హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP News: ప్రభుత్వ కార్యాలయాలకు పవర్ కట్.. షాకిచ్చిన అధికారులు.. కారణం ఇదే.. ఎక్కడంటే..!

AP News: ప్రభుత్వ కార్యాలయాలకు పవర్ కట్.. షాకిచ్చిన అధికారులు.. కారణం ఇదే.. ఎక్కడంటే..!

దాచేపల్లి తహసీల్దార్ కార్యాలయం

దాచేపల్లి తహసీల్దార్ కార్యాలయం

సాధారణంగా ఇళ్లలో పవర్ బిల్లు (AP Power Bill) సమయానికి కట్టకపోతే గడువు ముగిసిన తర్వాత విద్యుత్ శాఖ (AP Electricity Department) అధికారులు కనెక్షన్ కట్ చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల వైపు కన్నెత్తి చూడరు.

సాధారణంగా ఇళ్లలో పవర్ బిల్లు (AP Power Bill) సమయానికి కట్టకపోతే గడువు ముగిసిన తర్వాత విద్యుత్ శాఖ (AP Electricity Department) అధికారులు కనెక్షన్ కట్ చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల వైపు కన్నెత్తి చూడరు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో కోట్లాది రూపాయల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. ఐతే విద్యుత్ శాఖ కూడా ప్రభుత్వంలోనే ఉండటంతో ఇతర శాఖల కార్యాలయాలకు నోటీసులివ్వడం తప్ప పెద్దగా చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. ఐతే అలాంటి బకాయిలే ఇప్పుడు విద్యుత్ శాఖకు గుదిబండగా మారాయి. దీంతో కొన్ని చోట్ల అధికారులు ప్రభుత్వ కార్యలాయలకు షాకులిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పల్నాడు జిల్లా ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ శాఖ ఊహించని షాకిచ్చింది. కరెంటు బిల్లులు చెల్లించలేదంటూ దాచేపల్లి నగర పంచాయతీలోని అన్ని కార్యాలయలకు వెళ్లి ఫీజులు తీసుకెళ్లిపోయారు.

బకాయిలు చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులిచ్చినా, గుర్తుచేసినా చెల్లించకపోవడం అటుంచితే కనీసం స్పందించకపోవడంతో విద్యుత్ శాఖ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. అధికారుల చర్యతో అక్కడి ప్రభుత్వ కార్యాలయాలన్నీ అంధకారంలోనే ఉన్నాయి. దాచేపల్లిలోని ఎంపీడీ, ఎమ్మార్వో కార్యాలయాలు, రైతు భరోసా కేంద్రాలు (Rythu Bharosa Kendra), హెల్త్ సెంటర్స్, అంగన్ వాడీ సెంటర్, ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్, అంగన్‌ వాడీ సెంటర్లు, మోడల్ స్కూళ్లు, వాటర్ గ్రిడ్స్ తో అన్నింటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బకాయిల వసూలు విషయంలో ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఇలా పవర్ కట్ చేసినట్లు విద్యుత్ శాఖ సిబ్బంది తెలిపారు.

ఇది చదవండి: చాపకింద నీరులా కరోనా.. విజృంభిస్తున్న ఒమిక్రాన్.. ఏపీలో తాజా అప్ డేట్ ఇదే..!


పల్నాడు జిల్లాలోని దాచేపల్లిలోని దాదాపు రూ.17 కోట్ల విద్యుత్ బకాయిలు పెండింగ్ లో ఉన్నట్లు విద్యుత్ శాఖ చెబుతోంది. వీటిపై ఎన్నిసార్లు సమాచారమిచ్చినా, అడిగినా స్పందన లేదని సిబ్బంది అంటున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలన్నీ చెల్లిస్తే పవర్ రీకనెక్షన్ ఇస్తామంటున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో బకాయిల కారణంగా విద్యుత్ శాఖ భారీగా నష్టపోతోంది. ఇప్పటికే విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. దాచేపల్లిలో పవర్ కట్ చేయడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలన్నీ నిలిచిపోయాయి. ఆఫీసుల్లో ఫ్యాన్లు కూడా తిరగక పోవడంతో సిబ్బందికి తంటాలు తప్పలేదు. మరోవైపు వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

ఇది చదవండి: ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లోకి రూ.10 లక్షలు.. ఇలా అప్లై చేసుకోండి


రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే వందల కోట్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది. అన్ని కార్యాలయాలకు దాచేపల్లి తరహా ట్రీట్ మెంట్ ఇస్తే విద్యుత్ శాఖకు రావాల్సిన మొండిబకాయిలన్నీ వసూలవుతాయని ప్రజలంటున్నారు. మరి విద్యుత్ శాఖ యాశ్రన్ ప్లాన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

First published:

Tags: Andhra Pradesh, ELectricity, Guntur

ఉత్తమ కథలు