ఆంధ్రప్రదేశ్(AndhraPradesh)లోని పల్నాడు (Palnadu)జిల్లాలో పొదుపు సంఘాల మహిళలకు కోపోద్రేకులయ్యారు. మహిళా స్వయం సంవృద్ధి సంఘాల పొదుపు ఖాతాల నుండి డబ్బులు మాయమవడంతో డ్వాక్రా మహిళలకు కోపం కట్టలు తెంచుకుంది. దీంతో డ్వాక్రా మహిళా సంఘం సభ్యులు(Dwakra Group Womens) ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ ఘటన పల్నాడు జిల్లా యల్లమంద గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చెందిన డ్రాక్రా సంఘాల మహిళలు యల్లమందలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్(Chaitanya Godavari Grameen Bank) ఎదుట నిరసన వ్యక్తం చేశారు. యానిమేటర్లు,సి.సి.ఓ లు,బ్యాంక్ సిబ్బంది కలిసి నిరక్షరాస్యులమైన తమకు తెలియకుండా తమ ఖాతాల నుండి డబ్బు తీయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పొదుపు చేసుకున్న డబ్బును తమ ప్రమేయం లేకుండా ఎలా తీస్తారంటూ ప్రశ్నించారు. దీంతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా గ్రూప్ మహిళ సంఘాలు సైతం మండిపడుతున్నాయి.
బ్యాంక్ ఖాతాలో నగదు మాయం..
డ్వాక్రా సంఘాల పొదుపు ఖాతాలో నగదు మాయం కావడం ఏమిటని మహిళలు యల్లమందలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ను వివరణ అడిగారు. అయితే గ్రూప్ మహిళలే డబ్బు తీసుకోమని సంతకాలు పెట్టారని మేనేజర్ చెప్పడంతో షాక్ అయ్యారు. ఇదంతా మీకు తెలిసే జరిగిందని బ్యాంక్ అధికారులు చెబుతుంటే కాదు తమను మోసం చేశారని డ్వాక్రా గ్రూప్ మహిళా సంఘం సభ్యులు అంటున్నారు.
మహిళా మార్ట్ కోసం..
డ్వాక్రా గ్రూపు యానిమేటర్లు లోన్ ఇప్పిస్తామంటూ గ్రూపు ఆర్గనైజర్‌లకు మాయమాటలు చెప్పి సంతకాలు తీసుకున్నారని డ్వాక్రా మహిళలు మీడియాతో మొరపెట్టుకున్నారు. సంతకాల విషయమై యానిమేటర్లని ప్రశ్నించగా వారు ఇందులో తమ తప్పేం లేదని సి.సి సుజాత తమతో ఇలా చేపించారని తెలియజేశారు. ఇదంతా మహిళా మార్ట్ కోసమేనని అధికారులు చెప్పడంతో మహిళలు బిక్కమొహాలు పెట్టుకున్నారు.
షాక్ అయిన మహిళలు..
కష్టపడి తాము పొదుపు చేసుకున్న డబ్బులు ఇలా తమని మోసం చేసి గ్రూపుకు రెండు వేల రూపాయల చొప్పున మొత్తం 500 గ్రూపుల నుండి 10 లక్షల రూపాయలు వరకు మార్ట్ కోసం అంటూ తీసుకోవడం జరిగింది. దీన్ని నిరసిస్తూ మహిళలు బ్యాంక్ ఎదుటే నిరసన తెలిపారు. ఇలాంటి సంఘటనల వలన పొదుపు సంఘాలపైన ,బ్యాంకులపైన తమకు నమ్మకం సన్నగిల్లుతుందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అసలేమిటి మహిళా మార్ట్..? అక్కడ ఏం దొరుకుతాయి..?
మహిళా సమాఖ్యలో సభ్యులుగా ఉన్న మహిళలే యజమానులుగా ఏర్పాటు చేసేదే జగనన్న మహిళా మార్ట్. ఇక్కడ నిత్యవసర సరకులతో పాటు మహిళాసంఘాలు తయారు చేసిన వస్తువులు పాలు,కూరగాయలు వంటి అన్ని రకాల సరుకులు అందుబాటులో ఉంటాయి. సమాఖ్య సభ్యులు ఒక్కొక్కరు రూ.150 చొప్పున మూలధన నిధికి జమచేస్తారు. తద్వారా రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పెట్టుబడి నిధి సమకూరుతుంది. మెప్మా మరో రూ.3 లక్షలు సమకూరుస్తుంది. మున్సిపాలిటీ స్థలం కేటాయించటమేగాక సంబంధిత పట్టణాభివృద్ధి సంస్థ సహకారంతో భవనాన్ని సైతం నిర్మిస్తుంది.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నా వడ్డీ వంటి పథకాలను కూడా ఈ మార్ట్‌కు వర్తింపజేస్తారు.
కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం..
మార్ట్ కు అవసమైన సరుకుల సరఫరా కోసం కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు మెప్మా సహకరిస్తుంది.కార్పొరేట్ సంస్థలు నిర్వహిస్తున్న సూపర్ మార్కెట్లకు దీటుగా జగనన్న మహిళా మార్ట్‌లను నిర్వహించాలనేది ప్రభుత్వ లక్ష్యం.నిర్వహణ కోసం సమాఖ్యలోని 10 మంది సభ్యులతో కమిటీని మెప్మా ఏర్పాటు చేస్తుంది. సమాఖ్య మార్ట్‌లో 10 మంది సిబ్బందిని నియమించుకుంటుంది.సమాఖ్య సభ్యులకు లాభాల్లో వాటాను 6 నెలలకు ఓసారి డివిడెండ్ రూపంలో పంపిణీ చేస్తారు.ఈ మార్ట్‌లో కొనుగోలు చేసే నిత్యవసర సరుకులు పై సమాఖ్య సభ్యులకు 3 శాతం రాయితీ కూడా ఇస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Dwakra, Gunturu