హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: మొన్న అనం.. నిన్న వసంత కృష్ణప్రసాద్.. నేడు మాజీ మంత్రి..? వారి టార్గెట్ అదేనా..?

AP Politics: మొన్న అనం.. నిన్న వసంత కృష్ణప్రసాద్.. నేడు మాజీ మంత్రి..? వారి టార్గెట్ అదేనా..?

అధికార పార్టీ నేతల మాటలకు అర్థం అదేనా..?

అధికార పార్టీ నేతల మాటలకు అర్థం అదేనా..?

Ex Minister: అధికార పార్టీ నేతల వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. రోజుకో నేత మాటలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి.. వసంత వ్యాఖ్యల వివాదం ఆగకముందే.. ఇప్పుడు మాజీ హోం మంత్రి సుచరిత వంతు వచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Ex Minister: అధికారం వైసీపీ (YCP) లో ఏం జరుగుతోంది.. పార్టీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు ఇటీవల అధిష్టానానికి తలనొప్పులుగా మారాయి. ఇప్పటికే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy).. ప్రభుత్వం పైనే తీవ్ర విమర్శలు చేసి.. ఇంఛార్జ్ పదవికి పోగొట్టుకున్నారు. ఇక వసంత కృష్ణప్రసాద్ (Vasanta Krishna Prasad) వ్యాఖ్యలు మరింత కలవరపెట్టాయి. ఎన్ఆర్ఐలు సేవ చేయడానికి వస్తే.. వారిని ఇంతలా భయపెడితే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు.. ఆ ఇద్దరి వ్యాఖ్యల కలకలం మరిచిపోకముందే.. మాజీ హోం మంత్రి సుచరిత (Mekathoti Sucharitha) సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. వైసీపీ పార్టీ మారడంపై సుచరిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో.. అధికార పార్టీ నేతలు ఇలా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.. మనసులో మాట బయటపెడుతున్నామంటూ.. సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయ నేతల వ్యాఖ్యలు చూస్తే.. ఏదో ప్లాన్ తో  ఉన్నారనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఇక వారి అనుచరులు సైతం.. పార్టీ మారే ప్రయత్నాలు తమ నేతలు ఉన్నారని చెబుతున్నారు. అందుకే ఎదో ఒక రూపంలో  ఇలా తమ మనసులో మాట బయటపెడుతున్నారు. తాజాగా సుచరిత వ్యాఖ్యలు చూస్తే ఆమె పార్టీ మారుతారనే అను చర్చ జరుగుతోంది.

తన భర్త పార్టీ మారితే తాను కూడా మారాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఎందుకంటే తన భర్త ఓ పార్టీలోను.. తాను మరో పార్టీలోను ఉండబోమని అన్నారు. అందుకే తన భర్త పార్టీ మారితే తాను కూడా మారాల్సి వస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాము ఎప్పుడూ జగన్ తోనే ఉంటామని.. తాను చెప్పిన దానికి తన భర్త దయాసాగర్ కూడా కట్టుబడి ఉంటారని అన్నారు. ఒకవేళ తన భర్త పార్టీ మారతానని తనను కూడా రా అని భర్త పిలిస్తే.. ఒక భార్యగా తాను కచ్చితంగా తన భర్త అడుగుజాడల్లోనే నడుస్తానని చెప్పారు.

ఇదీ చదవండి : మంచి ఉద్యోగం.. చేతి నిండా సంపాదన అంటూ ల్యాప్ టాప్ ఇచ్చారు.. అక్కడే ఊహించని ట్విస్ట్

ఇతర నేతల్లా తన భర్త ఒక పార్టీలో, తాను మరో పార్టీలో, తన పిల్లలు ఇంకో పార్టీలో ఉండమని తెలిపారు. జగన్ పార్టీలో తాము ఉండగలిగినంత కాలం ఉంటామన్నారు. గత కేబినెట్ కూర్పు వరకు సుచరితకు పార్టీలో సముచిత స్థానమే ఉండేది. జగన్ తొలి కేబినెట్ లో కీలకమైన హోమ్ మినిష్టర్ కూడా అయ్యారు. కానీ అది మూనాళ్ల ముచ్చటే అయ్యింది. రెండున్నర సంవత్సరాల తరువాత ఆమె మంత్రి పదవినుంచి తొలగించారు సీఎం జగన్ . దీంతో ఆమె అలకబూనారు. ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేశారని పార్టీ కూడా మారతారనే వార్తలు తీవ్రంగా వచ్చాయి. ఆ స్థాయికి ఆమెకూడా వెళ్లారు.

ఇదీ చదవండి : పెద్దిరెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా..? చంద్రబాబు సవాల్ ను మంత్రి స్వీకరిస్తారా?

అంతేకాదు రాజీనామా పత్రం కూడా సిద్ధం చేసుకున్నారని ఆమె కుటుంబ సభ్యులే తెలిపారు. కానీ తరువాత జగన్ పిలిచి ఏం మాట్లాడారో గానీ బహుశా బుజ్జగించారో లేదా బెదిరించారో తెలీదుగానీ.. ఆమె తాను పార్టీ మారేది లేదు తనను హోంమంత్రి చేసిన జగన్ తోనే కలిసి నడుస్తాను అంటూ స్పష్టంచేశారు. కానీ ఇప్పుడు మళ్లీ ఆమె స్వరంలో తేడా కనిపిస్తోంది. మరో పార్టీల్లోకి దూకటానికి కూడా మార్గాలు సిద్ధం చేసుకుంటున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజా వ్యాఖ్యలు బహుశా పార్టీ మార్పు గురించి సంకేతాలనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇదీ చదవండి : అదే నిజమైతే టీడీపీ , జనసేన నేతలు ఏపీలో తిరగగలరా..? మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్

ఎన్నికల దగ్గర పడుతుంటే జంప్ జినానీలు షురూ అవుతుంటాయి. ఇది సర్వసాధారణ విషయాలే. తమకు టికెట్ దక్కుతుందో లేదో అనే అనుమానం ఉన్న నేతలు పక్క పార్టీల వంక చూస్తు ఎక్కటి టికెట్ లభిస్తే ఆ పార్టీలోకి జంప్ అయిపోతుంటారు. దీంట్లో భాగంగానే వైసీపీ నుంచి కూడా పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి దూకటానికి సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఆనం  కుటుంబం మొత్తం టీడీపీలో చేరుతుందానే ప్రచారం ఉంది. వసంత పైనా అనుమానాలు ఉన్నాయి. కాగా..మరి వైసీపీ మరోసారి సుచరితకు టికెట్ ఇస్తే పార్టీలోనే ఉంటారు. లేదంటే మరోపార్టీకి జంప్ అవుతారు..దీనికి ఆమె భర్త ఓ కారణంగా చెప్పుకోవటానికి ఉన్నారు. ఆయన టీడీపీ నుంచి బాపట్ల ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఉంది.. అందుకే ఆమె తన భర్త పార్టీ మారదాం అంటే మారుతాను అంటూ హింట్ ఇచ్చారు అంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Mekathoti sucharitha, Ycp

ఉత్తమ కథలు