GUNTUR DID YOU KNOW LORD BRAHMA HAD A TEMPLE IN ANDHRA PRADESH IT IS VERY SPECIAL NGS GSU NJ
Lord Brahma: బ్రహ్మదేవుడి ఆలయాన్ని ఎప్పుడైనా చూశారా? కోనేరు మధ్యలో వెలిసిన సృష్టికర్త.. ప్రత్యేకత ఏంటంటే?
బ్రహ్మదేవుడి ఆలయం
Lord Brahma: బ్రహ్మదేవుడి గురించి అందరికీ తెలుసు.. కానీ పూజలు, మొక్కలు ఏమీ ఉండవు.. అసలు ఆలయమే ఎక్కడ కనిపించదు.. ఎవరైనా బ్రహ్మదేవుడి ఆలయాన్ని ఎక్కడైనా చూశారా..? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి.. మన ఆంధ్ర ప్రదేశ్ లోనే బ్రహ్మ దేవుడికి ప్రత్యేక ఆలయం ఉంది. దాన్ని ప్రత్యేకత ఏంటో తెలుసా..?
Lord Brahma Temple: భృగు మహర్షి శాపం కారణంగా భూమి మీద బ్రహ్మదేవుడికి ఎక్కడా పూజలు జరగవు.. ఆలయాలు కూడా ఉండవు అని పురాణాలు చెబుతున్నాయి. కానీ రాజస్థాన్ (Rajsthan) లో పుష్కర్, తమిళనాడు (Tamilnadu) లోని కుంభకోణం (kumbhskonam), కాశీ (kasi)లో ఒక ఆలయం.. అలాగే మన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనూ ఓ ఆలయం ఉందని మీకు తెలుసా? ఆ ఆలయం ప్రత్యేకతలు ఏంటో తెలుసా..? పురాణాలు చెబుతున్నదాని ప్రకారం.. సృష్టికర్త, త్రిమూర్తులలో ప్రథమ స్థానం బ్రహ్మది. కానీ ఇతర దేవుళ్ల లా బ్రహ్మ దేవుడికి పూజలు ఉండవు. ఆలయాలూ ఉండవు. అందుకు కారణం భృగు మహర్షి శాపమే కారణమన్నది మన పూర్వికుల నుంచి చెబుతూనే ఉన్నారు. భూలోకంలో బ్రహ్మ దేవుడి (Lord Brahma) కి ఆలయాలు ఉండవని, పూజలు జరగవని పురాణాల ప్రకారం చెబుతారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే? బ్రహ్మ దేవుడికి కూడా ఆలయాలు ఉన్నాయి. అవి కూడా చాలా ప్రత్యేకమైనవి..
బ్రహ్మదేవునికి ఉన్న అతి కొద్ది ఆలయాలలో చేబ్రోలులో ఉన్న ఆలయం ఒకటి. ఇక్కడి చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆలయాన్నిరెండో కాశీగా పిలుస్తారు. బ్రహ్మకు ప్రత్యేక రూపం లేక శివ లింగం రూపంలోనే, నాలుగు వైపులా అందంగా చెక్కబడిన నాలుగు బ్రహ్మ ముఖాలతో దర్శనమిస్తాడు. శివలింగం చుట్టూ బ్రహ్మ నాలుగు ముఖాలతో ఉండటంతో ఆలయానికి విచ్చేసిన భక్తులు, ఒకేసారి శివుడిని, బ్రహ్మదేవుడిని దర్శించుకున్న అనుభూతిచెందుతారు.
ఆలయచరిత్ర:
18వ తాబ్దంలో రాజావాసి రెడ్డి వెంకటాద్రి నాయుడు.. తన రాజ్యంలో దోపిడి దొంగల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుంటాడు. దీంతో రాజా వాసిరెడ్డి ప్రమాణం చేసి దొంగలందరూ దొంగతనాలు విడిచి లొంగిపోతే వారెవరిని శిక్షించను అనిప్ర ప్రకటిచంచారు. దీంతో దొంగలంతా రాజు మాటలు నమ్మి సరే అన్నారు. రాజు ముందు లొంగి పోయారు. వారందరికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి.. అందులో విషపదార్థం కలపడంతో వారంతా అసువులుబాసారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆడిన మాట తప్పి.. దొంగలందరిని వధిస్తాడు. అయితే దొంగల సమస్య తీరింది అనుకొన్నారందరు. కానీ రాజుకి మరో సమస్య ఎదురైంది.
