హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kodali Nani: ఎన్నారై అయినా ఒకే.. లేక చంద్రబాబు లోకేష్ అయినా రెడీ..? కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Kodali Nani: ఎన్నారై అయినా ఒకే.. లేక చంద్రబాబు లోకేష్ అయినా రెడీ..? కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి కొడాలి నాని పై పోటీ చేసేది ఎవరంటే?

మాజీ మంత్రి కొడాలి నాని పై పోటీ చేసేది ఎవరంటే?

Kodali Nani: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అప్పుడే ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. గెలుపు ఓటములపై ఎవరి లెక్కలు వారేసుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని.. టీడీపీ నేతలకు సవాల్ విసిరారు.. ఎన్నారైని దింపుతారో..? లేక చంద్రబాబు నాయుడు.. లోకేష్ బరిలో దిగుతారో రండీ.. అంటూ సవాల్ విసిరారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Gudivada, India

Kodali Nani: ఆంధ్రప్రదేశ్ లో గుడివాడ నియోజవర్గం చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. అందుకు కారణం అక్కడ మాజీ మంత్రి కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉండడమే.. ఇప్పటికే ఆయన నాలుగు సార్లు అక్కడ నుంచి గెలుపొందారు.. ఆయన పార్టీ మారినా.. తన ప్రత్యర్థి మారినా.. గెలుపు మాత్రం కొడాలి నానిదే అవుతోంది. అందుకే గుడివాడ అంటే కొడాలి నాని అడ్డగా చెబుతారు.. మరోసారి గెలుపు కోసం ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆయన తనయుడు నారా లోకేష్ పై నిప్పులు చెరగడంలో కొడాలి నాని ముందు ఉంటారు.. ఆ ఇద్దరి నేతలను తిట్టే వారిలో ముందుగా చెప్పుకునేది కొడాలి నాని గురించే.. అందుకే తెలుగు దేశం సైతం కచ్చితంగా గుడివాడలో నెగ్గాలని ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంది. గత ఎన్నికల్లోనే ఎలాగైనా నానిని ఓడించాలనే వ్యూహంలో భాగంగా బలమైన నేత అయిన దేవీనేని అవినాష్ ను రంగంలోకి దింపారు.. కానీ ఫలితం కొడాలి నానికే అనుకూలంగా వచ్చింది. ఆ తరువాత దేవినేని అవినాష్ వైసీపీలో చేరారు.. కథ మళ్లీ మొదటికొచ్చింది.

కొడాలి నానిని ఓడించే అభ్యర్థి కోసం టీడీపీ ప్రత్యేకంగా కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రకాల చర్చ జరుగుతోంది. నందమూరి కుటుంబం నుంచి ఎవరినైనా బరిలో దింపితే బాగుంటుందని ఓ ప్రచారం ఉంది. మరోవైపు అక్కడి ఇంఛార్స్ రావి వెంకటేశ్వరరావు ఈ సారి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం కూడా ఉంది.

తాజాగా ఓ ఎన్ఆర్ఐ ను గుడివాడ బరిలో దింపుతున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఎన్ఆర్ఐ అయిన రాము అభ్యర్థిగా చంద్రబాబు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో కొన్నాళ్లుగా నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు రాము కుటుంబసభ్యులు. వచ్చే నెల నుంచే గుడివాడలోనే వెనిగళ్ల రాము ఉంటాడని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో ఆ ప్రచారంపై కొడాలి నాని ఘాటుగా స్పందించారు.

ఇదీ చదవండి : మోదీ ప్లాన్ వర్కౌట్ అవుతోందా..? చిరంజీవి వ్యాఖ్యలకు కారణం అదేనా..?

వందల కోట్లు డబ్బు తెచ్చినా గుడివాడ ప్రజలు అమ్ముడుపోరని కొడాలి నాని అన్నారు. ప్రజలతో సంబంధం లేని ఎన్నారైలు, రాజకీయ విశ్లేషకులు గెలుపును నిర్ణయించరని చెప్పారు. కుల సంఘాల చందా డబ్బులు వేల కోట్లు తెచ్చినా చివరి రక్తపు బొట్టు వరకు వైసీపీ గెలుపు కోసం పోరాడతానని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: తిరుపతిలో భయం భయం.. చీకటి పడితే చాలు బయటకు రావాలంటే వణుకే.

గుడివాడలో గెలుపోటములను నిర్ణయించేది ఇక్కడి ప్రజలే అని కొడాలితేల్చి చెప్పారు. గుడివాడలో చంద్రబాబు, లోకేశ్, ఎన్నారై.. ఎవరు పోటీ చేసినా.. బరిలోకి దిగేది నేనే అని అన్నారు. ఎన్నారైలు, రాజకీయ విశ్లేషకులు గెలుపును నిర్ణయించరని కొడాలి నాని చెప్పారు. వందల కోట్లు డబ్బు తెస్తే గుడివాడ ప్రజలు అమ్ముడుపోరని కొడాలి నాని అన్నారు. గుడివాడలో 2 లక్షల 10 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఎమ్మెల్యేగా ఎవరు ఉండాలి, ఎవరు గెలవాలి, ఎవరు ఓడాలి అనేది ఓటర్లు డిసైడ్ చేస్తారన్నారు.

ఇదీ చదవండి : విద్యార్థులకు నేటి నుంచి కొత్త మెనూ.. శారీరక దృఢత్వాన్ని పెంచేందుకు సర్కారు బడుల్లో మొదలైన చర్యలు

చంద్రబాబు నాయుడు, లోకేశ్, రాబిన్ శర్మ, లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి ఎవరో నలుగురు పనికిమాలిన వ్యక్తులో గుడివాడలో ఎవరు ఎమ్మెల్యేగా ఉండాలో నిర్ణయించే శక్తిగాని, సామర్థ్యం గాని ఉండవు. తెలుగుదేశం పార్టీ చందాలు వేసుకుని వందో రెండు వందల కోట్లో ఇచ్చి ఇక్కడికి పంపిస్తే, ఆ డబ్బులు ఇక్కడ 5 వేలు, 10 వేలు మనిషికి ఇస్తే తీసుకుని ఆ పార్టీకి ఓటు వేస్తారనే ఏదైనా పిచ్చి భ్రమల్లో ఉంటే పరాభవం తప్పదు. గతంలో ఏం జరిగిందో 2024లో కూడా అదే జరుగుతుంది. ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చినా, ఎన్ని కుల సంఘాలు చందాలు వేసుకుని పంపించినా.. వ్యక్తులు గుడివాడలో గెలుపోటములను ప్రభావితం చేయలేరన్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Gudivada, Kodali Nani, Nara Lokesh

ఉత్తమ కథలు