హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kodali Nani: పార్టీ అధినేత కాదు యముడు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Kodali Nani: పార్టీ అధినేత కాదు యముడు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

కొడాలి నాని (File Photo)

కొడాలి నాని (File Photo)

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు పార్టీ అధినేత కాదని.. ప్రజల పాలిట యముడిలా మారారని.. మండిపడ్డారు.. ఇంకా ఆయన ఏమన్నారంటే..?

  • News18 Telugu
  • Last Updated :
  • Gudivada, India

Kodali Nani on Chandrababu Naidu : తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గుంటూరు సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళల మరణంపై రాజకీయం రచ్చ రచ్చ అవుతూనే ఉంది. కందుకూరు ఘటన మరువక ముందే.. మరో తొక్కిసలాట జరగడంతో రాజకీయాలు మరిత హీటెక్కాయి. అయితే గుంటూరు ఘటన (Guntur Issue) కు చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చే కారణమంటూ అధికార మంత్రులు.. వైసీపీ నాయకులు మండిపడుతుండగా.. టీడీపీ మాత్రం భద్రతా లోపమంటూ కౌంటర్ ఇస్తోంది. వరస రెండు ఘటనలు చంద్రబాబు చేసిన హత్యేలే అని.. ఆయన పబ్లిసీటీ పిచ్చికి ఇంకెంతమంది ప్రాణాలు బలికావాలని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు స్వయంగా జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) సైతం తీవ్ర ఆరోపణలు చేశారు.. పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఏదైనా చేస్తారని.. అందకే ఇరుకు సందుల్లో సమావేశాలు పెడుతూ.. మనుషుల ప్రాణాలు తీస్తున్నారంటూ ఆవేదన వ్య్తక్తం చేశారు. తాజాగా మాజీ మంత్రి.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబుపై కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యమరథంతో చంద్రబాబు ప్రజలను చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కానుకలిస్తామని చెప్పి ముగ్గురు మహిళల ప్రాణాలను బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏడాది చివర ఎనిమిది మందిని, ప్రారంభంలో ముగ్గురిని బలుగొన్న నరరూప రాక్షసుడు చంద్రబాబు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

చంద్రబాబు టీడీపీ అధినేత కాదని.. శని గ్రహాన్ని మించిన, జామాతా దశమగ్రహం అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు పబ్లిసిటీ పిచ్చితో అమాయకులు బలి అవుతున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా అధికారులు ఈ విషయాన్ని గుర్తించి చంద్రబాబు బహిరంగ సభలకు అనుమతి ఇవ్వకూడదంటూ కొడాలి నాని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:  అధికారులపై ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్యే.. సీఎంవో నుంచి పిలుపు.. సీఎంతో భేటీపై ఉత్కంఠ

మొదలు, చివర తెలియని ఎన్నారైలు నిర్వహించిన ఇలాంటి కార్యక్రమానికి బుద్ధున్న వాళ్ళు ఎవరు వెళ్లరంటూ పేర్కొన్నారు. తమనేరాన్ని పోలీసులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ సభలకు సూచనలు చేస్తే, పోలీసులు తమపై ఆంక్షలు విధిస్తున్నారని గగ్గోలు పెడతారన్నారు. నూటికి నూరు శాతం చంద్రబాబు పిచ్చితోనే మరణాలు సంభవించాయంటూ పేర్కొన్నారు. ప్రతి ఎన్నికలో ఎవరో ఒకరి కాళ్లు పట్టుకొని గెలవడమే చంద్రబాబుకు తెలుసన్నారు.

ఇదీ చదవండి: వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు.. టీటీడీ కీలక సూచనలు

స్వయంగా ఆయనకు గెలవడం కల అంటూ పేర్కొన్నారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఉండదని.. శూన్యమని ఈ సందర్భంగా నాని పేర్కొన్నారు. బిఆర్ఎస్ వల్లే నష్టపోయామని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారని.. జాతీయ రాజకీయాలపై అవగాహన ఉన్న కేసీఆర్ ఎక్కడైనా పోటీ చేయవచ్చంటూ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో సింగల్ గానే పోటీ చేస్తుందన్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, Kodali Nani