Home /News /andhra-pradesh /

GUNTUR EX MINSTER BALINENI SRINIVASA REDDY HOT COMMENTS ON HIS OWN PARTY NGS GNT

Balineni Srinivasa Reddy: సొంత పార్టీపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. పవన్ పై గౌరవం ఉందన్న బాలినేని

రాజీనామాపై స్పందించిన బాలినేని

రాజీనామాపై స్పందించిన బాలినేని

Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. మంత్రి వర్గంలో చోటు దక్కలేదని అలక వహించినప్పటి నుంచి ఆయన వ్యవహారం చర్చనీయాంశంగానే ఉంది. అయితే తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా సొంత పార్టీ నేతలపైనే..

ఇంకా చదవండి ...
    Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి (Balineni Srinivasareddy) సంచనల వ్యాఖ్యలు చేశారు… తన సొంత పార్టీకి చెందిన నేతలపైనే మండిపడ్డారు. అది కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయంటున్నారు. తనపై కుట్రలు చేస్తున్నవారి పేర్లను త్వరలోనే వారి వివరాలను వెల్లడిస్తానని, అవసరమైనే సియం జగన్ (CM Jagan) కు సైతం ఫిర్యాదు చేస్తానన్నారు. ఇటీవల తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని TDP నేతలు లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వారికి కొంతమంది YCP నేతలు సహకరిస్తున్నారని తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కుట్రలో స్వంత పార్టీ నేతలు కూడా ఉన్నారని తెలుసుకుని సిగ్గుపడుతున్నానన్నారు.

    గతంలో చెన్నైలో 5 కోట్లు పట్టుబడినా.. ఇటీవల జనసేన మహిళా నేతకు ఫోన్ వచ్చినా , అల్లూరులో కవిత అనే మహిళ కుటుంబ కలహాలను వాడుకుని తనపై బురద చల్లినా ఇలా ఏ వివాదం వచ్చినా.. కచ్చితంగా దీని వెనుక టిడిపి నేతలు దామచర్ల జనార్దన్, మంత్రి శ్రీను ఉన్నారన్నారని బాలినని మండిపడ్డారు. టీడీపీ నేతలు ఎన్ని విమర్శలు చేసినా.. తాను పట్టించుకోనని.. కానీ సొంత పార్టీ నేతలే తనపై విమర్శలు చేయడాన్ని మాత్రం సీరియస్ గా తీసుకుంటాను అన్నారు.

    తాజాగా జనసేన మహిళా నేత విషయంలో పవన్ కళ్యాణ్ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారని.. ఆయనపై గౌరవంతో స్పందించామన్నారు. ఇదే విషయంపై తాను పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తున్నానని అన్నారు. జనసేన మహిళా నేత విషయంలో టీడీపీ నేతల ప్రమేయం ఉందని తెలిసిందన్నారు. దీనిపై విచారణ చేపట్టగలరా అని పవన్ కళ్యాణ్‌ను బాలినేని ప్రశ్నించారు. ఒకవేళ జనసేన విచారణలో తన తప్పు ఉందని తేలితే తన పదవికి, పార్టీకి రాజీనా చేస్తానన్నారు.

    ఇదీ చదవండి : రేపు పారిస్ కు సీఎం జగన్.. కుటుంబ సమేతంగా పయనం.. ఎందుకంటే..?

    అలాగే రెండు రోజుల క్రితం చెన్నైలో ఒంగోలుకు చెందిన వారి రెండు కోట్లు పట్టుబడినా అది తనకే ఆపాదిస్తూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పై జరుగుతున్న కుట్రపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని… కాల్ డేటా తెప్పించుకొని విచారణ చేయాల్సిందిగా పోలీసులను కోరాతానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి స్పష్టం చేశారు.

    ఇదీ చదవండి : ఎద్దుల కుమ్ములాటలో న్యాయవాదికి గాయాలు.. కార్పొరేషన్ అధికారులపై కేసు

    బాలినేని వ్యవహారం ఇటీవల నిత్యం వివాదస్పదం అవుతోంది. ఏదో ఒకరకంగా ఆయన వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మంత్రి పదవి విస్తరణ సమయంలో.. తనకు రెండో చాన్స్ వస్తుందని గట్టిగా నమ్మారు.. కానీ మంత్రి ఆదిమూలపు సురేష్ పదవిని కొనసాగించి.. తనను తప్పించడంపై తీవ్ర మనస్థాపం చెందారు. పార్టీ మారుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అలాగే ఆయన జనసేనలో చేరుతారని ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఆయన సైతం పవన్ పై తనకు గౌరవం ఉంది అనడం ఇప్పుడు మరో చర్చకు దారి తీస్తోంది. ఎందుకంటే.. పవన్ అంటేనే వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన పవన్ పై గౌరవం ఉంది అనడం చర్చకు కారణమైంది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Balineni srinivas reddy, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు