Kodali Nani: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) ప్రస్తుతం ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల (MLC Elections Result) చుట్టూనే తిరుగుతున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి వారం దాటినా.. అదే అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఇదే అంశంపై తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని (Ex Minister) ఘాటుగా స్పందించారు. సాధారణంగా చంద్రబాబు (Chandrababu) పేరు ఎత్తితే చాలు తీవ్ర స్థాయిలో మండిపడే కొడాలి నాని.. మరోసారి టీడీపీ అధినేతపై ధ్వజమెత్తారు. ఏపీ ప్రజలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ని చూస్తే సంక్షేమ పథకాలు (Welfare Schemes ) గుర్తొస్తాయి.. కానీ తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు ని చూస్తే వెన్ను పోటే గుర్తుకు వస్తుంది అన్నారు. చనిపోయిన సీనియర్ ఎన్టీఆర్ పై ఇప్పుడు చంద్రబాబు చాలా ప్రేమ చూపిస్తున్నట్టు డ్రామాలు ఆడుతున్నారని.. అంత ప్రేమ ఉంటే..? ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేసి గెంటేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ పేదల కోసం చిత్తశుద్ధితో పని చేశారు. అందుకే ఆయన్ని మహానుభావుడు అంటారన్నారు. పేద, బడుగు బలహీనవర్గాల కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడ్డారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ పేరును సైతం వైసీపీ స్మరిస్తూనే ఉంటుంది అన్నారు. కానీ ఆయనే దేవుడు అని చెప్పుకుని తిరిగే చంద్రబాబు ఎందుకు వెన్నుపోటు పొడవాల్సి వచ్చింది? ఆయన కాళ్లు పట్టుకు ఎందుకు లాగేశారు? ఆయనపై ఎందుకు చెప్పులతో దాడి చేయించారు? ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేసి, గెంటేశారు? చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్, వైఎస్సార్ కలిపితే జగన్ అని కొత్త నిర్వచనం ఇచ్చారు కొడాలి నాని . ఆయనకు అభివృద్ధిపైనే దృష్టి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తాం.. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇవ్వండి అని ఎమ్మెల్యేలు అడిగినా.. ఏదో గెలుపు కోసం అబద్దపు హమీ ఇవ్వడం జగన్ కు తెలీదు అన్నారు. జగన్ తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ అవకాశవాద రాజకీయాలు చెయ్యరన్నారు. 23 మంది ఎమ్మెల్యేల్ని కొంటే.. 2019లో టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలే నెగ్గారని.. ఇదంతా దేవుడి స్క్రిప్ట్ అన్నారు. ఇప్పుడు నలుగురిని కొన్నందుకు 2024లో కూడా నాలుగు సీట్లే వస్తాయి. ఇది కూడా దేవుడి స్క్రిప్టే రాసి పెట్టుకోండి అన్నారు.
ఇదీ చదవండి : అమ్మో నిమ్మ.. ఒక్క కాయ ధర ఎంతో తెలిస్తే షాక్.. అదే రూటులో అల్లం
అయితే టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీ తీసుకుంది కదా అని అడిగిన ప్రశ్నకూ సమాధానం చెప్పారు కొడాలి నాని.. టీడీపీ నుంచి గెలుపొందిన నలుగురు నేతలు.. చంద్రబాబు చేసే పనులు చూడలేక తిరుగుబాటు చేశారని.. వారు ఎవరూ వైసీపీ కండువా కప్పుకోలేదు అన్నారు. అంతేకాదు వారు టీడీపీ దూరం జరిగినప్పుడు జగన్ మోహన్ రెడ్డి.. ఎక్కడా చంద్రబాబును విమర్శించలేదన్నారు. చంద్రబాబు అంటే నచ్చకే వారంతా వైసీపీలోకి వచ్చారని జగన్ ఒక్కరోజు కూడా చెప్పలేదు అన్నారు. కానీ చంద్రబాబు నిత్యం జగన్ మీద వ్యతిరేకతతోనే వారంతా టీడీపిలోకి వస్తున్నారని ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీకి టికెట్ ఇవ్వకపోవచ్చు.. లేదా ఇవ్వొచ్చు.. టికెట్ల అంశం అంతా సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గరే ఉంటుంది అన్నారు కొడాలి నాని..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Kodali Nani, Vallabhaneni Vamshi