సామూహికంగా మనుషులను చంపించిన పాపం తనను పట్టిపీడిస్తుందన్న భావనతో కుంగిపోయి, మనశ్శాంతి లేక అన్నపానాదాలు సహించక నిష్కృతి కోసం దేవస్థాన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక.. బ్రహ్మ దేవాలయం నిర్మాణం చేయాలని రాజుకు పండితులు సూచించారు. దీనికి నివారణోపాయంగా 4 దిక్కుల్లో శివ–కేశవ ఆలయాలు నిర్మించాలని సూచిస్తారు. బ్రహ్మదేవుడిని లింగాకారంలో మలిచి ఆ దేవుడి దృష్టి బయటకు వెళ్లకుండా అష్టదిగ్బంధనం చేశారు. ఆలయానికి ముందు వెనుక శివాలయాలు, రెండు పక్కల వైష్ణవ ఆలయాలు నిర్మించారు. మిగిలిన 4 మూలలా ఇతర దేవతా మూర్తులను ప్రతిష్టించి ఎనిమిది దిక్కుల నుంచి బ్రహ్మదేవుని దృష్టిని ముందుకు సాగకుండా అరికట్టారు. ఈ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరుడి ఆలయ నిర్మాణంతో రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు మనసు శాంతించిందని చెబుతారు. ఈ ఆలయఉత్సవ, దీపారాధన, నైవేద్యాది కైంకర్యాలకు, దేవదాసీలు, భజంత్రీలు, అర్చకులు వగైరా అవసరాలకు ఆయర ఆదాయాన్ని సమకూర్చారు. అలా జా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు కోనేరులో బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. లింగాకారంలో చతుర్ముఖలు కలిగిన బ్రహ్మ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు.
అష్టదిగ్భందనం
బృహస్పతికి బ్రహ్మఅది దేవత కావడంతో.. గురు గ్రహ అనుగ్రహం కోసం గురువారం, ఆదివారం ఉదయం ఇక్కడ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. శ్రీసహస్రలింగేశ్వరాలయం (తూర్పుపడమరనశివాలయాలు), దక్షిణదిక్కున శ్రీరంగనాథస్వామి ఆలయం, ఉత్తరం వైపున శ్రీవేణుగోపాలస్వామి దేవస్థానం.. నాలుగు మూలల అమ్మవార్ల దేవాలయాలతో అష్టదిగ్భందనం చేసి కోనేరు మధ్యలో ఈ బ్రహ్మ ఆలయం నిర్మించారు.
చేబ్రోలులో బ్రహ్మ ఆలయాన్ని 1817 లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించారు. ఆలయ కట్టడాలు, శివలింగం.. అన్నీ కాకతీయ వాస్తు శైలిని పోలి ఉన్నాయి. పెద్ద కోనేరును తవ్వించి, దాని మధ్యలో ఆలయాన్ని నిర్మించి, బ్రహ్మదేవుడిని ప్రతిష్టించారు పద్మాకారంలో ఉండే పానపట్టం పై లింగానికి నాలుగు వైపులా బ్రహ్మ 4 ముఖాలనూ రూపొందించారు. గర్భగుడికి నాలుగు ద్వారాలు ఉండటం మరో విశేషం. భక్తులు ఎటునుంచైనా స్వామిని దర్శించుకోవచ్చు. బ్రహ్మ దేవుడి ఆలయం చుట్టూ మరెన్నో దేవాలయలున్నాయి. ఎనిమిది దిక్కుల్లోనూ ఎనిమిది దిక్పాలకులకు దేవాలయాలుండటం మరో ప్రత్యేకత.
ఈ ఆలయానికిఎలావెళ్లాలి?
ఈ ఆలయానికి వెళ్లాలంటే రైలు, బస్సు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఈ బ్రహ్మాలయానికి 65 కిలోమీటర్ల దూరంలో గన్నవరం విమానాశ్రయం ఉంది. 16 కిలోమీటర్ల దూరంలో గుంటూరు రైల్వే స్టేషన్ ఉంది. గుంటూరు నుంచి బస్సు, ఆటో సౌకర్యం ఉంది. గుంటూరు నుంచి పొన్నూరు వేళ్ళు మార్గంలో చేబ్రోలు సెంటర్ మెయిన్ రోడ్డును ఆనుకొని ఈ ఆలయం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.