హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Ex Minster: పవన్ తో మాజీ మంత్రి టచ్ లో ఉన్నారా? జనసేనలో చేరాలి అనుకుంటున్నారా? ఆయనేమన్నారంటే?

AP Ex Minster: పవన్ తో మాజీ మంత్రి టచ్ లో ఉన్నారా? జనసేనలో చేరాలి అనుకుంటున్నారా? ఆయనేమన్నారంటే?

Pawan Kalyan Twitter

Pawan Kalyan Twitter

AP Ex Minster: ఆ మాజీ మంత్రి పార్టీ మారాలి అని ఫిక్స్ అయ్యారా..? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు టచ్ లోకి వెళ్లారా..? వైసీపీకి బై బై చెప్పేందుకు ఫిక్స్ అయ్యారా..? దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ప్రచారంపై ఆయన వెంటనే స్పందించారు. ఆయనేమన్నారంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

AP Ex Minster: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivas Reddy) పార్టీ మారాలని ఫిక్స్ అయ్యారా..? సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) బంధువు.. సీనియర్ నేత బాలినేని జనసేన (Janasena) తో టచ్ లో ఉన్నారంటూ చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. తాజాగా.. చేనేత దినోత్సవం రోజున.. తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) హ్యాండ్లూమ్ ఛాలెంజ్ లో భాగంగా పవన్ కు సవాల్ విసిరారు. దీనిని స్వీకరించిన  పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరో ముగ్గురికి ఛాలెంజ్ చేసారు. అందులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తో సహా మాజీ మంత్రి బాలినేని ఉన్నారు. దీంతో..ఈ ప్రచారం మరింత జోరుగా సాగింది. ఆయన కూడా పవన్ ఛాలెంజ్ ను స్వీకరించడం.. దాన్ని పవన్ కు షేర్ చేస్తే.. ఆయన అభనందించడం అన్ని వెంటన వెంటనే జరిగాయి. ఇలాంటి సమయంలో ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ నేతలతో గిద్దలూరు వ్యవహారం పైన బాలినేని సమావేశం అవ్వడంతో చర్చ మరింత ఊపందుకుంది.

మంత్రి పదవి పోయిన దగ్గర నుంచి బాలినేనికి పార్టీలో ప్రధాన్యత తగ్గిందనే ప్రచారం కూడా ఉంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు తరువాత తొలిదశ మంత్రివర్గంలో బాలినేని కి చొటు దక్కింది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఆయనకు మంచి ప్రాధ్యాన్యత ఉండేది. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ చేశారు. ఇందులో భాగంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన మంత్రి పదవి కోల్పోవాల్సి వచ్చింది. అలా మంత్రి పదవి పోయినప్పటి నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేరు నిరంతరం వార్తల్లోనే ఉంటూ వస్తున్నారు.

మంత్రి పదవి నుంచి తప్పించిన వారం రోజుల పాటు ఆయన పార్టీ అధిష్టానాన్ని కలవడానికి కూడా ఇష్టపడలేదు. ఆ సమయంలోనే పార్టీ మారుతారనే ప్రచారం జరిగినా.. తరువాత అధినేత జగన్ తో భేటీ తరువాత పరిస్థితి సద్దుమణిగింది. అయితే బాలినేనికి మాత్రం పార్టీలో ప్రాధాన్యత దగ్గడం లేదని.. పదవుల విషయంలో ఆయన మాట నెగ్గడం లేదన్నది అనుచురుల మాట.. అందుకే ఇప్పుడు ఆ ప్రచారం జోరందుకుంది.

ఇదీ చదవండి : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-బీజేపీ పొత్తు పొడుస్తుందా..? క్లారిటీ ఇచ్చిన తెలంగాణ కాషాయ నేత

ఇలా తనపై వస్తున్న ఆరపోణలపై మాజీ మంత్రి బాలినేని స్పష్టత ఇచ్చారు. తాను జనసేన నేతలతో టచ్ లో ఉన్నాననేది అవాస్తవమని తేల్చి చెప్పారు. ఆ ప్రచారం లో వాస్తవం లేదన్నారు. తాను వైఎస్సార్ పెట్టిన భిక్షతోనే ఎమ్మెల్యేను అయ్యాయని స్పష్టం చేసారు. గతంలో తన మంత్రి పదవి వదిలి జగన్ కోసం వచ్చానని గుర్తు చేసారు. ఊసరవెల్లి రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. రాజకీయంగా అయినా.. వ్యక్తిగతంగా అయినా..? ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే ఉంటానంటూ మాజీ మంత్రి బాలినేని తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి : టీడీపీకి షాక్.. కీలక నేత రాజీనామా.. తప్పు ఒప్పుకున్న లోకేష్.. ఏమన్నారంటే..?

తనను రెచ్చగొట్టే విధంగా ప్రతిపక్షాలు, కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను సీఎం దృష్టికి తీసుకెళ్తాను.” అని క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో కొనసాగినంత కాలం వైసీపీలోనే ఉంటానని.. లేకుంటే రాజకీయాలు విరమిస్తానని క్లారిటీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేనేతకు సంబంధించి తనకు టాగ్ చేస్తూ ట్వీట్ చేస్తే రెస్పాండ్ అయ్యానని వివరించారు. కేటీఆర్, పవన్ కళ్యాణ్ కు కూడా ట్వీట్ చేశారు.. దాన్ని మాత్రం హైలెట్ చేయరంటూ బాలినేని అసహనం వ్యక్తం చేశారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Balineni srinivas reddy, Janasena, Pawan kalyan

ఉత్తమ కథలు