Anna Raghu, Guntur, News18
మన దేశంలో ఆయుర్వేదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో దొరికే దినుసులతోనే రోగాలు తగ్గించగలిగే సత్తా ఆయుర్వేదానికి ఉంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యం ఆయుర్వేదం సొంతం. కరోనా సమయంలో ఆయుర్వేదంపై విపరీతమైన ప్రచారం జరిగింది. ఇప్పుడు ఒమిక్రాన్ కలకలం రేపుతున్న నేపథ్యంలో ఆయుర్వేదంపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వింటర్ సీజన్.. పైగా ఒమిక్రాన్ టెన్షన్ తో గాడిదపాలకు డిమాండ్ పెరుగుతోంది. గాడిద పాలు తాగటం వల్ల చలికాలంలో పిల్లలకు చేసే నెమ్ము, జలుబు ఉబ్బసం వ్యాధులను అరికకట్టటంలో ఎంతో బాగా పనిచేస్తుందనే అలాగే గాడిద పలు త్రాగితే ఓమైక్రాన్ వంటి వాటిని ఎదురుకునే రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచే ప్రోటీన్లు సైటోకిన్ల విడుదలను ప్రోత్సహించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
అంతేకాదు గాడిద పాలల్లో యాంటీ మైక్రోబాయాల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల అంటువ్యాధులు, బ్యాక్టీరియా, ఇతర వైరస్ ల నుంచి దూరం చేసేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెంచుతాయి. పూర్వకాలంలో ఆవు పాలు తల్లి పాల వంటివి అనే నానుడి ఉండేది. కానీ ఆవు పాలతో పోలిస్తే.. గాడిద పాలలో ఐదు రెట్లు తక్కువ కెసిన్, సమానస్థాయిలో ప్రొటీన్లు కలిగి ఉంటాయి. అందుకనే వీటిని తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.
గాడిద పాలు మానవ రొమ్ము పాలు, ఆవు పాలతో సమానమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయట. అందుకనే శిశువులకు ఇవి పట్టించడం మంచిదని అంటుంటారు.వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి తాగడం వల్ల శరీరానికి కేలరీలు, విటమిన్- డి ఎక్కువగా అందుతాయి. ఇవి లాక్టోస్ రూపంలో ఉంటాయి. అంతేకాదు గాడిద పాల వల్ల ఆర్థరైటిస్, దగ్గు జలుబు లాంటి ఇన్ఫెక్షన్లను నయం చేయడంతో పాటు గాయాలకు చికిత్స చేసేందుకు గాడిద పాలు ఉపయోగిస్తారు.
దీంట్లోని యాంటీ-మెక్రోబయాల్ లక్షణాలు అంటువ్యాధులు, బ్యాక్టీరియా, ఇతర వైరస్లు నుంచి దూరం చేసేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా అలెర్జీని దూరం చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గాడిద పాలు రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచే ప్రోటీన్లు సైటోకిన్ల విడుదలను ప్రోత్సహించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
గాడిద పాలు ఆహార పదార్థంగా కంటే ఎక్కువ సౌందర్య సాధనంగా పనిచేస్తాయి. శరీరానికి అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తాయి. సూర్యరశ్మి వలన కలిగే ఆక్సీకరణ నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి. తద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయట. గాడిద పాలతో స్నానం చేయించడం వల్ల మెత్తని, మృదువైన చర్మం సొంతం చేసుకోవటానికి.దోహద పడుతుంది. ప్రస్తుతం ఈ గాడిదల పాలను కాస్మొటిక్ , సోప్స్, ఉత్పత్తులు, ఫేస్ వాష్, షాంపూల తయారీలో వాడుతున్నారు. గాడిద పాలు మంచి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ దీని సొంతమని ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆరనైజేషన్ (ఎఫ్ఏవో) తెలియజేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.