హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Dusserha 2022: దసరాకు పూజించే జమ్మి చెట్టుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Dusserha 2022: దసరాకు పూజించే జమ్మి చెట్టుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

దసరా రోజు పూజించే జమ్మి చెట్టుతో ప్రయోజనాలు ఎన్నో?

దసరా రోజు పూజించే జమ్మి చెట్టుతో ప్రయోజనాలు ఎన్నో?

Dussehra 2022: విజయదశమి వేడుక అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది జమ్మి చెట్టు.. ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు చేయడమే కాదు.. ఈ చెట్టుతో ఎన్నో ఆరోగ్య ప్రయజనాలు ఉన్నాయి. తెలుసా?

  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

    Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

    Dussehra: మ‌న‌కు చెట్లు (Trees) ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.  ప్ర‌కృతి (Nature) లో అనేక ర‌కాల చెట్లు ఉంటాయి. ఈ భూమి మీద ఉండే చెట్లు మ‌న‌కు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉంటాయి. అందులో  కొన్ని ర‌కాల చెట్ల‌కు మ‌నం పూజ‌లు కూడా చేస్తూ ఉంటాం. అలా మ‌నం పూజించే చెట్ల‌ల్లో జ‌మ్మి చెట్టు (Jammi Tree) కూడా ఒక‌టి. దేవ‌తా వృక్షాల‌లో జ‌మ్మి చెట్టుకు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. మ‌న పురాణాల్లో కూడా జ‌మ్మి చెట్టు గురించి ప్ర‌స్తావ‌న ఉంది.  చాలా మంది భక్తులు జమ్మి చెట్టు పాపాల‌ను పోగొడుతుందని నమ్ముతారు.. శ‌త్రువుల‌ను (Enemies) కూడా నాశ‌నం చేస్తుంద‌ని పండితులు చెబుతున్నారు. శ్రీ‌రాముడు రావ‌ణాసురుడిపై యుద్దానికి వెళ్లే ముందు జ‌మ్మి చెట్టుకు పూజ చేసి వెళ్లి విజ‌యం సాధించాడ‌ంటారు. అందుకే దశమి రోజు జమ్మికి  ప్రత్యేక పూజలు చేస్తారు.

    అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు పాండ‌వులు వారి ఆయుధాల‌ను జ‌మ్మి చెట్టు మీద ఉంచి, తాము వ‌చ్చే వ‌ర‌కు ఆయుధాల‌ను కాపాడ‌మ‌ని ఆ చెట్టుకు మొక్కి వెళ్తారు. అజ్ఞాతవాసం ముగిసిన త‌రువాత విజ‌య‌ద‌శ‌మి రోజున చెట్టు మీది నుండి ఆయుధాల‌ను తీసుకుని కౌర‌వుల‌పై యుద్ధం చేసి విజ‌యం సాధిస్తారు. అప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు విజ‌య‌ద‌శ‌మి రోజున జ‌మ్మి చెట్టుకు మ‌నం పూజ‌లు చేస్తూనే ఉన్నాం.

    జ‌మ్మి చెట్టుకు పూజ‌లు చేయ‌డం వ‌ల్ల అన్ని ప‌నుల్లో విజ‌యం చేకూరుతుందని మ‌న‌లో చాలా మంది విశ్వ‌సిస్తారు. విజ‌య‌ద‌శ‌మి రోజున జ‌మ్మి చెట్టుకు పూజ చేసి ఆ చెట్టు ఆకుల‌ను పెద్ద‌ల‌కు ఇచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. అలాగే

    వినాయ‌క చ‌వితి రోజున.. చేసే ప‌త్రి పూజ‌లో కూడా జ‌మ్మిచెట్టు ఆకుల‌ను ఉంచుతారు. జ‌మ్మి చెట్టును హోమ‌ద్ర‌వ్యంగా కూడా ఉప‌యోగిస్తారు. జ‌మ్మిచెట్టు మ‌న‌కు విజ‌యాల‌నే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ప్ర‌సాదిస్తుంది.

    ఇదీ చదవండి : రైతులకు బిగ్ అలర్ట్.. ఆ పథకాలు పొందాలి అంటే.. ఈ నెల 12 వరకే గడువు.. కేవైసీ ఇలా చేసుకోండి

    ఆయుర్వేదంలో జ‌మ్మి చెట్టును అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే ఔష‌ధంగా కూడా ఉప‌యోగిస్తారు. జ‌మ్మిచెట్టు ప్ర‌తిభాగం కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. జ‌మ్మిచెట్టు నుండి వీచే గాలి ఎంతో శ్రేష్ట‌మైన‌ది. ఈ చెట్టు గాలిని పీల్చ‌డం వ‌ల్ల ఎన్నో రోగాలు న‌యం అవుతాయని ఆయుర్వేద నిపుణులు డాక్టర్ ఆర్ శ్రీనివాస్ చెబుతున్నారు. జ‌మ్మి ఆకుల ప‌స‌రును లేప‌నంగా రాయ‌డం వ‌ల్ల కుష్టు వ్యాధి న‌యం అవుతుంది. జ‌మ్మి ఆకుల‌ను, జ‌మ్మి చెట్టు బెర‌డును, మిరియాల‌ను క‌లిపి మెత్త‌గా నూరి మాత్ర‌లుగా చేసుకుని నిల్వ చేసుకోవాలి.

    ఇదీ చదవండి: నేడు తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడనం ప్రభావం..? ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి అంటే..?

    ఈ మాత్ర‌ల‌ను మ‌జ్జిగ‌తో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల అతిసారం త‌గ్గుతుంది. జ‌మ్మి ఆకుల ప‌స‌రును రాసుకోవ‌డం వ‌ల్ల అవాంఛిత రోమాలు తొల‌గిపోతాయి. ఈ చెట్టు బెర‌డును నూరగా వ‌చ్చిన గంధాన్ని విష‌కీట‌కాలు కుట్టిన చోట రాయ‌డం వ‌ల్ల విష ప్ర‌భావం త‌గ్గుతుంది. ఎండిన జ‌మ్మి ఆకులను కాల్చ‌గా వ‌చ్చే పొగ‌ను క‌ళ్ల‌కు చూపించ‌డంతో  క‌ళ్ల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అన్ని కాలాల‌లో ప‌చ్చ‌గా ఉండే జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే అక్క‌డ భూమిలో నీరు పుష్క‌లంగా ఉంటుంది.

    ఇదీ చదవండి 50 లక్షలు ఇచ్చినా వదిలిపెట్టమన్నారు.. కోటి డిమాండ్ చేశారు.. చివరకు బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. ఏం జరిగింది అంటే?

    ఇక ఎండిన జ‌మ్మి ఆకుల‌ను భూమిలో వేసి దున్న‌డం వ‌ల్ల భూమి సార‌వంత‌మ‌వుతుంది. ఈ విధంగా జ‌మ్మి చెట్టు మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని  డాక్టర్.ఆర్.శ్రీనివాస్ చెబుతున్నారు.

    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Dussehra 2022, Navaratri, Vijya dashami

    ఉత్తమ కథలు