డాక్టర్లను ప్రాణం పోసే దేవుళ్లంటారు. కొంత మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసే విధానం చూస్తే ఈ మాట నూటికి నూరు శాతం కరెక్ట్ అనిపిస్తుంది. మెదడులో కణతి తొలగించడానికి మత్తు ఇవ్వకుండా చేయాల్సిన సర్జరీని గుంటూరు(Guntur)లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. కాలు, చెయ్యిని ప్రభావితం చేసే మెడదులోని నరాలు దెబ్బతినకుండా సూపర్ స్టార్ కృష్ణ(Superstar Krishna)నటించిన అగ్నిపర్వతం (Agniparvatham)సినిమా చూపిస్తూ ఆపరేషన్ చేశారు డాక్టర్లు. సర్జరీ (Surgery)సక్సెస్ కావడంతో రోగి బంధువులు హర్షం వ్యక్తం చేశారు.
సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ..
ఆ మధ్య హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన అడవిదొంగ సినిమా చూపించి ఓ మహిళకు ఆపరేషన్ చేసినట్లుగానే ..గుంటూరులోని శ్రీసాయి హాస్పిటల్ వైద్యులు కూడా అదే తరహాలో సర్జరీ చేశారు. ఆంజనేయులు అనే రోగికి న్యూ సర్జన్లు మత్తు ఇవ్వకుండానే కృష్ణ నటించిన అగ్నిపర్వతం సినిమా చూపిస్తూ మెదడు ఆపరేషన్ పూర్తి చేశారు. ప్రకాశం జిల్లా పుల్లలచెర్వు మండలం ఇసుకత్రిపురాంతకం గ్రామానికి చెందిన గోపనబోయిన పెద ఆంజనేయులు ఫిట్స్ వస్తుండటంతో మందులు వాడుతూ వచ్చారు కుటుంబ సభ్యులు. ఏళ్లు గడుస్తున్నా తగ్గకపోవడంతో గత నెలలో గుంటూరులోని శ్రీసాయి ఆసుపత్రి వైద్యులకు చూపించారు.
గుంటూరు డాక్టర్ల టాలెంట్ ..
పేషెంట్ ఆంజనేయులు మెదడులో కాళ్లు, చేతులపై ప్రభావం చూపించే నరాలకు అంటుకొని ఉన్న కణతిని గుర్తించారు. 7.5సెంటీమీటర్లున్న కణతిని మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేసి తీసే పరిస్థితి రావడంతో వైద్యులు పేషెంట్‌ని మానసీకంగా దృఢంగా ఉంచేందుకు కేవలం స్కాల్ప్ బ్లాక్ ఎనస్తీషియా ఇచ్చి సర్జరీ చేశారు. అయితే ఆపరేషన్ చేస్తున్న సమయంలో రోగికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ..మనసును మళ్లించేందుకు అగ్నిపర్వతం సినిమా చూపించారు. అంతే కాదు ఏపీ సీఎం జగన్ అంటే తనకు ఇష్టమని చెప్పడంతో ఆయన ప్రమాణస్వీకారం చేస్తున్న వీడియోని చూపించారు.
సర్జరీ సక్సెస్..పేషెంట్ డిశ్చార్జ్..
ప్రకాశం జిల్లాకు చెందిన ఆంజనేయులుకు గత నెల 25న ఈ అరుదైన సర్జరీ చేశారు. ఆపరేషన్ సక్సెస్ కావడం, రోగి త్వరగానే కోలుకోవడంతో శనివారం డిసెంబర్ 3వ తేదిన డిశ్చార్జ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Guntur, Surgery twit