హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Extramarital Affair: కోడలితో వివేహాతర సంబంధం.. చివరికి అత్తను ఏం చేశాడంటే..?

Extramarital Affair: కోడలితో వివేహాతర సంబంధం.. చివరికి అత్తను ఏం చేశాడంటే..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Extra Marital Affair: రోజు ఆటోలో వస్తున్న మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెపై మోజుతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.. ఆ విషయం ఆమె అత్తకు తెలియడంతో.. ఏం చేశాడో తెలుసా..?

 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

   Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati


  Extramarital Affair: జీవితంలో చేసే చిన్న చిన్న తప్పులకు పెద్ద మూల్యం చేసుకోవాల్సి వస్తోంది. జల్సాలకు అలవాటు పడడం.. ఈజీ మనికి అలవాటు పడడంతో చాలామంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ముఖ్యంగా వివాహేతర  సంబంధాలు (Extra Marital Affairs) కాపురాల్లో చిచ్చు పెడతున్నాయి. వారు చేస్తున్నది తప్పు అని తెలిస్తూనే ఉంటుంది.. కేవలం తెలుసుకోవడమే కాదు.. ఆ విషయం తెలిసిన వారు హెచ్చరించినా చెవికి ఎక్కించుకోరు. తిరిగి తమకే అడ్డుచేబుతున్నారని వారిపైనే పగ పెంచుకుంటారు.. ఇలాంటి ఘటనలు ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి. అక్రమ సంబంధాల కారణంగా హత్య (Murder) లు  చేయడానికి కూడా కొందరు వెనుకాడడం లేదు. అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ (Andrha Pradesh) లోని పల్నాడు జిల్లా (Palnadu District) రొంపిచెర్ల మండలం విప్పర్ల గ్రామంలో జరిగింది.


  పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాలు ప్రకారం.. విప్పర్ల గ్రామంలో ఎవరో  రాత్రి మస్థానబీ ని హత్య చేసారు  అనే విషయం దావానలంలా వ్యాపించింది. ఆ సమాచాం పోలీసులకు అందడంతో వారు అక్కడకు చేరుకున్నారు. మస్థానబీ మృత దేహాన్ని పరిశీలించారు. ఒంటినిండా గాయాలతో అత్యాచారం జరిగినట్లుగా భావించారు.  వెంటనే డాగ్ స్క్వాడ్ ను పిలిపించగా.. అవి మణికంఠ ఇంటికి వెళ్లాయి.. దీంతో  పోలీసులు మణికంఠను అదుపులోకి తీసుకొని విచారించగా పోలీస్ లకు నమ్మ లేని నిజాలు చెప్పాడు. ఇంతకీ ఏం జరిగింది అంటే..  పెరవలి మణికంఠ  దూరవిద్య ద్వారా పదవతరగతి పాసయ్యాడు. లారీ క్లినర్ గా వెళుతుండేవాడు. తరువాత ఆటో నడుపుకుంటూ మద్యానికి చేడు వ్యసనాలకు బానిసయ్యాడు.


  ఇదీ చదవండి : దోచుకో.. పంచుకో.. దాచుకో.. ఇది వారి నినాదం.. సామాజిక న్యాయం మన విధానం


  తన జల్సాలకు డబ్బు ఆటో నడపటం ద్వారా రాకపోవటం తో గుంటూరు లో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తూ లాలాపేట పోలీస్ లకు పట్టు బడాడ్డు అయినా తన పద్దతి మార్చుకొని మణికంఠ రొంపిచెర్ల మండల పరిధి లో ఆటో లను  చోరీ చేసిన కేసులోనూ పట్టుబడ్డాడు.  వాటిని అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు.


  ఇదీ చదవండి : రోడ్డుపైనే బైఠాయించిన చంద్రబాబు.. కుప్పం వేదికగా సంచలన ప్రకటన


  బెయిల్ పై బయటకు వచ్చిన మణికంఠ మళ్లీ ఆటో నడుపుతున్నాడు. చిలకలూరి పేట దగ్గర గణపవరంలోని ఆయిల్ మిల్  కు తమ గ్రామంలోని కూలీలను రోజూ తీసుకువెళ్లి తీసుకు వచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలా రోజూ తీసుకువెళ్లి తీసుకు వచ్చే క్రమంలో తన ఆటోలో రోజూ పనికి వచ్చే షేక్ మస్థానబీ కోడలు జమిలాతో  పరిచయం పెంచుకున్నాడు. అది వివాహేతర సంబంధంగా మారింది.


  ఇదీ చదవండి: ఆమె చేసిన పనికి పగలబడి నవ్విన జగన్.. ఆ నవ్వు ఆపుకోలేక ఏం చేశారో చూడండి..


  ఆ విషయం  పసిగట్టిన అత్త మస్థానబీ ఒక రోజు గ్రామంలో మణికంఠని పట్టుకొని.. తన చిన్న కొడుకు సంసారాన్ని నాశనం చేయొద్చేదని నిలదీసింది. ఇంకా ఎంతమంది జీవితాలు ఇలా నాశనం చేస్తావని తిట్టింది. దీంతో ఆవేశానికి గురైన  మణికంఠ రాత్రి మద్యం సేవించి పన్నెండు గంటల ప్రాంతం లో ఇంటి బయట నిద్రిస్తున్న మస్థానబీ ముఖం పై దిండు పెట్టి ఉపిరికి ఆడకుండా చేసి.. ఆపై అత్యాచారం చేసి గొంతు నులిమి చంపివేసాడు. తరువాత అక్కడి నుండి పారిపోయాడు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Guntur

  ఉత్తమ కథలు