Home /News /andhra-pradesh /

GUNTUR DAUGHTER LOOTED IN HIS OWN HOUSE IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

Daughter: ఈ మహాతల్లి చూడండి ఏం ఘనకార్యం చేసిందో..! పుట్టిల్లు అనే ఇంగిత జ్ఞానం కూడా లేదా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) తాడికొండ గ్రామంలోని తూర్పు బజారులో ముల్లపాటి వీరభద్రరావు నివాసముంటున్నాడు. గతంలో సైన్యంలో పనిచేసిన వీరభద్రరావు ప్రస్తుతం స్వగ్రామమైన తాడికొండలో ఇల్లు ఏర్పాటు చేసుకొని అక్కడే ఉంటున్నాడు.

ఇంకా చదవండి ...
    Anna Raghu, Guntur, News18

    ఈ రోజుల్లో బంధాలకు బంధుత్వాలకు తావేలేదు డబ్బే అన్నిటి కి మూలం. ప్రపంచాన్ని శాసించేది.. బిచ్చగాడిని అయ్యగారిని చేసేది డబ్బు. ఆ డబ్బు కోసం అయిన వాళ్లను కూడా లెక్కచేయటం లేదు ఇప్పటి జనాలు. కాసులు కనిపిస్తే చాలు కన్నవారు, బయటివాళ్లు అనే తేడాలే కనిపించవు కొందరికి. ఓ మహతల్లి డబ్బుల కోసం పుట్టింటికే కన్నం వేసింది. అంతేకాదు అభం శుభం తెలియని కూతుర్ని కూడా ఇందులో భాగం చేసింది. భర్తతో కలిసి ఈ ఘనకార్యం వెలగబెట్టింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) తాడికొండ గ్రామంలోని తూర్పు బజారులో ముల్లపాటి వీరభద్రరావు నివాసముంటున్నాడు. గతంలో సైన్యంలో పనిచేసిన వీరభద్రరావు ప్రస్తుతం స్వగ్రామమైన తాడికొండలో ఇల్లు ఏర్పాటు చేసుకొని అక్కడే ఉంటున్నాడు.

    పదిహేనేళ్ల క్రితం తన కుమార్తె అనురాధను ప్రకాశం జిల్లా (Prakasham District) మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి చెందిన బ్రహ్మయ్య కు ఇచ్చి వివాహం చేశాడు. తన భార్య కాలం చేయటంతో తన కుమార్తె కూతురైన తన మనుమరాలిని దత్తత తీసుకొని తన వద్దే ఉంచుకొని చదివిస్తున్నాడు. ఇదిలా ఉంటే రెండు నెలల క్రితం వీరభద్రరావు ఇంట్లో దొంగ తనం జరిగింది. సుమారు నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయల విలువ చేసే సొత్తును గుర్తుతెలియని వ్యక్తులు దోచుకెళ్లారు.

    ఇది చదవండి: పెళ్లికి ముందే ప్రియుడితో సహజీవనం.. మూడు నెలల తర్వాత ట్విస్ట్...


    వీరభద్రరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఈ దొంగతనం చేసింది మరెవరో కాదు.. ఆయన కూతురు అనురాధ, అల్లుడు బ్రహ్మయ్య, మనవరాలైన దత్తపుత్రిక కలిసి పుట్టింటికే కన్నం వేశారు. తన తండ్రి దగ్గర డబ్బులుండటం గమనించిన అనురాధ.. భర్తతో కలిసి చోరీకి స్కెచ్ వేసింది. అందుకు అతడు అంగీకరించడంతో విషయాన్ని కుమార్తెకు చెప్పింది ఒప్పించింది.

    ఇది చదవండి: నా భర్తను వదిలేయ్.. ఎఫైర్ పెట్టుకున్న మహిళకు భార్య వార్నింగ్.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్..


    అనకున్న ప్లాన్ ప్రకారం ఓ రోజు రాత్రి తాడికొండ చేరుకున్న దంపతులు.. వీరభద్రరావు నిద్రపోయిన తర్వాత ఇంటికి వెళ్లారు. అప్పటికే వారి కుమార్తె తలుపులు తీసి ఉంచింది. సైలెంట్ గా ఇంట్లోకి ప్రవేశించిన అనురాధ, బ్రహ్మయ్య ఇంట్లో ఉన్న సొమ్ము తీసుకొని ఉడాయించారు. చోరీకి సంబంధించి పూర్తి ఆధారాలు సంపాందించిన పోలీసులు కేడీ దంపతులతో పాటు వారికి సహకరించిన మైనర్ బాలికను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కన్ను కూతురే పుట్టింట్లో చోరీచేయడంతో షాక్ తినడం వీరభద్రరావు వంతైంది. మొత్తానికి డబ్బు మనిషిని ఎంతకైనా దిగజారుస్తుందని దానికి తన, మన అనే తేడాలే లేవని మరోసారి రుజువైంది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Guntur, Theft

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు