హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Venkaiah Naidu on NTR: ఎన్టీఆర్ వెన్నుపోటు వెనుక ఉన్నది వారే.. వెంకయ్య సంచలన వ్యాఖ్యలు..

Venkaiah Naidu on NTR: ఎన్టీఆర్ వెన్నుపోటు వెనుక ఉన్నది వారే.. వెంకయ్య సంచలన వ్యాఖ్యలు..

వెంకయ్యనాయుడు, ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో)

వెంకయ్యనాయుడు, ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో)

Venkaiah Naidu on NTR: సీనియర్ ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో నిత్యం నానుతూనే ఉంటుంది.. దీనిపై ఒక్కో వర్గం వెర్షన్ ఒక్కోలా ఉంటుంది.. తాజాగా ఈ ఎపిసోడ్ పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారంటే?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Tenali, India

Venkaiah Naidu on NTR: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఎన్టీఆర్ (NTR) వెన్నుపోటు అంశం ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తెలుగు దేశం (Telugn Desam) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పై ప్రత్యర్థి పార్టీలు ఇదే విమర్శ చేస్తూ ఉంటాయి. రాజకీయంగా లబ్ధి పొందడానికి ఈ అంశాన్నే ప్రధాన అస్త్రంగా వాడుకుంటూ ఉంటారు. దీనిపై టీడీపీ నేతలు (TDP Leaders) ఎన్ని రకాలుగా ఖండించినా.. విమర్శలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈ అంశంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెనాలిలో జరిగిన ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు ఈ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు.

వెన్నుపోటు ఎపిసోడ్‌పై సంచలన విషయాలను బయటపెట్టారు. సీనియర్ ఎన్టీఆర్‌ ఎలాంటి కల్మషం లేని వ్యక్తని, రాజకీయాల్లో కూడా అంతే భోళాతనంగా ఉండేవారని ఆయనతో ఉన్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే ఆనాడు జరిగిన పలు సంఘటనలు గుర్తుచేసుకుంటూ సీక్రెట్స్‌ను బయటపెట్టారు. మరి వెంకయ్య బయపెట్టిన ఆ సీక్రెట్స్‌ పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

స్వర్గీయ నందమూరి తారక రామారావు చారిత్రక పురుషుడంటూ వెంకయ్య కొనియాడారు. సినీరంగంలోనే కాదు, రాజకీయాల్లో విప్లవం తీసుకొచ్చిన మహావ్యక్తి ఆయన అన్నారు. అద్భుతమైన నాయకత్వ లక్షణాలతో.. మహా నాయకుడు అని గుర్తుంపు తెచ్చుకున్నారన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని గుర్తుచేసుకున్నారు. అప్పటివరకు వంటింటికే పరిమితమైన ఆడపడుచులు సైతం రాజకీయాల్లో రాణించేలా ప్రోత్సహించారని అన్నారు.

ఇదీ చదవండి : దటీజ్ జగన్.. మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం.. ఏం చేశారో చూడండి..

ఎన్టీఆర్‌ ఎలాంటి కల్మషం లేని వ్యక్త అని, రాజకీయాల్లో కూడా అంతే భోళాతనంగా ఉండేవారని అన్నారు. అందరినీ నమ్మేవారని, బహుశా అదే ఆయన వెన్నుపోటుకు కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు వెంకయ్య. ఒకసారి ఎన్టీఆర్‌తో తాను కలిసి కూర్చొని ఉండగా ఆరుగురు మహిళలు వచ్చి ఆయన కాళ్లకు నమస్కరించారని, కొన్నాళ్లకు వాళ్లే వెన్నుపోటు ఎపిసోడ్‌లో కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు.

ఇదీ చదవండి: చంద్రబాబు రోడ్ షోలకు పవర్ కట్.. సైకో పాలనను తరిమేయాలంటూ చంద్రబాబు పిలుపు..

అయితే ఆ సమయంలోనే వాళ్లెందుకు మీ కాళ్లకు దండం పెట్టారని తాను ఎన్టీఆర్‌ను అడిగానని.. దాంతో ప్రేమ, అభిమానంతో కాళ్లకు నమస్కరించారని ఎన్టీఆర్‌ అన్నారని.. తాను మాత్రం అది ప్రేమ కాదని అన్నానంటూ గుర్తుచేసుకున్నారు. చివరికి, అదే నిజమైందన్నారు వెంకయ్య. ఎన్టీఆర్‌ తన వెనుక జరుగుతోన్న కుట్రలు, కుతంత్రాలను గమనించలేకపోవడం వల్లే వెన్నుపోటుకు గురయ్యారని అన్నారు. ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్లో వెంకయ్యనాయుడు చేసిన ఈ కామెంట్స్‌ ఇప్పుడు సంచలనంగా మారాయ్‌. మరి ఆ ఆరుగురు మహిళలు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

First published:

Tags: Andhra Pradesh, AP News, TDP, Venkaiah Naidu

ఉత్తమ కథలు