బిగ్ బాస్ షో, అవతార్ మూవీ చూపిస్తూ మెదడుకు ఆపరేషన్.. రికార్డు సృష్టించిన గుంటూరు డాక్టర్లు

ఓ ముఖ్యమైన మెదడుకు సంబంధించిన ఓ శాస్త్రచికిత్సను గుంటూరు వైద్యులు చాలా విచిత్రంగా, అత్యంత విజయవంతంగా పూర్తి చేశారు. ఆపరేషన్ జరుగుతున్నంత సేపు రోగికి బిగ్‌బాస్‌ షో, అవతార్‌ సినిమాను చూపించారు. ఈ సమయంలో రోగి స్పందిస్తున్న తీరు, ఆయన మెదడులో సంభవిస్తున్న పరిణామాలను గమనిస్తూ శస్త్ర చికిత్స పూర్తి చేశారు.

news18-telugu
Updated: November 21, 2020, 10:42 AM IST
బిగ్ బాస్ షో, అవతార్ మూవీ చూపిస్తూ మెదడుకు ఆపరేషన్.. రికార్డు సృష్టించిన గుంటూరు డాక్టర్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సాధారణంగా ఏదైనా ఆపరేషన్ అంటేనే రోగితో పాటు అతని కుటుంబ సభ్యులు సైతం భయపడతారు. ఆపరేషన్ ఎలా పూర్తవుతుంది? విజయవంతం అవుతుందా?లేదా? అన్న ఆందోళనే ఇందుకు కారణం. ఇంకా మెదడు లాంటి సున్నితమైన భాగాల్లో శస్త్రచికిత్స అంటే భయం ఇంకా అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఏ మాత్రం తేడా వచ్చినా రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. చాలా అనుభవం కలిగిన డాక్టర్లు కూడా అలాంటి ఆపరేషన్ల సమయంలో చాలా అప్రమత్తంగా ఉంటారు. అయితే అలాంటి ఓ ముఖ్యమైన మెదడుకు సంబంధించిన ఓ శాస్త్రచికిత్సను గుంటూరు వైద్యులు చాలా విచిత్రంగా, అత్యంత విజయవంతంగా పూర్తి చేశారు. ఆపరేషన్ జరుగుతున్నంత సేపు రోగికి బిగ్‌బాస్‌ షో, అవతార్‌ సినిమాను చూపించారు. ఈ సమయంలో రోగి స్పందిస్తున్న తీరు, ఆయన మెదడులో సంభవిస్తున్న పరిణామాలను గమనిస్తూ శస్త్ర చికిత్స పూర్తి చేశారు. ఈ శస్త్ర చికిత్సకు రోగి నుంచి రూపాయి కూడా తీసుకోకపోవడం విశేషం. మొత్తం భీమా ద్వారానే ఈ ఆపరేషన్ నిర్వహించారు.

డాక్టర్లు భవనం హనుమా శ్రీనివాసరెడ్డి, శేషాద్రి శేఖర్‌, త్రినాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పెదకూరపాడు మండలం పాటిబండ్లకు చెందిన వరప్రసాద్‌(33)కు మెదడులో కణితి(బ్రెయిన్‌ ట్యూమర్‌) వచ్చింది. అయితే ఆ కణితిని 2016లో హైదరాబాద్‌లో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి తొలగించారు. అనంతరం పలు మార్లు రేడియేషన్‌ ఇచ్చినా ఫలితం దక్కలేదు. కొన్ని నెలలుగా ఆయనకు మళ్లీ ఫిట్స్ వస్తుండడంతో కుటుంబ సభ్యులు గుంటూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ పరీక్షించిన వైద్యులు మెదడులో కణితి మళ్లీ పెరిగిందని నిర్ధారించారు. అయితే ఈ సారి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించేందుకు వైద్యులు పక్కాగా ప్లాన్ చేశారు.

నావిగేషన్ సాంకేతికతో కణితి ఎక్కడ ఉందే అక్కడ మాత్రమే తెరిచి తొలగించాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం ఈ నెల 10 వ తేదీన మెదడు త్రీడీ మ్యాప్‌ను తయారు చేసుకున్నారు. అయితే మాటలు, సంభాషణలకు కీలకమైన ప్రాంతం కావడంతో వైద్యులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. రోగిని మెలుకువగానే ఉంచి ఆయన మాట్లాడుతుండగా మెదడులో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తూ సర్జరీని సక్సెస్ చేశామని వైద్యులు వివరించారు. రోగి కోలుకోవడంతో శుక్రవారం డిశ్చార్జి చేసినట్లు చెప్పారు. శస్త్రచికిత్సలో పాల్గొన్న ముగ్గురు డాక్టర్లు గుంటూరుకు చెందిన సర్వజనాస్పత్రికి చెందిన వారే కావడం విశేషం.
Published by: Nikhil Kumar S
First published: November 21, 2020, 10:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading