Andhra Praesh: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ముగిసేది అప్పుడే.. తేల్చిచెప్పిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఎప్పుడు పోతుంది..? ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు ఏపీ ఇంజనీరింగ్ విద్యార్థులు..

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా సగటున రోజుకు 20వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షలను విధించింది. రాష్ట్రంలో చాలా చోట్ల కొవిడ్ రోగులు బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సెకండ్ వేవ్ ఎన్నాళ్లుంటుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఇంజనీరింగ్ విద్యార్థులు ఓ ఇంట్రెస్టింగ్ నివేదికను సిద్ధం చేశారు. ఏపీలో కరోనాకు ఎప్పుడు ముగింపు ఉంటుందో తేల్చిచెప్పేశారు. ప్రస్తుతం నమోదవుతున్న రోజువారీ పాజిటివ్ కేసులు ఆదారంగా కరోనా ముగింపు తేదీని ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థుల బృందం కరోనాపై అంచనా నివేదికను రూపొందించింది. ఈ నివేదికను సీఎం జగన్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు ఈ మెయిల్ ద్వారా పంపారు. ఇందులో కరోనా కేసుల సంఖ్య ఎప్పుడు ఎలా తగ్గుతుంది..? ఏ తేదీ నాటికి ఎన్ని కేసులు నమోదవుతాయన్న వివరాలను పొందుపరిచారు.

    ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 20వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ సంఖ్య ఈనెల 30 నాటికి 5వేల కేసులకు తగ్గుతుందని నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాడుకలో ఉన్న సస్పెక్టబుల్ ఇన్ ఫెక్టెడ్ అండ్ రికవరీ మోడల్ ఆధారంగా ర్యాండమ్ పారెస్ట్ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్ సాయంతో డేటాను తయారు చేసినట్లు విద్యార్థులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా విడుదల చేస్తున్న రోజువారీ పాజిటివ్ కేసులు, రికవరీ కేసుల డేటాతో ఎస్.ఐ.ఆర్ తో జేటాను అనుసంధానం చేసి కరోనా వ్యాప్తి అంచనాలు స్పష్టమైననట్లు వివరించారు.

    ఇది చదవండి: ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలంటే ఇవి తప్పనిసరి.. e-Pass ఎలా పొందాలంటే..!


    మార్చి 3వ తేదీ నుంచి నమోదన కేసుల ఆధారంగా డేటాను విద్యార్థుల బృందం విశ్లేషించింది. విద్యార్థులు తయారు చేసిన రిపోర్ట్ ప్రకారం ఈనెల 21నాటికి రాష్ట్రంలో రోజుకి 10వేల పాజిటివ్ కేసులు, 30వ తేదీకి 5వేల పాజిటివ్ కేసులు, జూన్ 14వ తేదీకి వెయ్యి కేసులు, జూన్ 23నాటికి 500 కేసులు, జూలై 15 నాటికి రోజుకు వంద కంటే తక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతాయని నివేదికలో పేర్కొన్నారు.

    ఇది చదవండి: కరోనా వల్ల తిరుమలకు రాలేకపోతున్నారా..? భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ...


    అయితే ఈ నివేదికలోని అంశాలు నిజం కావాలంటే కొవిడ్ కట్టడి చర్యలు పటిష్టంగా అమలవ్వాలి. అదేసమయంలో ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తే రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గే అవకాశముందని నిపుణులు, డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఎవరెన్ని లెక్కలు చెప్పినా.. ప్రజల్లో మార్పు వస్తేనే వైరస్ ను అడ్డుకోగలమని మరికొందరు చెబుతున్నారు.
    Published by:Purna Chandra
    First published: