Extramarital Affair: పెళ్లై ఏడాది కూడా కాలేదు... ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. అంతలోనే ఊహించని ట్విస్ట్...

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh: ఆమెకు పెళ్లై ఏడాది కూడా కాలేదు. భర్త ఆర్మీలో ఉద్యోగి. మంచి జీవితం. దేనికీ లోటు లేదు. కానీ ఆమె ఒకే ఒక్క తప్పు చేసింది.

 • Share this:
  ఆమెకు పెళ్లై ఏడాది కూడా కాలేదు. భర్త ఆర్మీలో ఉద్యోగి. మంచి జీవితం. దేనికీ లోటు లేదు. ఇంతలో భర్తకు ట్రాన్స్ ఫర్ అయింది. ఫ్యామిలీ షిఫ్ట్ చేసేందుకు లీవ్ పెట్టి స్వగ్రామానికి వచ్చాడు. కానీ ఉన్నట్లుండి భార్య కనిపించకుండా పోయింది. ఎక్కడికెళ్లిందని ఆరా తీస్తే.. ప్రియుడి ఇంటికి వెళ్లినట్లు తేలింది. బంధువులు బ్రతిమిలాడినా ఆమె వచ్చేందుకు నిరాకరించింది. దీంతో ప్రియుడు తండ్రి, తాళికట్టిన భర్త కఠిన నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం చంఘీస్ ఖాన్ పేటకు చెందిన మామిడాల మహేశ్వరి అదేగ్రామానికి చెందిన మేనమామ శంకర్ తో 11నెలల క్రితం పెళ్లైంది. ప్రస్తుతం అతడు ఆర్మీలో చేస్తున్నాడు. ఇటీవలే అతనికి హైదరాబాద్ ట్రాన్స్ ఫర్ అయింది. దీంతో భార్యను కాపురానికి తీసుకెళ్లేందుకు లీవ్ పెట్టుకొని స్వగ్రామానికి వచ్చాడు. ఐతే అప్పటికే ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకున్న మహేశ్వరి.. చెప్పాపెట్టకుండా ప్రకాశం జిల్లా ఆదిపూడిలో ఉండే ప్రియుడి ఇంటికి వెళ్లిపోయింది.

  విషయం తెలుసుకున్న మహేశ్వరి కుటుంబ సభ్యులు ఆమె దగ్గరు వెళ్లి ఇంటికి వచ్చేయాలని బ్రతిమిలాడారు. కానీ అందుకు ఆమె నిరాకరించింది. విషయం తెలుకున్న మహేశ్వరి భర్త శిశంకర్ మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే మహేశ్వరి తన ఇంటికి వచ్చేయడంతో పరువుపోయిందని భావించిన ఆమె ప్రియుడి తండ్రి చుండూరి భద్రయ్య ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరోవైపు బంధువులు మహేశ్వరికి నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్లగా.. ఈ పరిస్థితులన్నీ తలచుకొని కలత చెందిన ఆమె కూడా బాత్ రూమ్ లోకి వెళ్లి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

  ఇది చదవండి: భార్యను ప్రియుడితో అలా చూసిన భర్త.. భార్య వేసిన మర్డర్ స్కెచ్ కు పోలీసులు షాక్


  శివయ్య, అక్కమ్మ దంపతులకు శివశంకర్ ఒక్కడే కొడుకు. నలుగురు కుమార్తెల తర్వాత కొడుకు పుట్టడంతో అతడ్ని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఆర్మీలో ఉద్యోగం సాధించడంతో తెలిసిన అమ్మాయినే ఇచ్చి పెళ్లిచేశారు. కొడుకు జీవితం బాగుంటుందనుకునే లోపే కోడలు ఇలాంటి ఘనకార్యానికి ఒడిగట్టింది. ఓ వైపు కోడలు మృతి చెందడం, మరోవైపు కొడుకు చావు బ్రతుకుల మధ్య ఉండటంతో తల్లడిల్లిపోతున్నారు. అటు మహేశ్వరి తల్లిదండ్రులు కూడా ఆమె చేసిన పనికి కుమిలిపోతున్నారు.

  ఇది చదవండి: 100 కి.మీ వేగంతో వస్తున్న రైలు.. ట్రాక్ పై యువకుడు.. లోకో పైలెట్ ఏం చేశాడంటే..!  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కరి సుఖం ఇద్దరి ప్రాణాలను బలిగొంది.. ఒకరిని మృత్యువుతో పోరాడేలా చేసింది. అంతేకాదు మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. వివాహేతర సంబంధాలు జీవితాలను నాశనం చేస్తాయనడానికి ఈ ఘటన సరైన ఉదాహరణగా చెప్పవచ్చు.

  ఇది చదవండి: ఏపీలో మళ్లీ లాక్ డౌన్.. మధ్యాహ్నం 2గంటల వరకే పర్మిషన్... ఎక్కడో తెలుసా..?

  Published by:Purna Chandra
  First published: