపీకి ఆనం వీడ్కోలు చెబుతున్నారా..? ఆయన్ను వదిలించుకోవాలని పార్టీ ప్లాన్ చేసిందా..?
తుళ్లూరు డీఎస్పీ పోతురాజు మీడియా తో మాట్లాడుతూ 'నిందితులపై మోసం, ఫోర్జరీ, కుట్ర, నకిలీ పత్రాలు సృష్టించడం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. తాము కూడా విచారణ లో భాగంగా ఆయా విశ్వవిద్యాలయాలకు సర్టిఫికెట్లను పంపి వాటిని నిర్ధారించాలని వారు ఆయా విశ్వవిద్యాలయాల లో చదివిందీ లేనిదీ అధికారికంగా తెలియజేయాలని ఆయా విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లకు లేఖలు రాశామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP High Court, AP News, Gunturu